పింఛన్లు అందడంలేదని ఆదిలాబాద్ జిల్లా ఇప్పెనెల్లి గ్రామస్తులు బుధవారం ఆందోళన చేశారు.
పింఛన్లు అందడంలేదని ఆదిలాబాద్ జిల్లా ఇప్పెనెల్లి గ్రామస్తులు బుధవారం ఆందోళన చేశారు. వివరాలు.. ఇప్పనెల్లి గ్రామానికి చెందిన తమకు మూడు నెలల నుంచి పింఛన్లు ఇవ్వలేదని బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని గ్రామస్తులు ముట్టడించారు. తమకు వెంటనే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సుమారు 100 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.