స్టార్‌ హీరోయిన్‌ హోటల్‌లో చోరి.. ఫైర్‌ అయిన కస్టమర్‌ | Car Theft In Shilpa Shetty Bastian Restaurant In Mumbai, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోయిన్‌ హోటల్‌లో చోరి.. ఫైర్‌ అయిన కస్టమర్‌

Published Tue, Oct 29 2024 9:23 AM | Last Updated on Tue, Oct 29 2024 10:37 AM

Car Theft In Shilpa Shetty Bastian Restaurant

బాలీవుడ్‌ స్టార్‌ నటి శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్‌లో భారీ చోరీ జరిగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ముంబైలోని పలు ప్రాంతాల్లో బాస్టియన్‌ పేరుతో ఆమె రెస్టారెంట్స్‌ నిర్వహిస్తున్నారు. దాదర్‌లోని కోహినూర్ స్క్వేర్ బేస్‌మెంట్ పార్కింగ్‌లో ఉన్న కారు చోరీకి గురైంది.  

ఒక నివేదిక ప్రకారం.. బాంద్రాకు చెందిన  రుహాన్ ఖాన్ అనే వ్యాపారవేత్త తన స్నేహితులతో బాస్టియన్‌ రెస్టారెంట్‌కు వెళ్లాడు.   ఈ క్రమంలో తన కారును అక్కడే వ్యాలెట్ పార్క్ చేశాడు. స్నేహితులతో కలిసి డిన్నర్‌ పూర్తి అయిన తర్వాత వాలెట్ నుంచి తన కారును తీసుకురావాలని ఖాన్‌ కోరాడు. అయితే, పార్కింగ్‌ చేసిన ప్రదేశంలో కారు లేదు. దీంతో దొంగతనం జరిగిందని వారు గుర్తించారు. వెంటనే రెస్టారెంట్ సిబ్బంది  CCTV ఫుటేజీని పరిశీలించారు.

ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు జీప్ కంపాస్‌ వాహనంలో తెల్లవారుజామున 2 గంటలకు బేస్‌మెంట్‌లోకి ప్రవేశించినట్లు వెల్లడైంది. వారిలో ఒకరు ఖాన్‌కు సంబంధించిన  BMW Z4 కన్వర్టిబుల్ కారును చోరి చేశారని తేలింది. కారును అన్‌లాక్ చేయడానికి అధునాతన హ్యాకింగ్ పద్ధతులను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఆ కారు ధర సుమారు రూ. 90 లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం.

కారు ఓనర్‌  CCTV ఫుటేజీ ఆధారంగా శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.  శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్‌ భద్రతా చర్యలపై ఖాన్ ఫైర్‌ అయ్యాడు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరాడు. ఇంత సంఘటన జరిగినప్పటికీ, శిల్పా శెట్టి ఈ విషయంపై మౌనంగా ఉన్నారని ఆయన తప్పుపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement