ఉపాధి కొండెక్కినట్టే | rajiv upadi hami padakam | Sakshi
Sakshi News home page

ఉపాధి కొండెక్కినట్టే

Published Sat, Mar 1 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

ఉపాధి కొండెక్కినట్టే

ఉపాధి కొండెక్కినట్టే

 ఏలూరు
 నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. వారికి స్వయం ఉపాధి కల్పించే విషయంలోనూ మొండిచేరుు చూపిస్తోంది.

స్వయం ఉపాధి పథకాల కింద రుణాలిచ్చేందుకు జిల్లాలో దరఖాస్తు లు ఆహ్వానించిన ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ లు సవాలక్ష నిబంధనలు.. ఎన్నో  ఆంక్షలు విధించారుు. ఎట్టకేలకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారుు. అర్హత గల నిరుద్యోగులకు రుణాలిచ్చే విషయంలో కాలయూపన చేస్తూ వచ్చిన అధికారులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అరుునా లక్ష్యాన్ని చేరుకుంటామని చెబుతూ వచ్చారు.

 

రుణాల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్న తరుణంలో వారి చివరి ఆశలు కూడా కొండెక్కేలా ఉన్నారుు. ఎన్నికల కోడ్ తరుముకొస్తుండటంతో రుణాలు ఇచ్చే పరిస్థితి కానరావటం లేదు.

 

 ఊరించి.. ఊరడించినా
 చివరకు రిక్తహస్తమే

 

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే దశలోనూ ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా జిల్లాలో ఒక్క స్వయం ఉపాధి యూనిట్‌ను కూడా అధికారులు ప్రారంభించలేకపోయూరు.

 

 సబ్సిడీ మొత్తాలను పెంచుతామని ప్రభుత్వం ఆరు నెలలుగా ఊరిస్తూ వచ్చింది. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో పథకాలపై ఇస్తున్న 30 శాతం సబ్సిడీని 60 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించిం ది. ఇంతలోనే లబ్ధిదారుల ఎంపికలో సవాలక్ష నిబంధనలు విధించింది. దీంతో ఇప్పటివరకూ ఒక్కరికి కూడా రుణం మంజూరు కాలేదు.

 

ఈ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే యూనిట్ల మంజూరు అటకెక్కినట్టేనని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా 8,418 మందికి రూ.65 కోట్లను రుణాలుగా ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించారు. బీసీ కార్పొరేషన్ పరిధిలో రూ.26 కోట్లతో 4,518 యూనిట్లను స్థాపిం చాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 378 మందికి రూ.1.89 కోట్ల సబ్సిడీని విడుదల చేయడానికి అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 3,914 మందికి రూ.39.01 కోట్లను రుణాలుగా ఇవ్వాలని నిర్ణరుుం చగా, 1,456 మందికి రూ.5.96 కోట్లను సబ్సిడీగా ఇచ్చేందుకు ఎస్పీ కార్పొరేషన్ అధికారులు సిఫార్సు చేశారు. సబ్సిడీ మొత్తాలను జమ చేయూలంటే రుణం చెల్లింపులకు సంబంధించి లబ్ధిదారులు రెండేసి బ్యాంకు ఖాతాలను తెరవాల్సి ఉంది. జిల్లాలో ఎక్కడా ఇది పూర్తికాలేదు. దీంతో యూనిట్ల స్థాపనపై నీలి నీడ లు కమ్ముకున్నాయి.  

 

 ప్రభుత్వం నిర్వాకం..              లబ్దిదారులకు శాపం

 

 ఎస్సీ, బీసీ ఓట్లను దండుకునే ఆలోచనతో ప్రభుత్వం ఆయూ వర్గాలకు చెం దిన నిరుద్యోగులను మోసగిస్తోంది. సబ్సిడీ మొత్తాలను పెంచుతామని చెప్పి గత ఏడాది డిసెంబర్ వరకు తుది నిర్ణయం వెలువరించలేదు. దీనికి తోడు కాంగ్రెస్ కార్యకర్తల కనుసన్నల్లోనే లబ్ధిదారుల ఎంపిక సాగాలన్న ఆచరణ యోగ్యం కాని నిబంధన విధించి నిరుద్యోగులతో ప్రభుత్వం ఆటలాడిందనే విమర్శలు వెల్లువెత్తాయి.  మండల స్ధాయిలో ముగ్గురు సామాజిక కార్యకర్తలు, ఎంపీడీవో, బ్యాంకర్లు, మండల సమాఖ్య, డీఆర్‌డీఏ, సంబంధిత కార్పొరేషన్ ప్రతి నిధుల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయూలనే నిబంధన విధించారు. మరోవైపు లక్ష్యంలో సగం మందిని కూడా ఇప్పటివరకూ ఎంపిక చేయలేదు. నిరుద్యోగులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నాక వయో పరిమితిని తగ్గించేశారు. దీంతో చాలామంది దరఖాస్తుదారులు అనర్హులుగా మిగిలిపోయూరు. ఇలాంటి నిబంధనలను, అవాంతరాలను దాటుకుని నిలబడిన లబ్ధిదారులకు ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో అయినా రుణాలు ఇస్తారని వారంతా ఆశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతోందని, అందువల్ల ఎవరికీ రుణాలు ఇవ్వలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో కనీసం స్వయం ఉపాధి పథకం ద్వారా అరుునా ఉపాధి పొందుదామనుకున్న నిరుద్యోగుల ఆశలు నీరుగారిపోతున్నారుు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement