బ్యాంకే ఆసరా | pension in Banks | Sakshi
Sakshi News home page

బ్యాంకే ఆసరా

Published Mon, Dec 5 2016 2:51 AM | Last Updated on Thu, Mar 21 2019 8:24 PM

బ్యాంకే ఆసరా - Sakshi

బ్యాంకే ఆసరా

ఆసరా పింఛన్‌దారులను నగదు రహిత లావాదేవీల బాట పట్టించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల ద్వారానే ఆసరా పింఛన్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్న గ్రామీణాభివృద్ధిశాఖ సూచనల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఇటీవల ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ విధానమే మంచిదని భావిస్తున్నారు. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఖాతాల నంబర్లు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
 
  చేశారు. అరుుతే ఆ తర్వాత కారణాలేమీ చెప్పకుండానే సామాజిక తనిఖీ ఆపేశారు. వాస్తవానికి 2008-09లో మున్సిపాలిటీల్లో పింఛన్లు బ్యాంకుల ద్వారానే అందజేశారు. కానీ ఆ తర్వాత పోస్టాఫీసులకు మార్చారు. మళ్లీ ఇప్పుడు చెల్లింపులన్నీ బ్యాంకుల ద్వారానే చేయాలని నిర్ణయించారు. ఫించన్‌దారుల్లో ఎంతమందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి..? ఎంతమందికి లేవు..? అనే దాని పై సమగ్ర సమాచారం సేకరించి ఖాతాలు కలిగిన వారి వివరాలను ఎంపీడీఓల లా గిన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఫించన్‌ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే బ్యాంకుల ద్వారానే సాధ్యమవుతుందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టిందని అధికారులు చెప్తున్నారు.
 
  ప్రస్తుతం తపాలా శాఖ ద్వా రానే ఫి ంచన్‌లు పంపిణీ చేస్తున్నారు. పోస్టాఫీసులు, బ్యాంకుల సౌకర్యం లేని మోత్కూరు, చంద ంపేట, గుండాల, డిండి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో  పంచాయతీ కార్యదర్శుల సహా యంతోనే ఫించన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ విధానం ఈ నెల నుంచి రద్ధు కానుంది. ఆగ్రా మాల్లో ఫించన్‌దారులను సమీప బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి ఈ నెల 10లోగా ఎంపీడీ ఓల లాగిన్‌లో నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల నుంచి ఆయా గ్రా మాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లోనే ఫించన్ సొమ్ము జమవుతుంది. 
 
 మూడు జిల్లాల్లో 3.97 లక్షల మంది...
 నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో అన్ని కేటగిరీల్లో కలిపి ఆసరా పింఛన్‌దారులు 3,97,650 మంది ఉన్నారు. వీరిలో నల్లగొండ జిల్లాలో 1,78,313, సూర్యాపేటలో 1,29,8 54, యాదాద్రి జిల్లాలో 89,483 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా నల్లగొండ జిల్లాలో రూ.21.04 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ.15.15 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.10.34 కోట్లు తపాలా శాఖద్వారానే చెల్లిస్తున్నారు. ఇక జనవరి నుంచి పింఛన్‌దారులకు బ్యాంకుల ద్వారానే చెల్లింపులు చేస్తారు. ఒక వేళ పరిస్థితులు అనుకూలించని చోట తపాలా శాఖ ద్వారా చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
 
 ‘మోటకొండూరు’లో వద్దు
 ఆత్మకూరు(ఎం) : మోటకొండూరు మండలం మాకొద్దని మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామ అయ్యప్ప స్వాములు ఆదివారం నిరసన తెలిపారు. ముత్తిరె డ్డిగూడేన్ని ఆత్మకూరు(ఎం) మండలంలో కలపాలని ఫ్లెక్సీ బ్యానర్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువు రు మాట్లాడుతూ మోటకొండూరు మండలంలో తమ ను చేర్చడం వల్ల మా గ్రామ ప్రజలకు అనూకూలంగా ఉండదని, ఆత్మకూరు(ఎం) మండలం అయితేనే రాకపోకలకు అన్నిరకాలుగా అం దుబాటులో ఉంటుదన్నారు. ముత్తిరెడ్డిగూడెం గ్రామా న్ని వెంటనే ఆత్మకూరు(ఎం) మండలంలోనే చేర్చాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement