చండూరు ఎంపీడీఓ కార్యాలయం తనిఖీ
చండూరు ఎంపీడీఓ కార్యాలయం తనిఖీ
Published Sun, Aug 28 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
చండూరు : జిల్లాలో ఏ శాఖకూ నిధుల కొరత లేదని జెడ్పీ సీఈఓ రావుల మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం చండూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. 2013–2014, 2014–2015 సంవత్సరాల చెందిన వార్షిక నిధులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏ శాఖకు సంబంధించిన నిధులు ఆ శాఖలకే మల్లిస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌జీఎఫ్ నిధులు క్లోజ్ అయ్యాయని, 14 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఎస్‌ఎప్‌సీ నిధులు రాకపోవడంతో కొంత ఇబ్బందిగా ఉందన్నారు. గ్రామాల్లో వీధిలైట్ల బిల్లులను పంచాయతీలే చెల్లించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 200 గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్నులు వసూలు కాగా మిగతా పంచాయతీల్లో 65 శాతం మాత్రమే వసూలైనట్లు చెప్పారు. దసరా తర్వాత పన్నులు వసూలు చేయనున్నట్లు వివరించారు. జిల్లా పరిధిలో 350 అంగన్‌వాడీ కేంద్రాలు, 151 గ్రామ పంచాయతీల భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై పంచాయతీ కార్యాదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో ఎంపీడీఓ శైలజ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement