మేళ్లచెర్వులో సర్వసభ్య సమావేశం
మేళ్లచెర్వులో సర్వసభ్య సమావేశం
Published Thu, Jul 21 2016 7:01 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
మేళ్లచెర్వు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీపీ భూక్యా ఝామా చోక్లానాయక్ అధ్యక్షతన మండల సర్వసభ్య మావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేళ్లచెర్వును కరువు మండలంగా ప్రకటించాలని ఎంపీటీసీ, సర్పంచ్‌లు ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామాల్లో మంచినీటి సమస్య, ఆసరా పింఛన్లు, కరువు ప్రభావంతో పశుగ్రాసం, దాణా, దొండపాడు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ వివాదం, తాగు నీటి సమస్య, మరుగుదొడ్లు బిల్లులు, ఉపాధి పనులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ శాంతకుమారి, డిప్యూటీ తహసీల్దార్ సంధ్యారాణి, మండల ఉపాధ్యక్షుడు మధిర సత్యనారాయణరెడ్డి, ఎంఈఓ సైదానాయక్, వ్యవసాయాధికారి శ్రీనివాస్‌గౌడ్, ట్రాన్స్‌కో ఏఈ నాగరాజు, పీఆర్ ఏఈ కోక్యానాయక్, ఐకేపీ ఏపీఎం లక్ష్మీ, పశువైధ్యాధికారి డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌డబ్లూ్య ఏఈఈ వెంకన్న, ఎంపీటీసీలు కొండా వెంకటేశ్వర్లు, వీరకుమార్, పుష్పావతి, గోపిశెట్టి లక్ష్మమ్మ, గుండెబోయిన వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌యాదవ్, సర్పంచ్‌లు కొట్టె సైదేశ్వరరావు, రుక్కయ్యయాదవ్, దేశాల పద్మ, గోనె లక్ష్మీ, బిక్రి, భూక్యా సైదమ్మ పాల్గొన్నారు.
Advertisement