సాక్షి, అమరావతి: పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్‌ఎస్ బాబు కాణిపాకం దేవస్ధానం ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో సురేష్ బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి (కాణిపాకం, చిత్తూరు జిల్లా) బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎం జగన్‌ను ఆహ్వానించారు. కాగా ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 20 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
దీంతో పాటు ఈ నెల 21న జరగనున్న చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం ఆహ్వానపత్రికను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. ఆహ్వానపత్రాలను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం ఆలయ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో కే. విద్యాసాగర్ రెడ్డి, ఎం. చంద్రశేఖర్‌రెడ్డి, వి. మార్కండేయ శర్మ, ఎం. శ్రీనివాస శర్మ పాల్గొన్నారు.
చదవండి: 'జనాన్ని జనసేన వైపు చూడమంటాడు.. ఈయనేమో టీడీపీని చూస్తాడు'
Comments
Please login to add a commentAdd a comment