పాపన్నపేట, న్యూస్‌లైన్: సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నచందంగా నిరుపేదల పింఛన్లను అధికారులు నొక్కేశారు. పాపన్నపేట మండలంలోని 12 గ్రామాల్లో రూ. 2.99,500ల ఫించన్ డబ్బులు దుర్విని యోగం అయ్యాయి. చనిపోయిన వారి ఫించన్లు, ఒకే పేరు మీద రెండేసి పింఛన్లున్న సంఘటనలను తెలివిగా అధికారులు సొమ్ము చేసుకున్నారు. గతజూన్ లో జరిగిన సామాజిక తనిఖీలో ఈ కుం భకోణం భయపడటంతో అధికారుల నుంచి డబ్బులు రికవరీ చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ సుధాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వెలు గు చూడని సంఘటనలు కూడా మరిన్ని ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి.
పాపన్నపేట మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉండగా, రెండు గ్రామాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల స్మార్ట్‌కార్డుల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కాగా అర్కెల, గాజులగూడెంలో మాత్రం ఇంత వరకు స్మార్ట్‌కార్డులు వినియోగంలోకి రాలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులే పింఛన్లు పం పిణీ చేస్తున్నారు. మండలంలో కొంతమంది పింఛన్‌దారులు మరణించగా, స్మార్ట్‌కార్డులున్న చోట వారి స్థానంలో మరొకరి వేలి ముద్రలు నమోదు చేసి యేళ్ల తరబడి వారి పింఛన్లను స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరి కొన్ని గ్రామాల్లో ఒకే వ్యక్తికి రెండేసి పిం ఛన్లుండగా అందులో ఒకటి లబ్ధిదారునికి చెల్లించి, మరొకటి అధికారులే స్వా హా చేశారన్న ఆరోపణలున్నాయి. కాగా కొన్ని గ్రామాల్లో రాజకీయ నాయకులు కూడా ఈ పాపాన్ని పంచుకున్నారన్న విమర్శలున్నాయి. 2011-12 సంవత్సరానికి సంబంధించి జూన్ 2013లో సా మాజిక తనిఖీ జరిగింది.
అర్కెలలో రూ.48 వేలు, మల్లంపేటలో రూ.41, 800, గాంధారిపల్లిలో రూ.2,100, నార్సింగిలో రూ.1లక్ష 22 వేల 400లు, గాజులగూడెంలో రూ.1800, మిన్‌పూర్‌లో రూ.32,500, నాగ్సాప్‌పల్లిలో రూ. 3,800, చీకోడ్‌లో రూ.500, అన్నారం లో రూ.1,000, పాపన్నపేటలో రూ.4, 800, యూసుఫ్‌పేటలో రూ.18,400, బాచారంలో రూ.22,400 స్వాహా అయినట్లు తేలింది. ఈ డబ్బులు స్వాహా చేసి న పంచాయతీ కార్యదర్శులు, సీఎస్‌పీ లు ప్రవీణ్, రమేష్, వినోద, కవిత, రేణు క, పి.స్వరూప, విజయలక్ష్మి, రాంరెడ్డి, సువర్ణ, అన్నపూర్ణ, రహ్మత్, దుర్గయ్య, సక్కుబాయి, లక్ష్మీ, సామెల్, భూమమ్మల నుంచి స్వాహా చేసిన డబ్బులు రికవరీ చేయాలని అధికారులు జారీ చేశారు
వెలుగులోకి రాని
కుంభకోణాలెన్నో...
పాపన్నపేట మండలంలో యేళ్ల తరబడిగా పింఛన్ల కుంభకోణం కొనసాగుతుందన్న ఆరోపణలున్నాయి. గాజుల గూడెం గ్రామంలో సుమారు 8 మంది వ్యక్తులు చనిపోగా, అక్కడ కేవలం రూ.1800 లు మాత్రమే స్వాహా అయినట్లు తనిఖీలో తేలింది. ఇతర గ్రామా ల్లో కూడా ఇలాంటి అక్రమాలు యేుళ్ల తరబడి కొనసాగుతుందన్నా ఆరోపణలున్నాయి. కాగా సామాజిక తనిఖీ ప్రతి నిధి కేవలం కొంతమంది పింఛన్‌దారులను మాత్రమే విచారించడంతో మిగతావి బయట పడలేదని తెలుస్తుం ది. మిగతావారు అందుబాటులో లేనందు వల్ల విచారించలేక పోయామని సామాజిక తనిఖి అధికారులు అప్పట్లో స్ప ష్టం చేశారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఫించన్ల అవినీతి భాగోతం బయట పడే అవకాశం ఉంది.
ఈ విషయంపై ఎంపీడీఓ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ఇచ్చిన సూచన మేరకు బా ధ్యులనుంచి స్వాహా అయిన సొమ్ము రూ.2,99,500లు రికవరీ చేస్తామన్నా రు. ఇతర అవినీతిపై అనుమానాలుంటే తన దృష్టికి తేవాలని సూచించారు.