Netizens Slam Super Dancer 3 After Video Shows Judges Asking Minor Vulgar Questions - Sakshi
Sakshi News home page

Super Dancer 3: డ్యాన్స్‌ షోలో అసభ్యకర ప్రశ్నలు..'మీకు కొంచెమైన సిగ్గుందా' అంటూ ఫైర్!

Published Wed, Jul 26 2023 9:53 PM | Last Updated on Thu, Jul 27 2023 9:41 AM

Netizens Slam Super Dancer 3 After Video Shows Judges Asking Vulgar - Sakshi

సోని పిక్చర్స్ నెట్‌వర్క్‌లో ప్రసారమవుతున్న రియాలిటీ షో సూపర్ డ్యాన్సర్ చాప్టర్ -3. ఈ షో చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులను చిలిపి ప్రశ్నలు వేస్తూ ఆడియన్స్‌ను నవిస్తుంటారు. ఈ షోకు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, కొరియోగ్రాఫర్ గీతా కపూర్, చిత్రనిర్మాత అనురాగ్ బసు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నారు. అయితే ఈ డ్యాన్స్‌ కాస్తా అసభ్యకరమైన చర్చలకు దారితీసింది. ఈ షోలో పాల్గొన్న చిన్నారులను అతని తల్లిదండ్రులను ఉద్దేశించి అసభ్యకరమైన, లైంగిక ప్రశ్నలు వేస్తూ జడ్జిలు నవ్వుకుంటున్నారని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

(ఇది చదవండి: కమెడియన్‌తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!)

దీనికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యూట్యూబ్‌లో అన్ని వయసుల వారికి వీడియో అందుబాటులో ఉందని నెటిజన్స్‌ ఫైరవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ జడ్జిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'చిన్న పిల్లలను ఇలాంటి ప్రశ్నలా అడిగేది.. మీకు అసలు కొంచెమైన సిగ్గుందా' అంటూ మండిపడుతున్నారు. మరో నెటిజన్ రాస్తూ..'ఇది చాలా అసహ్యంగా ఉంది. అస్సలు ఇది వినోదం కాదు. పిల్లలతో ఇలాంటివీ చెప్పిస్తారా?' ఫైరయ్యారు. 

కాగా.. జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టంలోని నిబంధనలను ఛానెల్ ఉల్లంఘించిందని ఎన్‌సీపీసీఆర్ పేర్కొంది. చైల్డ్ ఆర్టిస్ట్‌కు ఇలాంటి అనుచిత ప్రశ్నలు ఎందుకు అడిగారో వివరణ ఇవ్వాలని కూడా కమిషన్ కోరింది. లేఖ అందిన 7 రోజులలోపు కమిషన్‌కు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) సమర్పించాలని లేఖలో ఎన్‌సీపీసీఆర్ చైర్‌పర్సన్ ఆదేశించారు.  కాగా.. ఈ రియాలిటీ షో ఏప్రిల్ 2019 నుండి జూన్ 2019 వరకు ప్రసారం చేయబడింది.

(ఇది చదవండి: ఆష్విట్జ్‌ సీన్ వివాదం.. నెటిజన్స్‌కు జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement