చిత్తూరు: మండల సర్వసభ్య సమావేశంలోకి అనర్హులకు ప్రవేశం కల్పించి కాలాన్ని వృధా చేస్తున్నారంటూ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ధర్నాకు దిగారు. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 12.00 గంటలైనా ఎందుకు ప్రారంభించలేదని ఎంపీడీవో పార్వతమ్మపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సింగిల్ విండో చైర్మన్లు తదితరులను సమావేశానికి ఎలా రానిస్తారని ఎంపీడీవోను ఆయన ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు సమావేశం జరుపుతామని ఎమ్మెల్యేకు ఎంపీడీవో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అక్కడే ధర్నాకు దిగారు. కోరం లేకున్నా ఎంపీడీవో పార్వతమ్మ మాత్రం ఈ సమావేశాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.