puthalapattu mla
-
సీఎం జగన్‌తోనే నా ప్రయాణం: M.S బాబు
-
కాణిపాకం బ్రహ్మోత్సవాలు.. సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్ఎస్ బాబు కాణిపాకం దేవస్ధానం ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో సురేష్ బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి (కాణిపాకం, చిత్తూరు జిల్లా) బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎం జగన్‌ను ఆహ్వానించారు. కాగా ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 20 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో పాటు ఈ నెల 21న జరగనున్న చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం ఆహ్వానపత్రికను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. ఆహ్వానపత్రాలను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం ఆలయ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో కే. విద్యాసాగర్ రెడ్డి, ఎం. చంద్రశేఖర్‌రెడ్డి, వి. మార్కండేయ శర్మ, ఎం. శ్రీనివాస శర్మ పాల్గొన్నారు. చదవండి: 'జనాన్ని జనసేన వైపు చూడమంటాడు.. ఈయనేమో టీడీపీని చూస్తాడు' -
ఈ రైతు ఎవరో కాదు.. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు!
సాక్షి, చిత్తూరు: పొలంలో పంటకు పురుగు మందు పిచికారీ చేస్తున్న రైతు ఎవరో కాదు.. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. చిత్తూరు మండలం పిళ్లారిమిట్ట(5 వెంకటాపురం) లో తాను సాగు చేస్తున్న వరి పంటను మంగళవారం ఆయన పరిశీలించారు. పంటకు తెల్ల చీడలు సోకినట్లు గుర్తించిన ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. వారి సూచనల మేరకు ఆయన స్వయంగా గంటపాటు పురుగుల మందు స్ప్రే చేయడం విశేషం. -
దిగరా నాయనా.. నీ ‘పెళ్లి’ తప్పక చేస్తాం..!!
సాక్షి, చిత్తూరు : తాను ఇష్ట పడ్డ అమ్మాయితో వివాహం చేయాలని లేనిపక్షంలో దూకేస్తానంటూ ఓ భగ్న ప్రేమికుడు సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. అంతే..! ట్రాఫిక్ జామ్..సెల్ కెమెరాలు టవర్ వైపు జూమ్..సామాజిక మాధ్యమాల్లో లైవ్..ఇతగాడు దిగతాడా? దూకేస్తాడా? అనే చర్చ. దిగరా నాయనా..అంటూ తల్లి, అమ్మమ్మ సెల్ఫోన్లో పదే పదే కోరుతున్నా ‘పెళ్లి చేస్తేనే’ అంటూ అక్కడే భీష్మించుకున్నాడు. ఈ ప్రేమికుడి యవ్వారం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి చిర్రెత్తించింది. మధ్యలో పూతలపట్టు ఎమ్మెల్యే కూడా రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. మొత్తానికి అందరికీ చుక్కలు చూపిన అతగాడిని ఎట్టకేలకు కిందకు దించగలిగారు. ఇక అతడికి తమదైన ‘పెళ్లి’ చేసే పనిలో పోలీసులు పడ్డారు. ఇక మేటర్లోకి వెళితే... స్థానిక వళ్లియప్పనగర్‌కు చెందిన సంపత్‌కుమార్ (25) ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ మానేశాడు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన ఆటోలో వస్తూన్న తవణంపల్లె మండలానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. కులాలు వేరుకావడంతో ఆ యువతితో పెళ్లికి సంపత్‌కుమార్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదట! దీంతో మనస్తాపం చెందిన ఆ వీర ప్రేమికుడు ఓటీకే రోడ్డులో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. మేటరేమిటో తెలిశాక జనం చిన్నపాటి జాతర లెవెల్లో అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్ కూడా స్తంభించింది. అత్యుత్సాహవంతులు సెల్ కెమెరాలో దీనిని చిత్రీకరించి వైరల్ చేశారు. పోలీసులకూ సమాచారం అందడంతో టూటౌన్ సీఐ యుగంధర్, వన్ టౌన్ ఎస్ఐ మనోహర్ అక్కడికి చేరుకున్నారు. సెల్‌టవర్ నుంచి అతగాడు కిందకు విసిరేసిన చీటీలో తన ప్రేమ యవ్వారం గురించి ప్రస్తావించడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎంతనచ్చచెప్పినా అతగాడు దిగలేదు. చివరకు అగ్నిమాపక సిబ్బంది సైతం రంగంలోకి దిగి సెల్ టవర్ చుట్టూ వలలు ఏర్పాటు చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వచ్చి తనకు న్యాయం చేయాలని సంపత్ పట్టుబట్టడంతో సమాచా రాన్ని ఆయనకు చేరవేశారు. ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్‌కు చెందిన అమ్మాయి కావడంతో ఆయనే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తనకు న్యాయం చేయాలంటూ కోరాడు. చివరకు ఎంఎస్ బాబు అక్కడికి రాక తప్పలేదు. సెల్ఫోన్లో ఆయన సంపత్తో మాట్లాడి నచ్చచెప్పారు. దీంతో అతగాడు సెల్‌టవర్ దిగాడు. దీంతో గంటన్నర పాటు ఉత్కంఠకు తెరపడింది. అతడు ఇష్టపడిన అమ్మాయి మైనరని, ఆ అమ్మాయి అతగాడినేమీ ఇష్ట పడటం లేదని, ఇతడిదో వన్ సైడ్ లవ్ అని తెలిసింది. పోలీసులు కూడా దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. అతడిపై కేసు నమోదుకు రెడీ అవుతున్నారు. ఎవరైనా సెల్ టవర్ ఎక్కి ఇలాంటి పనులకు పూనుకుంటే ఉపేక్షించేది లేదని సీఐ తీవ్రంగా హెచ్చరించారు. పోలీసుల ట్రీట్మెంట్తో అతగాడి ప్రేమ మైకం దిగుతుందో, లేదో మరి! -
ఎమ్మెల్యే అంకుల్! పింఛను ఇప్పించరూ..
సాక్షి, ఐరాల(చిత్తూరు) : ఎమ్మెల్యే అంకుల్..మా నాన్నకు పింఛను ఇప్పించి ఆదుకోండి’ అని ఓ విద్యార్థి ఏమాత్రం జంకూగొంకూ లేకుండా ఎమ్మెల్యే కారు వద్దకు పరుగులు తీసి కోరడం పలువురినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. మండలంలోని ఎం.పైపల్లె హైస్కూలులో ఓ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తన కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఇదే స్కూలులో ఎనిమిదవ తరగతి చదువుతున్న 8వ తరగతి విద్యార్థి ఎం.సందీప్ పరుగున ఎమ్మెల్యే కారు వద్దకు వెళ్లాడు. తాను జంగాలపల్లె దళితవాడకు చెందిన మాజీ సర్పంచ్ కోదండయ్య కుమారుడని, కొంత కాలం క్రితం తన తల్లి చనిపోయిందని, వ్యవసాయ కూలీ అయిన తన తండ్రి తన కోసం ఎంతగానో కష్టపడుతున్నాడని చెప్పుకొచ్చాడు. తన తండ్రి కూలీ పనికి వెళ్లినప్పుడు కాలికి గాయమైందని, మధుమేహం మూలాన అది నయం కాక తీవ్రమైందని, చివరకు ఆయన ఎడమకాలును మోకాలు వరకు రుయా ఆస్పత్రిలో తొలగించారని కంటతడి పెట్టాడు. అప్పటి నుంచి కుటుంబ పోషణ కష్టమైందని, బంధువుల దయా దాక్షిణ్యాల మీద తామిద్దరూ ఆధారపడాల్సి వస్తోందని, తనవరకైతే మధ్యాహ్న భోజనం స్కూలులో తింటున్నానని, తన తండ్రి ఒక్కోసారి పస్తులు ఉండాల్సి వస్తోందని ఆవేదన చెందాడు. తన తండ్రికి వికలాంగ పింఛను మంజూరు చేయిస్తే తమ జీవనానికి ఇబ్బందులు ఉండవని నివేదించాడు. దాదాపు 10 నిమిషాల పాటు విద్యార్థి గోడును సావధానంగా ఆలకించిన ఎమ్మెల్యే తండ్రీకొడుకుల దుస్థితిపై కదలిపోయారు. ఎమ్మెల్యే సూచన మేరకు విద్యార్థి అక్కడికక్కడే అర్జీ రాసిచ్చాడు. ఆ తర్వాత ఎంపీడీఓ జీవరత్నంను ఎమ్మెల్యే పిలిపించారు. విద్యార్థి అర్జీపై సంతకం చేసి, పింఛను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థి కళ్లల్లో కృతజ్ఞతతో కూడిన ఆనందం తొంగిచూసింది. -
పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు షాక్
-
‘ప్రాణమున్నంత వరకు జగన్ వెంటే’
♦కొన్ని చానెళ్లలో నాపై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు ♦పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆగ్రహం సాక్షి, పలమనేరు: తన ప్రాణమున్నంత వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే నడుస్తానని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతానంటూ కొన్ని టీవీ చానెళ్లలో వస్తున్న తప్పుడు కథనాలను మంగళవారం రాత్రి ఆయన పలమనేరులోని తన నివాసంలో తీవ్రంగా ఖండించారు. వారేదో ప్రత్యక్ష్యంగా చూసినట్టు తాను నియోజకవర్గ నాయకులతో సంప్రదిస్తున్నానని నిరాధారమైన విషయాలను టీవీలో చూపెట్టడం సమంజసం కాదన్నారు. త్వరలో నవరత్నాలతో తమ అధినేత ప్రజల్లోకి వస్తున్నారని, దీన్ని చూసి భయపడే అధికారపార్టీ ఇలాంటి నీచమైన మైండ్‌గేమ్‌లకు పాల్పడుతోందని విమర్శించారు. దానికి తోడు పచ్చటీవీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను భయపెట్టి, అధికారాన్ని ఉపయోగించి, కోట్లాదిరూపాయల డబ్బులు కుమ్మరించి నంద్యాలలో గెలిచినంత మాత్రాన అధికారపార్టీ వాపును చూసి బలుపుగా అనుకుంటుందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పాలన కావాలని జనం వేచిచూస్తున్నారని, ఇది జరిగి తీరుతుందని చెప్పారు. -
పూతలపట్టు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
చిత్తూరు : చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాణిపాకంలో నిర్వహిస్తున్న గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వాహనంలో వెళ్తున్నారు. ఆ క్రమంలో ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ఎమ్మెల్యే సునీల్ వాహనాన్ని ఢీకొట్టింది. కాగా ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం సునీల్ మరో కారులో కాణిపాకం బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎస్సీ ఎమ్మెల్యే అంటే చిన్నచూపా?
సునీల్ కేసును పట్టించుకోకపోవడం దారుణం కేసు నమోదు చేయకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి వెల్లడి తిరుపతి మంగళం/ శ్రీరంగరాజపురం /తిరుపతి రూరల్/ మదనపల్లె సిటీ/: పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఎస్సీ వర్గానికి చెందిన వారని అధికారులు, టీడీపీ నాయకులు చిన్నచూపు చూస్తారా? అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ప్రశ్నించారు. శనివారం ఆయన ఫోన్లో విలేకరితో మాట్లాడారు. ఐరాల మండల సమావేశానికి సునీల్ హాజరైనా, సమావేశం నిర్వహించకుండా టీడీపీకి చెందిన సింగిల్ విండో చైర్మన్ గిరినాయుడు రాలేదని సుమారు మూడు గంటలసేపు ఎమ్మెల్యేను నిరీక్షింపజేశారని, ఆ తర్వాత వచ్చిన గిరినాయుడు ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించి కులం పేరుతో దూషించారని ఆందోళన వ్యక్తం చేశారు. గిరినాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డీఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే గిరినాయుడుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. శ్రీరంగరాజపురంలో అక్రమంగా కేసులు శ్రీరంగరాజపురం మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యుడు విజయ్‌కుమార్‌కు చాంబరే లేదు, ఆయన కుర్చీ విరిచారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు 17 మందిపై కేసులుపెట్టడం ఎంతవరకు న్యాయమని ఎమ్మెల్యే నారాయణస్వామి ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. శనివారం ఆయన శ్రీరంగరాజపురంలో పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. విజయ్‌కుమార్ ఆస్తులు ధ్వంసం చేశారా? ఆయనపై దౌర్జన్యం చేశారా? ఎవరి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు? కేసులు నమోదు చేయాలని ఒత్తిడి తెచ్చిన వ్యక్తి ఎవ్వరు తేల్చాలని స్టేషన్లో బైఠాయించారు. నిందితులను వెంటనే అరెస్టుచేయాలి - ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ను అవమానించిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల సమావేశంలో తనపై గిరినాయుడు, బాలసుబ్రమణ్యం నాయుడు దాడికి యత్నించి. కులం పేరుతో దూషించారని సునీల్ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనధికార వ్యక్తులను వేదికపై కూర్చోపెట్టి ఎమ్మెల్యేని దూషించడానికి కారణమైన ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే హక్కులకు భంగం కలిగించిన వారిపై అసెంబ్లీ నైతిక విలువల కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. అసెంబ్లీలో ప్రస్తావిస్తాం : ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ను దుర్భాషలాడిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐరాల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సంఘటనపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. ప్రజాప్రతినిధికి ఇచ్చే గౌరవం అదేనా ? అని ప్రశ్నించారు. పోలీసులకు మంచి బుద్ధి ప్రసాదించండి సారూ ! తిరుపతిలో అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వినతిపత్రం ఎమ్మెల్యే సునీల్‌ను కులం పేరుతో దూషించిన నిందితులను శిక్షించాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు డిమాండ్ చేశారు. దళితులకు న్యాయం చేసేలా పోలీసులకు మంచి బుద్ధి ప్రసాదించు అంటూ శనివారం వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ ఎదుట ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పోలీసులు ఇప్పటికైనా నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చే సి, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించకుంటే దళిత సంఘా ల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించా రు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారపు వాసు, అధికార ప్రతినిధి చాట్ల భానుప్రకాష్, హరిబాబు, సిద్దారెడ్డి, సునీల్, రామస్వామి, లోకనాథం పాల్గొన్నారు. -
ఎంపీడీవో తీరుపై ఎమ్మెల్యే ధర్నా
చిత్తూరు: మండల సర్వసభ్య సమావేశంలోకి అనర్హులకు ప్రవేశం కల్పించి కాలాన్ని వృధా చేస్తున్నారంటూ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ధర్నాకు దిగారు. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 12.00 గంటలైనా ఎందుకు ప్రారంభించలేదని ఎంపీడీవో పార్వతమ్మపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగిల్ విండో చైర్మన్లు తదితరులను సమావేశానికి ఎలా రానిస్తారని ఎంపీడీవోను ఆయన ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు సమావేశం జరుపుతామని ఎమ్మెల్యేకు ఎంపీడీవో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అక్కడే ధర్నాకు దిగారు. కోరం లేకున్నా ఎంపీడీవో పార్వతమ్మ మాత్రం ఈ సమావేశాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.