ఏలూరు (టూటౌన్) : జిల్లాలోని 48 మంది ఎంపీడీవోలకు 40 మందిని బదిలీ చేశారు. ఎనిమిది మందిని మాత్రం అవే స్థానాల్లో ఉంచారు. జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆధ్వర్యంలో ఇన్‌చార్జి సీఈవో పి. సుబ్బారావు శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ద్వారకాతిరుమల -కె.పురుషోత్తమరావు, భీమడోలు- ఏవీ విజయలక్ష్మి, లింగపాలెం -ఎస్.ఆశీర్వాదం పాలకోడేరు - పి.వెంకటరత్నం, తాళ్లపూడి - ఎస్.వేణుగోపాల్‌రెడ్డి, ఉండ్రాజవరం - బి. వీరాస్వామి, పాలకొల్లు -ఆర్. విజయరాజు, బుట్టాయిగూడెం- టి.వెం కటలక్ష్మిని పనిచేసే చోటే ఉంచారు.
పెనుమంట్ర తహసిల్దార్ ఎస్. వెంకటేశ్వరరావును ఆచంటకు, ఆకివీడు తహసిల్దార్ ఎం. కె.ప్రసన్నను పోడూరుకు, ఆచంట నుంచి డీవీఎస్ పద్మినిని పెనుగొండకు, పెరవలి నుంచి బి. రామప్రసాద్‌ను పెనుమంట్రకు, చింతలపూడి నుంచి వై. పరదేశ్‌కుమార్‌ను భీమవరానికి, భీమవరం నుంచి పి.జగదాంబను వీరవాసరానికి, చింతలపూడి ఎంపీడీఓగా ఈవోఆర్‌డీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. చాగల్లు నుంచి పీకే నిర్మలాదేవిని కామవరపుకోటకు, పోడూరు నుంచి పి.శ్రీదేవిని జంగారెడ్డిగూడెంకు, ఏలూరు నుంచి ఎన్.ప్రకాశరావును దెందులూరుకు, పెదవేగి నుంచి కె. శిల్పను పెదపాడుకు, పెదపాడు నుంచి పి.శ్రీనివాస్‌ను పెదవేగికి, దెందులూరు నుంచి కె.శ్రీదేవిని ఏలూరుకు బదిలీ చేశారు. కొయ్యలగూడెం నుంచి కేఆర్‌ఎస్ కృష్ణప్రసాద్‌ను గోపాలపురానికి, నిడమర్రు నుంచి కె.కోటేశ్వరరావును దేవరపల్లికి, నల్లజర్ల ఎంపీడీఓగా ఎవరినీ నియమించకుండా ఖాళీగా ఉంచారు.
తణుకు నుంచి వై. దాసిరెడ్డిని కొవ్వూరుకు, కొవ్వూరు నుంచి జె.వేణుగోపాల్‌ను చాగల్లుకు, మొగల్తూరు నుంచి కె.కన్నమనాయుడును నరసాపురానికి, నరసాపురం నుంచి ఎన్‌వీఎస్‌పీ యాదవ్‌ను మొగల్తూరుకు, అత్తిలి నుంచి ఎ.ఆంజనేయులును నిడదవోలుకు, ఇరగవరం నుంచి ఎస్‌టీవీ రాజేశ్వరరావును పెరవలికి, పోలవరం నుంచి ఆర్‌సీ ఆనందకుమార్‌ను యలమంచిలికి, యలమంచిలి నుంచి ఏవీ అప్పారావును పోలవరానికి, కుకునూరు నుంచి బి. రామచంద్రరావును జీలుగుమిల్లికి, జంగారెడ్డిగూడెం నుంచి ఎం.రాజును కొయ్యలగూడెంకు బదిలీ చేశారు. టి నరసాపురం ఎంపీడీవోగా సూపరింటెండెంట్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పెంటపాడు నుంచి జీవీకే మల్లికార్జునరావును తాడేపల్లిగూడెంకు, ఉంగుటూరు నుంచి ఎ.రామును పెంటపాడుకు, తాడేపల్లిగూడెం నుంచి జి. రమణను తణుకుకు, పెనుగొండ నుంచి వి.విజయలక్ష్మిని ఇరగవరానికి, నిడదవోలు నుంచి ఎస్.నిర్మలాజ్యోతిని అత్తిలికి బదిలీ చేశారు.
సెలవులో ఉన్న ఎంపీడీవో ఏబీపీవీ లక్ష్మిని ఉండికి, ఉండి నుంచి పి.రమాదేవిని కాళ్లకు, నల్లజర్ల నుంచి శ్రీనాధ్‌నాయిని ఆకివీడుకు బదిలీ చేశారు. దేవరపల్లి నుంచి జె.రేణుకమ్మను ఉంగుటూరుకు, గోపాలపురం నుంచి డి. దామోదరరావును నిడమర్రుకు, కాళ్ల నుంచి జి. పద్మను గణపవరానికి, టి.నరసాపురం నుంచి ఎం.రాజశేఖర్‌ను కుకునూరుకు, వీరవాసరం నుంచి కేవీఎస్‌ఆర్ రవికుమార్‌ను వేలేరుపాడుకు బదిలీ చేస్తూ సీఈఓ సుబ్బారావు ఆదేశాలు జారీచేశారు. జిల్లా పరిషత్‌లో పనిచేసే 63 మంది సూపరింటెండెంట్‌లకు 28 మందిని, 108 మంది సీనియర్ అసిస్టెంట్‌లకు 56 మందిని, 268 మంది జూనియర్ అసిస్టెంట్‌లకు 100 మందిని బదిలీ చేశారు. 66 మంది టైపిస్టులకు 14 మందిని, 345 రికార్డు, లైబ్రెరీ, లాబ్ అసిస్టెంట్‌లకు గానూ 42 మందిని, 483 మంది ఆఫీస్ సబార్డినేట్‌లలో 56 మందిని బదిలీ చేశారు. డ్త్రెవర్లు ఆరుగురిని, ఎన్‌డబ్ల్యూ, ఎస్.డబ్ల్యూ సిబ్బంది 187 మంది ఉండగా వారిలో ఎవరినీ బదిలీ చేయలేదు.
ఎంపీడీవోల బదిలీ
Published Sun, Nov 23 2014 1:06 AM | Last Updated on Sat, Jul 6 2019 1:14 PM
Advertisement