సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : ఓ వైపు భార్య చనిపోయిందన్న విషాదం, మరోవైపు ఇంటర్వ్యూకు హాజరు కాకపోతే ఉద్యోగం రాదేమోనన్న ఆందోళన మధ్య గురువారం గ్రామ వలంటీర్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు ఓ నిరుద్యోగి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలోని దిగువసార గ్రామానికి చెందిన బి.తులసి అనే బాలింత బుధవారం మృతి చెందింది. 40 రోజుల కిందట సీతంపేట సామాజిక ఆస్పత్రిలో ఆడ బిడ్డను కన్న ఆమె తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. మృతురాలి భర్త నాగేశ్వరరావు గురువారం గ్రామ వలంటీర్ పోస్టు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తన దుఃఖాన్ని దిగమింగుకుని ఇంటర్వ్యూ చేసిన ఎంపీడీవో రాధాకృష్ణన్‌తో కూడిన కమిటీకి సమాధానాలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment