ఆ ఇద్దరి వల్లే ఎంపీడీఓ ఆత్మహత్యాయత్నం
టీడీపీ కార్యకర్తల్లా పనిచేయాలని అధికారులపై ఒత్తిడి తేవడం దారుణం
{పజల పక్షాన పనిచేసే అధికారులకు వైఎస్‌ఆర్‌సీపీ అండ
జిల్లా కలెక్టర్, ఆర్డీఓ వినాయకంపై వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ధ్వజం
కడప కార్పొరేషన్ : జిల్లా కలెక్టర్, ఆర్డీఓ వేధింపులవల్లే లింగాల ఎంపీడీఓ మురళీమోహన్ మూర్తి ఆత్మహత్యాయత్నం చేశాడని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక ైవె ఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మురారిచింతలలో రెండు వర్గాలు ఉన్నాయని, ఒక వర్గానికి ఎంపీడీఓ, మరో వర్గానికి తహశీల్దారు జన్మభూమి నిర్వహించారన్నారు.
అందులో 90 శాతం ప్రజల అభీష్టాన్ని కాదని టీడీపీ నాయకుని ఇంటికి వెళ్లి రేషన్ తీసుకోవాలని చెప్పడం వల్లే వివాదం రేగిందన్నారు. ఆర్డీఓ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. సెల్‌ఫోన్ స్పీకర్ ఆన్ చేయమని తహశీల్దారును ఆదేశించిన ఆర్డీఓ ‘వారి(టీడీపీ నాయకుని) ఇంట్లోనే రేషన్ పంపిణీ చేస్తారు, ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు’ అని మాట్లాడటం అప్రజాస్వామికమన్నారు. అలా మాట్లాడిన అధికారిపై కాకుండా ప్రజలపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు.
నీతి, నిజాయితీగా పనిచేసే అధికారులను టీడీపీ కార్యకర్తల్లాగా పనిచేయాలని జిల్లా అధికార యంత్రాంగం ఒత్తిడి తేవడం దారుణమన్నారు. అలా పనిచేయని వారిని మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదన్నారు. కలెక్టర్, ఆర్డీఓలు కలిసి ఎంపీడీఓను సస్పెండ్ చేయడమే కాకుండా బెదిరింపులకు గురిచేస్తూ తీవ్రంగా వే ధించారన్నారు. వారి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకొంటున్నానని ఎంపీడీఓ అందరికీ మెసేజ్‌లు పంపాడన్నారు.
ఆ మెసేజ్‌ల్లోనే కలెక్టర్, ఆర్డీఓ శాసనమండలి డిప్యూటీ ఛెర్మైన్ ఎస్‌వీ సతీష్‌రెడ్డికి దఫేదార్లకంటే నీచంగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడన్నారు. ఎంత మథనపడి ఉంటే ఆయన అలా చేశాడో అందరూ గ్రహించాలన్నారు. జిల్లా అధికారులంతా దీన్ని సమష్టిగా ఖండించాల్సిన అవసరముందన్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించాలని ఎవైరె నా అధికారులపై ఒత్తిడి తెస్తే వారికి అండగా వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
ప్రజల పక్షాన పనిచేసే అధికారులకు తాము ఎల్లప్పడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో నగర మేయర్ కె. సురేష్‌బాబు, మైదుకూరు, రాయచోటి, రైల్వేకోడూరు, కమలాపురం, కడప, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనువాసులు, పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, రాచమల్లు శివప్రసాద్‌రె డ్డి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి పాల్గొన్నారు. అనంతరం వీరందరూ జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీని ఆయన బంగళాలో కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగాల ఎంపీడీఓ అధికార పార్టీ నాయకులకు టార్గెట్‌గా మారారన్నారు. టీడీపీ నేతల సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఎంపీడీఓను సస్పెండ్ చేశారన్నారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా, కలెక్టర్ జారీ చేసిన సస్పెన్షన్ ఆర్డర్‌ను కొట్టేసిందన్నారు. తమ ఉత్తర్వులపైనే హైకోర్టుకు వెళ్తావా.. నీ అంతు చూస్తాం అంటూ కలెక్టర్ , ఆర్డీఓ ఆయన్ను వేధించడంంతో ఎంపీడీఓ భయపడిపోయి ఈనెల 17న నిద్రమాత్రలు మింగి, ఇన్సులిన్ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడని వివరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ఎంపీడీఓను వేధించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.