జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన పల్లెప్రగతి సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి, ప్రశాంత్‌రెడ్డి, అధికారులు
సాక్షి, నిజామాబాద్ : ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న అధికారులు సైతం రాజకీయ నాయకుల్లాగా గాలిమాటలు, తప్పుడు లెక్కలు చెబితే ఎలా అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆర్‌అండ్‌బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి నిజామాబాద్ జిల్లా పరిషత్ హాలులో 5వ విడత పల్లెప్రగతి పనులపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సమీక్ష సమావేశం నిర్వహించారు. వైకుంఠ ధామాలు ఎన్ని వినియోగంలోకి వచ్చాయని కామారెడ్డి డీపీవోను మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. డీపీవో సరైన లెక్కలు చెప్పలేదు. ఎంపీడీవోలు సైతం వివరాలు చెప్పకపోవడంతో ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు.
అధికారుల పనితీరుపై నమ్మకం లేకుండా పోయిందన్నా రు. వైకుంఠ ధామాలు వాడుకలోకి రాకుండానే చ్చినట్లు తప్పుడు లెక్కలు ఎలా చెబుతారన్నారు. లెక్కల్లో స్పష్టత ఉండాలన్నారు. మండలాల వారీగా కచ్చితమైన నివేదిక ఉండాలన్నారు. కాకిలెక్కలు చెబితే ఎలా అన్నారు. కామారెడ్డి కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్‌తో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎంపీడీవోలు ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ క్ర మంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలుగజేసుకున్నారు. లెక్కలపై సందేహం వస్తోందన్నారు. కామారెడ్డి కలెక్టర్ పంచాయతీ కార్యదర్శుల నుంచి ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకోవాలన్నారు. ఈ నెల 18 లోగా మిగిలిన పనులు పూర్తి చేయడంతో పాటు నీటి సౌకర్యం కల్పించి వాడుకలోకి తేవాలన్నారు. లేనిపక్షంలో మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం నుంచి తాను కాపాడలేనన్నారు. నెల తరువాత మళ్లీ వచ్చి చూస్తానని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
గ్రామపంచాయతీలు ప్లాస్టిక్, తడి చెత్త, పొడి చె త్త నుంచి ఆదాయం ఆర్జించాలని మంత్రులు ఎర్ర బెల్లి, ప్రశాంత్‌రెడ్డి సూచించారు. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలోని ఓ చిన్న తండా మొక్కల పెంపకం ద్వారా రూ.15 లక్షల ఆదాయం ఆర్జించిందన్నారు. ట్రాక్టర్లు చాలకపోతే మరొక ట్రాక్టర్ తీసుకోవాలని ఎర్రబెల్లి సూచించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థా ల తో మంచి ఆదాయం ఆర్జించవచ్చన్నారు. ప్రస్తు తం ఇతర రాష్ట్రాల నుంచి ప్లాస్టిక్ దిగుమతి అవుతోందన్నారు. నిధుల కొరత లేదన్నారు. ఉపాధి హా మీ నిధులను పంచాయతీలు తెలివిగా వాడు కోవాలన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్షి్మ, షాదీముబారక్, పింఛన్లు, కేసీఆర్ కిట్లు తదితర సంక్షేమ పథకాల గురించి ఆయా పంచాయతీల్లో ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు అప్‌డేట్ లెక్కలతో ఉంచాలని సూచించారు. సమావేశంలో నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ దఫేదార్ శోభ, ఎమ్మెల్సీ లు రాజేశ్వర్, గంగాధర్‌గౌడ్,ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సి నారాయణరెడ్డి, జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.
చదవండి: హైదరాబాద్: ఫాంహౌస్‌పై పోలీసుల దాడి.. 10 మంది విదేశీయులు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment