child Rights Act
-
29మంది బాలలకు మరణశిక్ష
పిల్లలను రక్షించాల్సిన ప్రభుత్వమే వారిని శిక్షిస్తోంది. అన్యాయం, అసమానతలపై గొంతెత్తడమే వారి నేరమైంది. 29 మంది పిల్లలకు కోర్టు మరణశిక్ష విధించడం నైజీరియా లో సంచలనం రేపింది. అయితే బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలకు మరణ శిక్ష విధించడానికి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనుమతించకపోవడంతో బెయిలు మంజూరు చేసింది. నైజీరియాలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా జీవన వ్యయ సంక్షోభం నెలకొంది. సరైన విద్య, ఉపాధి లేదు. చివరకు ఆకలితో చనిపోయే రోజులొచ్చాయి. దీనిపై తీవ్రమైన నిరసనతో యువత సామూహిక నిరసనలను చేపట్టింది. ఆగస్టులో జరిగిన ఆందోళనల్లో దాదాపు 20 మందిని ప్రభుత్వం కాల్చి చంపింది. వందలాది మంది యువకులను అరెస్టు చేశారు. 76 మందిపై దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం సహా 10 ఆరోపణలతో కేసు వేశారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు.. వారందరికీ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ 76 మందిలో 29 మంది చిన్నారులు ఉండటం, వారంతా 14 నుంచి 17 ఏళ్లలోపు వారు కావడం సంచలనమైంది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో కోర్టు ఆవరణలోనే నలుగురు చిన్నారులు కుప్పకూలిపోయారు. అయితే నైజీరియా బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలపై క్రిమినల్ ప్రోసీడింగ్స్, మరణశిక్ష విధించడానికి అనుమతి లేదని బాలుర తరఫు లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల పూచికత్తుతో పాటు కఠినమైన ఆంక్షలు విదించింది. నైజీరియాలో 1970లో మరణశిక్షను ప్రవేశపెట్టారు. 2016 నుంచి ఉరిశిక్ష అమలులో లేదు. నైజీరియా కోర్టు సంచలన తీర్పు21 కోట్లకు పైగా జనాభా ఉన్న నైజీరియా జనాభా పరంగా ఖండంలో అతిపెద్దది. ఆఫ్రికాలో ముడిచమురు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. అయినా ప్రపంచంలోని పేద దేశాలలో ఒకటిగా ఉంది. ఇటీవలికాలంలో ద్రవ్యోల్బణం రేటు కూడా 28 ఏళ్ల గరిష్టానికి పెరిగింది. స్థానిక నైరా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఓవైపు ప్రజలు ఆకలితో చస్తుంటే.. ప్రభుత్వ అధికారుల జీవనశైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ దేశ రాజకీయ నాయకులు ఆరోపణలతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చట్టసభ సభ్యులు అత్యధిక పారితోíÙకం అందుకుంటున్నారు. ప్రభుత్వాధినేతలు, అధికారులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని తెలిపిన ఐక్యరాజ్యసమితి.. ఆహార సంస్థల నివేదికలో నైజీరియాను ‘ఆందోళన కలిగించే హాట్ స్పాట్’గా వర్గీకరించింది. ఈ నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగాలు, ఆహార భద్రతను డిమాండ్ చేస్తూ యువత ఆందోళనలు చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బాల్యానికి పెళ్లి బంధనం
నిమిషానికి ముగ్గురు బాలికలు బలవంతంగా పెళ్లి బంధంలో చిక్కుకుంటున్నారు. బాల్య వివాహాలను 1929లోనే నిషేధించింది ప్రభుత్వం. మరింత కట్టుదిట్టం చేస్తూ కఠినమైన శిక్షలతో ప్రోహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ – 2006’ను తెచ్చింది. అయినప్పటికీ ఏడాదికి 16 లక్షల బాల్య వివాహాలు జరుగుతున్నాయని అంచనా. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నిర్వహించిన సర్వే చెబుతున్నదిదీ. తాజా అధ్యయనాలు చెబుతున్న మరో వాస్తవం ఏమిటంటే... 20– 24 ఏళ్ల వివాహిత మహిళలను పెళ్లి నాటికి వాళ్ల వయసు ఎంతని అడిగితే వారిలో 23.3 శాతం మంది పద్దెనిమిదేళ్లలోపే పెళ్లయినట్లుచెప్పారు.⇒కోవిడ్‌కు ముందు 27 శాతంగా ఉన్న బాల్యవివాహాలు కోవిడ్ సమయంలో 33 శాతానికి పెరిగాయి. ఇది దేశ సరాసరి లెక్క. తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపుగా ఏమీ లేదు.⇒ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ‘బాల్య వివాహ రహిత జిల్లా’గా మార్చిన కలెక్టర్లకు అవార్డులు ప్రకటించారు. అప్పుడు వరంగల్ జిల్లా కలెక్టర్ జిల్లాలో బాల్యవివాహం జరగకుండా నివారించి అవార్డు అందుకున్నారు. ⇒ఒకప్పుడు తమిళనాడులో బాల్యవివాహాలు ఎక్కువగా ఉండేవి. జయలలిత ముఖ్యమంత్రిగా బాల్యవివాహాలను నివారణ కోసం ఆడపిల్లలకు డిగ్రీ వరకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌ల వంటి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రం దేశ సరాసరి కంటే చాలా మెరుగ్గా ఉంది.⇒కర్నాటక రాష్ట్రం కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేస్తూ ప్రచారం నిర్వహించి సమాజంలో మార్పు తెచ్చుకుంది.⇒అస్సాం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఆడపిల్లలకు పదేళ్లలోపే పెళ్లి చేసే ఆచారం ఉండేది. అస్సాం ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా వేగంగా మెరుగైన ఫలితాలను సాధిస్తోంది.⇒బాల్య వివాహాలను అరికట్టాలంటే... ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, హెల్త్, ఎడ్యుకేషన్, పోలీస్, రెవెన్యూ... ఈ ఐదు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయాలి.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధితొలి లెక్క పాఠశాల నుంచే!కోవిడ్ సమయంలో 1098 హెల్ప్‌లైన్‌కి 5,500 కాల్స్ వచ్చాయి. బాల్యవివాహం బారిన పడుతున్న అమ్మాయిలు, వారి స్నేహితుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ అవి. ఫోన్ కాల్స్ కూడా రాకుండా జరిగి΄ోయిన పెళ్లిళ్లు ఎన్నో. కోవిడ్ తర్వాత స్కూళ్లు తెరుచుకున్నప్పుడు తిరిగి స్కూల్‌కి వచ్చిన అమ్మాయిల లెక్క ఏ శాఖ దగ్గరా లేదు. పంచాయితీ సెక్రటరీ గ్రామస్థాయి చైల్డ్ మ్యారేజ్ ప్రోహిబిషన్ ఆఫీసర్. ΄ాఠశాల రిజిస్టర్ నుంచి మొదలు పెడితే కచ్చితమైన లెక్కలు రాబట్టవచ్చు.ప్రాథమిక పాఠశాల నుంచి హైస్కూల్‌కి కొనసాగే వాళ్లు 63 శాతం మాత్రమే. టెన్త్ పాసయిన అమ్మాయిల్లో కాలేజ్కెళ్లేవాళ్లు పాతిక శాతం మాత్రమే. మండలాల్లో కూడా కాలేజ్‌లు పెడితే ఆడపిల్లలందరూ చదువుకోగలుగుతారు. చదువుకుంటే బాల్య వివాహాలు వాటంతట అవే ఆగిపోతాయి. సామాజిక కార్యకర్తగా ఇరవై వేల బాల్య వివాహాలను ఆపగలిగాను. కొందరు మాత్రం మేము రాత్రంతా కాపు కాసి తెల్లవారు జామున అలా పక్కకు వెళ్లగానే తాళి కట్టించేసే వాళ్లు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా నేను స్వయంగా 78 కేసులు వేశాను. ఒక్క కేసులోనూ దోషులకు శిక్ష పడలేదు. -
అశ్లీల కంటెంట్... యూట్యూబ్‌కు సమన్లు
ఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్ భారత్ విభాగానికి నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సమన్లు జారీ చేసింది. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. అటువంటి ఛానెల్‌ల జాబితాతో జనవరి 15న తమ ముందు హాజరు కావాలని యూట్యూబ్ సంస్థ భారత్ విభాగ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ హెడ్‌ని కోరింది. ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో ఈ మేరకు భారతదేశంలోని యూట్యూబ్ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ అధిపతి మీరా చాట్‌కు లేఖ రాశారు. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన చర్యలను చిత్రీకరించే యూట్యూబ్ ఛానెల్‌లలో ఆందోళనకరమైన ధోరణిని కమిషన్ గుర్తించిందని ప్రియాంక కనూంగో అన్నారు. ‘వీడియోలలో’ తల్లులు, కొడుకుల మధ్య అసభ్యకరమైన చర్యలు, తల్లులు, యుక్తవయస్సులో ఉన్న కొడుకుల మధ్య ముద్దులు వంటివి ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ వీడియోలు లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే (పోక్సో) చట్టం- 2012ను ఉల్లంఘిస్తున్నాయి.' అని కమిషన్ గుర్తించిందని తెలిపారు. “యూట్యూబ్ దీన్ని పరిష్కరించాలి. నేరస్థులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వీడియోలను కమర్షియల్‌గా మార్చడం అంటే పోర్న్ అమ్మడం లాంటిది. పిల్లలు లైంగిక వేధింపులకు గురైన వీడియోలను ప్రదర్శించే ఏదైనా ప్లాట్‌ఫామ్ జైలుకు వెళ్లవలసి ఉంటుంది.”అని ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో తెలిపారు. ఇదీ చదవండి: అతిపెద్ద సముద్ర వంతెన.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం -
23 మంది బాలకార్మికుల పట్టివేత
అడ్డగుట్ట: బీహార్ నుంచి హైద్రాబాద్‌కు అక్రమంగా బాలకార్మికులను రవాణా చేస్తున్నట్లు కార్మిక శాఖ, బాలల హక్కుల సంఘం, బాలల సంరక్షణ విభాగం అధికారుల సమాచారంతో రైల్వే పోలీసులు పెద్ద సంఖ్యలో బాలకార్మికులను అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రానికి తరలించిన సంఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. జీఆర్పీ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...పాతబస్తీలోని గాజుల పరిశ్రమల్లో పని చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు బీహార్ నుంచి బాలలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. బాలల సంఘాల సమాచారంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. మంగళవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హైద్రాబాద్ జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి ఇంతియాజ్, గోపాలపురం ఏసీపీ శ్రీనివాస్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి తనిఖీలు ప్రారంభించారు. అర్థరాత్రి వచ్చిన దానాపూర్ ఎక్స్‌ప్రెస్ నుంచి దాదాపు 300 మంది చిన్నారులు, యువకులు కిందకు దిగడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. 23 మంది బాల కార్మికులను గుర్తించారు. కొన్ని ముఠాలు వీరిని నగరానికి తీసుకువచ్చి వివిధ పరిశ్రమల్లో పనిలో పెడుతున్న ట్లు తెలిపారు. తనిఖీల్లో భాగంగా బల్లార్షాలో 10 మంది, నాగ్‌పూర్‌లో 40 మంది, కాజీపేట్‌లో 16 మంది బాలకార్మికులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని తరలిస్తున్న ముఠా సభ్యుల కోసం గాలింపు చేపట్టామన్నారు. -
బట్టీల్లో బాల్యం
♦ బుగ్గి అవుతున్న భవిష్యత్తు ♦ పెద్దలతో పాటే పిల్లలూ పనుల్లో.. ♦ యథేచ్ఛగా ఇటుక బట్టీల నిర్వహణ ♦ చోద్యం చూస్తున్న అధికారులు ♦ యథేచ్ఛగా విద్యుత్ వినియోగం మెదక్ : ఇటుక బట్టీల్లో బాల్యం బుగ్గి అవుతోంది. బాలల హక్కుల చట్టం ప్రకారం వారిని కాపాడి, ఇటుక బట్టీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన కార్మికశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఇటుక బట్టీల నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. జిలాల్లో వందలాది ఇటుక బట్టీలు వెలిశాయి. ఈ బట్టీల్లో వేలాది మంది బాలకార్మికులలు పనులు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి పనులు చేయిస్తుంటారు. దీంతో కార్మికులతో పాటు వారిపిల్లలు సైతం బట్టీల్లో పనులు చేయాల్సిందే. ఇంత తతంగం అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా, పట్టించుకున్న పాపానపోవటంలేదు. అంతేకాకుండా రైతాంగం అబివృద్ధి కోసం ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఇస్తే దాన్ని సైతం బట్టీలకు వాడుకుంటూ ట్రాన్స్‌కోను నిలువునా ముంచుతున్నారు. కలపను విచ్చలవిడిగా బట్టీలకింద కాల్చటం, రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వ్యవసాయపొలాల్లో బట్టీలు నిర్వహిస్తూ వాల్టాచట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఈ బట్టీలను రోడ్లపక్కనే ఏర్పాటు చేస్తుండటంతో వాహనదారులు కళ్లలో దుమ్ముధూళిపడి అనేక ఇబందులు పడుతున్నారు. తరుచూరోడ్డు ప్రమాదాలకు గురికావల్సి వస్తోంది. బట్టీలను నిర్వహించాలంటే ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతులు తప్పనిసరి. ఇందుకోసం కొంత డబ్బును చలాన్‌రూపంలో చెల్లించాలి. అలాగే నీటిని వాడుకోవటానికి విద్యుత్తు శాఖకు రూ. 10వేల డిడిని చెల్లించాలి. బట్టీల కిందకు కలపను ఎక్కడినుండి సమకూర్చుకునే విషయమై ముందుగానే ఫారెస్టుఅధికారుల అనుమతులు తీసుకోవాలి. ముఖ్యంగా బట్టీల్లో 14 ఏళ్లలోపు పిల్లలను పనుల్లో పెట్టుకోకూడదు. ఇన్నిరకాల అనుమతులు పొందాకనే బట్టీలను నిర్వహించాలి. కానీ జిల్లాలో నిర్వహించిన వందలాది బట్టీల్లో ఎక్కువశాతం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అధికారులకు ముడుపులు ముట్టజెప్పి నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మెదక్ మండలంలో గంగాపూర్, తొడిట, పిల్లికొటాల్, హవేళిఘణపూర్, శివారుల్లో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల్లో వందలాది మంది బాలకార్మికులు పనులు చేస్తున్నారు. వీరి కోసమైనా ప్రత్యేకం గా బడులు ప్రారంభించాల్సి ఉంది. అధికారి వివరణ: ఈ విషయంపై ఎంఈఓ నరేష్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. రోజుకు రూ.400 నుంచి 500 సంపాదిస్తున్నాం మాది మహరాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం. నెల క్రితం ఇటుకలు చేసేందుకు మెదక్ మండలం రాయిన్‌చెర్వు గ్రామానికి భార్యపిల్లలను వెంటతీసుకొని వచ్చాం. రోజుకు సుమారు 1000 ఇటుకలు తయారు చేస్తున్నాం. ఇందుకు మాకు రూ.400 నుండి 500ల వరకు వస్తుంది - దశరథం, నాందేడ్. పనిచేసేచోట బడులు లేవు పొట్ట చేతబట్టుకొని రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చాం. ఇక్కడ పనిచేసేచోట పాఠశాలలు ఏర్పాటుచేసి మాలాంటి వారి పిల్లలకు చదువులు చెప్పిస్తారట. కాని ఇక్కడ అలాంటివేవి అందుబాటులోలేవు. మా పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. - లక్ష్మణ్, నాందేడ్ మా రాష్ట్రంలో పని దొరకడంలేదు.. మా సొంతరాష్ట్రంలో ఏం పనులు దొరకడం లేదు. దీంతో ఇక్కడకు వచ్చాం. పనిచేసేచోటనే చిన్నపాటి గుడిసెలు వేసుకొని పనులు చేస్తున్నాము. నాతోపాటు నాభర్త, పిల్లలు ఉన్నారు. - శ్యామ్‌బాయి, నాందేడ్