- ఎంపీడీవోలతో సమీక్ష సమావేశంలో కలెక్టర్
- ఉపాధిహామీ పనులు పారదర్శకంగా ఉండాలి
-జిల్లాలో జలప్రభ కింద 11 వందల బోర్లు
- 200 మంది వికలాంగులకు పింఛన్లు అందడం లేదు
- అనర్హులు 1200 మంది పింఛన్లు పొందుతున్నారు
ఏన్కూరు: మండలంలో జరిగే ఉపాధిహామీ పనులకు ఎంపీడీఓలే బాసులని, నిత్యం పరివేక్షిస్తూ పారదర్శకంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలంబరితి అన్నారు. స్థానిక క్లష్టర్ స్థాయి జీవనోపాదుల వనరుల కేంద్రంలో జిల్లాలోని ఎంపీడీఓలతో గురువారం ఉపాధిహామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధిహామీ పనుల్లో జిల్లా రెండవ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో కొన్ని మండలాల్లో ఉపాధిహామీ పనులు నత్తనడక నడుస్తున్నాయని, పనులు వేగవంతం చేయూలన్నారు.
వచ్చే నెల నుండి ఉపాధిహామీ కూలీలకు బ్యాంకుల ద్వార చెల్లింపులు చేస్తామన్నారు. వారి అకౌంట్‌లో కూలి డబ్బులు జమఅవుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీల బీడు భూములు సాగులోకి తీసుకువచ్చేందుకు ఇందిర జలప్రభ పథకం చేపట్టినట్లు వివరించారు. ఈ పథకం క్రింద 11 వందల బోర్లు వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 500 బోర్లు వేశామని, మిగతా బోర్లు కూడ త్వరలో వేయనున్నట్లు తెలిపారు. ఉపాధిహామీ పనుల్లో గ్రావెల్ రోడ్ల నిర్మాణం చేపట్టడం లేదన్నారు.
జిల్లా అభివృద్ధిలో భాగంగా తాగునీరు, విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పంచాయతీలలో నిర్వహించే గ్రామసభలలో అర్హులైన పింఛన్ లబ్ధిదారుల జాబితాను ఉంచాలన్నారు. జిల్లాలోని అర్హులైన వికలాంగులు 200 మందికి పింఛన్ రావడం లేదన్నారు. అనర్హులైన 1200 మందికి పింఛన్ ఇస్తున్నట్లు తెలిపారు. దీనిని పరిశీలించాలని ఉన్నాతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పింఛన్ పంపిణీపై సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పింఛన్ లబ్ధిదారులకు వచ్చే నెల నుండి బ్యాంకుల ద్వార పంపిణీ చేస్తామన్నారు.
వన నర్సరీని పరిశీలించిన కలెక్టర్
స్థానిక ఐకేపీ కార్యాలయం ఎదుట ఉపాధిహామీ పథకం కింద పెంచుతున్న వన నర్సరీని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీలో ఎండిపోయిన టేకు మొక్కలపై సిబ్బందిని ప్రశ్నించారు. ఎండవేడిమి వలన మొక్క ఎండిపోయిందని అధికారులు సమాధానం చెప్పారు. మొక్కలు ఎండిపోకుండా తగిన జాగర్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట డ్వామా పీడీ జగత్‌కుమార్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ మురళిధర రావు, డిసిహెచ్‌ఎస్ ఆనందవాణి, ఉపాధిహామీ నాణ్యత పరిశీలానాధికారి టి దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.
మీరే బాసులు
Published Fri, Apr 17 2015 12:39 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement