brahmothsavalu
-
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ . కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు . శువారం అర్ధరాత్రి వరకు 54,866 మంది స్వామివారిని దర్శించుకోగా 28,866 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.60 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. -
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
-
అశ్వవాహనంపై కల్కి అవతారంలో కొలువుదీరిన శ్రీవారు!
తనువును పులకరింపజేసే మలయమారుతాలు.. మనసుని పరవశింపజేసే గోవిందనామాలు.. ఆధ్యాత్మికానుభూతిని ఇనుమడింపజేసే జీయ్యంగార్ల గోష్టిగానాలు.. శ్రవణానందకరంగా మంగళవాయిద్యాలు.. కనులపండువగా కళాబృందాల నృత్యాభినయాలు.. ఠీవిగా ముందుకేగుతున్న గజరాజులు.. అడుగడుగునా కర్పూరహారతుల నడుమ ఉభయదేవేరీ సమేతంగా మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు. స్వర్ణరథంపై దివ్యతేజోవిరాజితంగా దేవదేవుడు విహరిస్తూ భక్తులకు సకల శుభాలను అనుగ్రహించారు. కలి దోషాలను నివారించే కల్కి అవతారంలో అశ్వవాహనం అధిరోహించి సమస్త జీవకోటిని కటాక్షించారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఎనిమిదోరోజు ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఊరేగారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ మాడవీధుల్లో విహరించారు. ఈ క్రమంలోనే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కనులపండువగా అశ్వవాహన సేవ నిర్వహించారు. శ్రీవారు కల్కి అలంకారంలో అశ్వంపై కొలువుదీరి భక్తజనులను అనుగ్రహించారు. వాహనసేవల్లో టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈఓ ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. నేటితో ముగియనున్న ఉత్సవాలు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం స్నపన తిరుమంజనం, చక్రసాన్నం, రాత్రి ధ్వజారోహణంతో పరిపూర్ణంకానున్నాయి. చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు వరాహస్వామివారి ఆలయం వద్ద పుష్కరిణిలో ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం జరిపించనున్నారు. అనంతరం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు సర్వం సిద్ధం చేశారు. (చదవండి: మూడు వాహనాల్లో మురిపించిన ముగ్ద మనోహరుడు!!) -
Devotees Rush: తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు (ఫోటోలు)
-
తిరుమల : మోహినీ అవతారంలో తిరుమలేశుడు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవం అంకురార్పణతో మెదలై.. ఎన్ని వాహనాలో తెలుసా?
శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి భూలోక వైకుంఠమైన వెంకటాద్రిపై కన్యామాసం (ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రాన దివ్యమైన ముహూర్తంలో అర్చారూపంలో స్వయంవ్యక్తమూర్తిగా శ్రీవేంకటేశ్వరునిగా వెలశాడు. శ్రీస్వామి ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్త ప్రియుడు. కోరినవారికి కొంగు బంగారమై కోర్కెలు నెరవేర్చే ఆ శ్రీవేంకటేశ్వరుని 'వైభోగం న భూతో న భవిష్యతి!'. వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. • దసరా నవరాత్రులు, కన్యామాసం (ఆశ్వయుజం)లో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. • సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకొకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించడం కూడా సంప్రదాయమే. • వైఖానస ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు (ధ్వజారోహణం, ధ్వజావరోహణం) లేకుండా ఆగమోక్తంగా ఉత్సవాలను అలంకారప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదవ నాడు.. మహారథానికి (చెక్కరథం) బదులు ముందు వరకు వెండి రథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుండి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై ఊరేగింపు సాగింది. 2012లో దాని స్థానంలో మరో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది. అంకురార్పణతో ఆరంభం.. వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు)– శాలి, వ్రీహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలను పోసి ఆ మట్టిలో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి అవి పచ్చగా మొలకెత్తేలా చేస్తారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. • శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా అక్టోబరు 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా ఉంది. అంకురార్పణం (14–10–2023) (రాత్రి 7 నుండి 9 గంటల వరకు): వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారికి ఆలయ మాడ వీథుల్లో ఊరేగింపు చేపడతారు. ఆ తరువాత అంకురార్పణం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంగారు తిరుచ్చి ఉత్సవం (15–10–2023) (ఉదయం 9 గంటలకు): శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీథుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు. పెద్దశేషవాహనం (15–10–2023) (రాత్రి 7 గంటలకు): మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) తిరుమాడ వీథులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. భూభారాన్ని వహించేది శేషుడే! శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. చిన్నశేషవాహనం (16–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రతీతి. హంస వాహనం (16–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీమలయప్ప స్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని కలిగిస్తాడు. సింహ వాహనం (17–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహాన్ని బలానికి, వేగానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని ఈ వాహనసేవలోని అంతరార్థం. ముత్యపుపందిరి వాహనం (17–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ముత్యపుపందిరి వాహనంలో స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. కల్పవృక్ష వాహనం (18–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీ«థుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. సర్వభూపాల వాహనం (18–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మోహినీ అవతారం (19–10–2023) (ఉదయం 8 గంటలకు): బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగార రసాధిదేవతగా భాసిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నారు. గరుడ వాహనం(19–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్ప స్వామివారు తిరుమాడ వీథుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెబుతున్నారు. హనుమంత వాహనం (20–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం అవగతమవుతుంది. పుష్పకవిమానం (20–10–2023) (సాయంత్రం 4 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి పుష్పకవిమానంపై విహరిస్తారు. పుష్పక విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు. గజవాహనం(20–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీథుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది. సూర్యప్రభ వాహనం (21–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీ«థుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య విద్య, ఐశ్వర్య, సంతాన లాభాలు భక్తకోటికి సిద్ధిస్తాయి. చంద్రప్రభ వాహనం (21–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాలలో అనందం ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. స్వర్ణరథం (22–10–2023) (ఉదయం 7.15 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు ఉదయం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది. అశ్వవాహనం (22–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణ్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. చక్రస్నానం (23–10–2023) (ఉదయం 6 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వారు ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. -లక్ష్మీకాంత్ అలిదేన, సాక్షి, తిరుమల ఇవి చదవండి: శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఎప్పుడు.. ఎందుకు.. ఎలా మొదలయ్యాయో తెలుసా..!? -
తిరుమల: ముగింపు దశకు బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం (ఫోటోలు)
-
శ్రీకాళహాస్తిలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
కాణిపాకం బ్రహ్మోత్సవాలు.. సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్ఎస్ బాబు కాణిపాకం దేవస్ధానం ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో సురేష్ బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి (కాణిపాకం, చిత్తూరు జిల్లా) బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎం జగన్‌ను ఆహ్వానించారు. కాగా ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 20 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో పాటు ఈ నెల 21న జరగనున్న చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం ఆహ్వానపత్రికను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. ఆహ్వానపత్రాలను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం ఆలయ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో కే. విద్యాసాగర్ రెడ్డి, ఎం. చంద్రశేఖర్‌రెడ్డి, వి. మార్కండేయ శర్మ, ఎం. శ్రీనివాస శర్మ పాల్గొన్నారు. చదవండి: 'జనాన్ని జనసేన వైపు చూడమంటాడు.. ఈయనేమో టీడీపీని చూస్తాడు' -
నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ క్లారిటీ
-
భద్రాద్రిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో 15 రోజులుగా కొనసాగుతున్న వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు బధవారం పూర్ణాహుతితో ముగిశాయి. పూర్ణిమ సందర్భంగా ఆలయంలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బేడా మండపానికి తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులను చేశారు. రోలు, రోకలికి ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచారు. స్వామివారికి ముందుగా చూర్ణోత్సవం, జలద్రాణి ఉత్సవం, నవకలశ స్నపనం జరిపించారు. అనంతరం ఆచార్యులు సుదర్శన చక్రాన్ని శిరస్సుపై ధరించి వైదిక పెద్దలతో కలసి ఆలయంలో ఏర్పాటు చేసిన గంగాళంలో అభిషేకం నిర్వహించారు. చక్రతీర్థంగా అభివర్ణించే ఈ కార్యక్రమం పవిత్ర గోదావరిలో నిర్వహించాల్సి ఉండగా.. కరోనా వైరస్ ప్రభావంతో ఆలయంలోనే అర్చకుల మధ్య నిరాడంబరంగా పూర్తి చేశారు. ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ 12 రకాలుగా ప్రదక్షిణ నిర్వహించి, 12 రకాల ప్రసాదాలను నైవేద్యంగా పెట్టారు. రాత్రికి ఆలయంలోని ఉత్సవ మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ‘ఫృథవీశాంత’ అనే మంత్రంతో మహా కుంభ ప్రోక్షణ నిర్వహించారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అయ్యాయి. కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి నిత్య కైంకర్యాలు.. బ్రహ్మోత్సవాలు ముగియడంతో గురువారం నుంచి స్వామివారికి యథావిధిగా నిత్య కైంకర్యాలు, దర్బార్ సేవ, దశవిధ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. పవళింపు సేవ మాత్రమే నిలిపివేస్తామని చెప్పారు. 16 రోజుల పండుగ రోజున మాత్రమే స్వామివారికి ఏకాంత సేవలు చేస్తామని, ఈనెల 16న నూతన పర్యంకోత్సవం, ఎడబాటు ఉత్సవం ఉంటాయని వివరించారు. -
ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం వైదికంగా అంకురార్పణ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సా.5.23 నుంచి6 గంటల్లోపు మీన లగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు కన్నుల పండువగా ఆరంభం కానున్నాయి. నేడు శ్రీవారికి సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమల/సాక్షి, అమరావతి : తిరుమల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం వైదికంగా అంకురార్పణ నిర్వహించారు. స్వామివారి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామి తరఫున పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన ఆదివారం విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగింపుగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. నేడు శ్రీవారికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు సోమవారం సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని, వెలుపల పెద్ద శేషవాహన సేవలో పాల్గొని ఉత్సవమూర్తిని దర్శించుకోనున్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఒకే కుటుంబంలో తండ్రీ తనయులు ఇద్దరికీ ఈ అవకాశం దక్కడం విశేషం. కాగా, తిరుమలలో రూ.42.86 కోట్లతో నిర్మించిన మాతృశ్రీ వకుళాదేవి అతిథి గృహాన్ని సీఎం ప్రారంభిస్తారు. భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు తిరుమలలోని గోవర్ధన గిరి చౌల్ట్రీ వెనుక భాగంలో రూ.79 కోట్లతో పీఏసీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. -
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన టీటీడీ చైర్మన్
సాక్షి, న్యూఢిల్లీ : తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌ను కలిశారు. గురువారం ఢిల్లీ వెళ్లి తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలకు హజరుకావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి రాజనాథ్‌సింగ్‌కు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి ఆహ్వాన పత్రికను అందించారు. కాగా ఈ నెల 29న తిరుమల తిరుపతి ఆలయంలో అంకురార్పణ అనంతరం 30వ తేది నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఆక్టోబర్ 8న చక్ర స్నానంతో ముగియనున్నాయి. -
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు
రాష్ట్ర రాజధానికి 35 కి.మీ దూరంలో ఉన్న ప్రఖ్యాత శైవక్షేత్రం. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరుగా నిలుస్తోంది కీసరగుట్ట. భక్తులు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఆస్వాదించేందుకుఅనువైన దేవాలయం. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు కీసరగుట్టలోని రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా కీసరగుట్ట ప్రత్యేకత, ఇక్కడి సందర్శనీయ ప్రాంతాలపై ప్రత్యేక కథనం. ఆలయానికి మూడు ప్రత్యేకతలు.. ఇక్కడి శివాలయం పశ్చిమాభిముఖంగా ఉంది. గర్భగుడిలోని శివలింగం సైకత లింగంగా ప్రసిద్ధికెక్కింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ శివాలయానికి ఎదురుగా హనుమంతుడిచే విసిరివేసినట్లు చెబుతున్న శివలింగాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. కీసరగుట్ట దాని పరిసర ప్రాంతాల్లో 107 శివలింగాలు ఉండగా.. చివరి లింగం యాదాద్రి జిల్లాకొలనుపాకలో ఉంది. జైన విగ్రహాలు కూడా ఉండటం ఇక్కడి మరో విశేషం. ఆంజనేయస్వామి విగ్రహం: కీసరగుట్టలో భక్తుల విరాళాలతో ఇక్కడ 32 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఈ విగ్రహం ఎంతో కనువిందుచేస్తుంది. హుడాపార్కు యాత్రికులు సేదతీరేందుకు కీసరగుట్ట దిగువ ప్రాంతంలో ప్రభుత్వం హుడాపార్కును అభివృద్ధి చేసింది. సుమారు 20 ఎకరాల్లో ఈ పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి దర్శనానంతరం భక్తులు ఈ పార్కులో సేదతీరవచ్చు. టీటీడీ వేదపాఠశాల: కీసరగుట్ట దిగువ ప్రాంతంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాల ఉంది. భారతీయ సంసృతీ సంప్రదాయాలు, గురుకుల విద్య తరహాలో కొనసాగుతున్న వేదపాఠశాలను యాత్రికులు సందర్శించవచ్చు. ఇటీవల ఇక్కడ సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో వేద విద్యార్థుల సౌకర్యార్థం వివిధ భవనాలను టీటీడీ నిర్మించింది. దర్శనీయ ప్రాంతాలివీ.. సీతమ్మగుహ: ఏకశిలతో ఏర్పడిన సీతమ్మ గుహ సందర్శకులను ఆకట్టుకుంటుంది. మహిషా సురమర్దని ఆలయం ఈ గుహలో ఉంది. ప్రధాన ఆలయానికి ఈశాన్యంలో సీతమ్మ గుహ ఉంది. భక్తులు వెళ్లడానికి ఇటీవల కొత్తగా ఆలయం నుంచి సీతమ్మ గుహ వరకు మెట్లు నిర్మించారు. మ్యూజియం: కీసరగుట్టను ఆయుధాగారంగా ఏర్పాటు చేసుకొని పాలన కొనసాగించిన విష్ణుకుండినుల చరిత్రకు ఆనవాలుగా, రాజ ప్రాసాదాలు, నాణేలు, ఇటీవల బయట పడిన జైనతీర్థంకుల విగ్రహాలు) తదితర అవశేషాలను తిలకించేందుకు మ్యూజియాన్ని యాత్రికులు తిలకించవచ్చు. శివలింగాలు: కీసరగుట్టలో స్వామి వారి దర్శనానంతరం ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న 101 శివలింగాలను యాత్రికులు దర్శించవచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శివలింగాలకు భక్తులు పాలు, పూలు, పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించడం ఆనవాయితీ. తామర కొలను: ప్రధానకొండ దిగువ భాగంలో తెల్ల తామర కొలను యాత్రికులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. గుట్ట ప్రాంతమంతా అక్కడక్కడా ఉన్న రాతి మండపాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి. అతిరథ మహాయాగంనిర్వహించిన ప్రదేశం సప్త సోమయాగాల్లో ఒకటైన అతిరథ మహా యాగాన్ని తపస్ సంస్థ ఆధ్వర్యంలో కేరళకు చెందిన నంబూద్రి వంశస్తులు కీసరగుట్టలో 2013 ఏప్రిల్ మాసంలో పదిరోజుల పాటు కీసరగుట్టలో నిర్వహించారు. ఈ యాగంతో ఈ ప్రదేశం ఎంతో ప్రవిత్రతను సముపార్జించుకుంది. యాత్రికులు అతిరథ మహాయాగం జరిగిన స్థలాన్ని కూడా సందర్శించవచ్చు. లక్ష్మీనరసింహస్వామి దేవాలయం: ప్రధాన ఆలయ సమీపంలో యోగి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. స్వామివారి దర్శనానంతరం భక్తులు ఇక్కడి యోగి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవచ్చు. కీసరస్వామి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో భక్తులు చీర్యాల లక్ష్మీనర్సింహస్వామి, నాగారంలోని శివాలయం, షిరిడీ సాయి బాబా దేవాలయాలను కూడా దర్శించుకోవచ్చు. కీసరగుట్టకు ఇలాచేరుకోవచ్చు సాధారణ రోజుల్లో కీసరగుట్టకు సికింద్రాబాద్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఈసీఐఎల్ నుంచి 15 కి.మీ ప్రయాణిస్తే కీసరగుట్ట వస్తుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా నగరంలోని అన్ని ప్రాంతాలతో పాటు, యాదాద్రి తదితర జిల్లాల్లోని గ్రామాల నుంచి ఆర్టీసీ 300 ప్రత్యేక బస్సులు నడపనుంది. యాత్రికుల సౌకర్యార్థం పున్నమి హోటల్, టీటీడీ ధర్మశాల, గెస్ట్ హౌస్‌లున్నాయి. -
ముగ్ధ మనోహరం
శ్రీశైలం: శ్రీగిరి కొండల్లో వెలసిన భ్రమరాంబా సమేత శ్రీమల్లికార్జున స్వామిఅమ్మవార్లు గురువారం రాత్రి మయూర వాహనంపై ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు ఓం హర శంభోశంకరా... శ్రీశైల మల్లన్నా పాహిమాం.. పాహిమాం అంటూ పురవీధుల్లో సాగిలపడ్డారు. ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో ఉత్సవ మూర్తులను మయూర వాహనంపై ఉంచి వేదమంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా వాహన పూజలను నిర్వహించారు. అనంతరం వాహన సమేతులైన శ్రీ స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రాంగణం నుంచి ఊరేగిస్తూ కృష్ణదేవరాయుల గోపురం మీదుగా రథశాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, బయలువీరభద్రస్వామి మండపం చేరుకొని తిరిగి రాత్రి 9.30 గంటలకు ఆలయ ప్రాంగణం చేరింది. ఈ గ్రామోత్సవంలో లక్షలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించి పునీతులయ్యారు . ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీరామచంద్రమూర్తి, ట్రస్ట్‌బోర్డ్ చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, సభ్యులు చిట్టిబొట్ల భరధ్వాజశర్మ, చాటకుండ శ్రీనివాసులు,మాజి ఈఓ శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటి రాత్రి వరకే మల్లన్న స్పర్శదర్శనం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం రాత్రి వరకు మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. శనివారం తెల్లవారుజాము నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు మల్లికార్జునస్వామివార్ల అలంకార (దూర) దర్శనాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. శివస్వాములు, సాధారణ భక్తజనంతో పాటు వీఐపీలు, వీవీఐపీలకు కూడా మల్లన్న స్పర్శదర్శనం శివరాత్రి ముగిసే వరకు ఉండదని పేర్కొన్నారు. పట్టు వస్త్రాలు సమర్పించిన కాణిపాక దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శివరాత్రి పర్వదినాన జరిగే స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవానికి కాణిపాకవరసిద్ది వినాయక దేవస్థానం తరపున గురువారం ఉదయం పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాకం దేవస్థానం ఈఓ పూర్ణచంద్రారావు, అర్చక వేదపండిత బృందం స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు, ఫలపుష్పాదులకు శాస్త్రోక్త పూజలు చేసి స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకటరావు శుక్రవారం సాయంత్రం సంప్రదాయానుసారం పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఆకట్టుకున్నసాంస్కృతిక ప్రదర్శనలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల కోసం దేవస్థానం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు ఉషాబృందం వారి భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రముఖ సినీ సంగీత దర్శకులు, గాయకులు కొండూరు నిహాల్, పాడుతా తీయగా విజేతలు శ్రీప్రణతి, సాయి రమ్య, లక్ష్మీమేఘన, ప్రణవ్, చేతన్, లాస్య ప్రియ, జి.సరిగమ విజేత దివ్య మాలిక, బోల్‌బేబీ బోల్ విజేత అఖిల్, శర్మిషలు ఆలపించిన భక్తి గేయాలు భక్తులకు వీనులవిందయ్యాయి. అలాగే శివదీక్షా శిబిరాల వద్ద వినాయక నాట్య మండలి వారి సతీఅనసూయ నాటక ప్రదర్శన శ్రీశైలం ప్రాజెక్ట్ కె. ప్రసాద్‌రావు బృందం వారి మోహిని భస్మాసుర, శ్రీశైలం రాములు నాయక్ బృందం వారి నాటక ప్రదర్శనలు అర్ధరాత్రి వరకు భక్తులను అలరించాయి. మాఘమాసంలో శివుడిని బిల్వదళాలతో పూజించిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో ఉంది. దీంతో మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినం రోజున ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రంలో వెలసిన శ్రీశైలమల్లికార్జునస్వామివార్లను అష్టాదశ శక్తిపీఠంగా వెలసిన శ్రీభ్రమరాంబాదేవిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి పాదయాత్రతో భక్తులు చేరుకుంటుంటారు. శ్రీశైల మల్లికార్జునస్వామిని శక్తికొలది బిల్వపత్రాలతో, అడవిలో కోసుకొచ్చిన పూలు, పత్రిని సమర్పించి తమ కోర్కెలను చెప్పుకుంటారు. మహాశివరాత్రి పర్వదినం నాడు స్వామివార్ల పాగాలంకరణ దర్శనం చేసుకుని బ్రహ్మోత్సవ కల్యాణాన్ని వీక్షించి, ఆ తరువాత రోజు జరిగే మల్లన్న రథోత్సవ వేడుకను కనులారా తిలకించి తిరుగు ప్రయాణమవుతారు. నేడు శ్రీశైలంలో... మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను రావణవాహనంపై ఆవహింపజేసి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. వాహన సమేతులైన స్వామిఅమ్మవార్లను రథశాల నుంచి నందిమండపం, అంకాలమ్మగుడి, బయలువీరభద్రస్వామిఆలయం వరకు ఊరేగిస్తారు. ప్రత్యేక పూజలలో భాగంగా శుక్రవారం ఉదయం 7.30గంటలకు నిత్యహోమ బలిహరణలు, జపానుష్ఠానములు, నిర్వహిస్తారు ఆ తర్వాత శ్రీ స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు చేస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి నిత్యపూజలు, అనుష్ఠానములు, నిత్యహవనములు, బలిహరణలను సమర్పిస్తారు. శివ పూజా ఫలితం ఇలా.. ♦ చైత్రమాసంలో శివుని నృత్యగీతాలతో సేవిస్తూ దర్భపూలతో పూజిస్తే బంగారం లభిస్తుంది. ♦ వైశాఖమాసంలో శివున్ని నేతితో అభిషేకించి,తెల్లమందారాలతో పూజిస్తే అశ్వ మేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. ♦ జ్యేష్ట మాసంలో పెరుగుతో అభిషేకించి, తామర పూలతో పూజించిన వారు ఉత్తమ గుణాలను పొందుతారు. ♦ ఆషాఢమాసంలో స్వామికి గుగ్గిలంతో ధూపం వేసి, పొడవాటి తొడిమలు గల పూలతో పూజిస్తే బ్రహ్మాలోకప్రాప్తి కలుగుతుంది. ♦ శ్రావణమాసంలో ఏకభుక్తం అంటే మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రివేళలో ఉపవాసం ఉంటూ, గన్నేరు పూలతో శివున్ని పూజించిన వారికి వేయి గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది. ♦ భాద్రాపదమాసంలో ఉత్తరేణి పూలతో శివున్ని పూజించినవారు మరణాంతరం రుద్రలోకానికి చేరుకుంటారు. ♦ ఆశ్వీయుజమాసంలో జిల్లేడు పూలతో శివున్ని అర్చించిన వారు శివలోకాన్ని పొందుతారు. ♦ కార్తీకమాసంలో శివున్ని పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించినవారు శివసాన్నిధ్యానికి చేరుకుంటారు. ♦ మార్గశిరమాసంలో పొగడపూలతో పూజించిన వారు కైలాసాన్ని చేరుకుంటారు. ♦ పుష్యమాసంలో శివున్ని ఉమ్మెత్త పూలతో పూజించిన వారు పరమపదాన్ని పొందుతారు. పూలు – ఫలం ♦ పొగడ శివానుగ్రహం ♦ గన్నేరు ధనం ♦ జిల్లేడు సిరిసంపదలు ♦ ఉమ్మెత్త మోక్షం ♦ నల్లకలువ సుఖ సంతోషాలు ♦ ఎర్రతామర రాజ్యాధికారం ♦ తెల్లతామర ఉన్నతమైనపదవులు ♦ సంపెంగ కోరిన కోరికలు ♦ తెల్లజిల్లేడు అనుకున్న పనులు ♦ బ్రహ్మచారులు సన్నజాజి పూలతో శివున్ని పూజిస్తే గుణవంతురాలైన కన్యతో వివాహం ♦ ముత్తైదువులు గరికపూలతో పూజిస్తే ఐదోతనం వృద్ధి ♦ మల్లెపూలతో శివలింగాన్ని పూజిస్తే లౌకిక విద్యలు,ఆధ్యాత్మిక విద్యలు ♦ కడిమి పూలతో శివున్ని పూజించిన విజయం ♦ దర్భపూలతో పూజలు చేస్తే ఆరోగ్యం ♦ బిల్వదళాలతో పూజిస్తే దారిద్య్రం తొలగి,సకల కోరికలు సిద్ధిస్తాయి. ♦ ఏ పూలతో పూజించినా శివపూజలో చిత్తశుద్ధి ముఖ్యం 3 నుంచి శ్రీశైలానికి బైక్‌లు, ఆటోలు నిషేధం ఆత్మకూరురూరల్: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలపై పోలీస్, రవాణా శాఖ అధికారులు నియంత్రణ విధించారు. ఈమేరకు గురువారం ఆత్మకూరు సీఐ బత్తల కృష్ణయ్య తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీశైలం యాత్రికులకు పలు సూచనలు చేశారు. మార్చి 3వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలోని దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్లో బైక్‌లు, ఆటోలను నిషేధించినట్లు తెలిపారు. సరుకు రవాణా చేసే వాహనాలలో ప్రయాణం చట్ట విరుద్ధమని, ఈ వాహనాలను కూడా శ్రీశైలానికి అనుమతించడం లేదని ఆయన స్పష్టం చేశారు. మహాశివరాత్రి రోజున మార్చి 4న సాయంత్రం 6 గంటల నుంచి దోర్నాల నుంచి శ్రీశైలానికి పూర్తిగా వాహనాల నిషేధం అమలులో ఉంటుందన్నారు. పాగాలంకరణ తరువాత శ్రీశైలం నుంచి దిగువకు వచ్చే వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎగువకు వాహనాలను నిషేధించామన్నారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బైర్లూటీ లో వాహనాలను నిలిపివేస్తామన్నారు. సమావేశంలో ఆత్మకూరు ఎస్ఐ రమేష్ కూడా ఉన్నారు. -
బ్రహ్మోత్సవం.. కనిపించని భక్తజనం
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 25 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కాగా గడిచిన నాలుగైదు రోజుల నుంచి శివరాత్రి భక్తుల హడావిడే కనిపించడంలేదు. సా«ధారణంగా ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగానే భక్తుల తాకిడి మొదలవుతోంది. ఉత్సవాలు ఆరంభమైన 4వ రోజుకే శ్రీశైలం అంతా భక్త జనసంద్రంగా మారుతోంది. ఇదంతా ఊహించుకుని దేవస్థానం అధికారులు మహాశివరాత్రి పర్వదినానికి మూడు రోజుల ముందుగానే స్పర్శదర్శనాన్ని నిలిపివేస్తామని ప్రకటించారు. అయితే ఈ ఏడాది భక్తుల రద్దీ ఊహించినంత మేర లేకపోవడంతో శుక్రవారం రాత్రి 7.30 వరకు గర్భాలయ దర్శనాలను అనుమతించాలనే నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో ట్రస్ట్‌బోర్డు సమావేశంలో ఫిబ్రవరి 28 వరకు ఇరుముడు స్వాములకు స్పర్శదర్శనాన్ని అనుమతించాలని రద్దీకి అనుగుణంగా భక్తుల మనోభావాలనుసరించి మార్చి 1 వరకు ఏర్పాటు చేయాలని చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, సభ్యులు తీర్మానించారు. కాని ఊహించినంతగా భక్తుల రద్దీ కనపడకపోవడం చంద్రావతి కల్యాణ మండపం నుంచి ప్రారంభమైన శివదీక్షా స్వాముల క్యూ ఇప్పటి వరకు పూర్తిగా నిండిన రోజే లేకపోవడం గమనార్హం. ఫిబ్రవరి 28 వరకే ఇరుముడి స్వాములకు గర్భాలయ దర్శనం ఉంటుందని ప్రచారం జరగడం ఒక కారణం కాగా, స్పర్శదర్శనానంతరం తమ తమ గ్రామాలకు చేరుకుని మహాశివరాత్రిన తమ స్వగ్రామంలోని శివాలయల్లో దీక్షా విరమణ చేయవచ్చునని కుటుంబ సభ్యులతో కలిసి ఉండవచ్చుననే ఆలోచనతో చాలా మంది స్వాములు ఇళ్లకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. బోసిపోయిన నల్లమల దారులు.. గత ఏడాది ఉత్సవాల ఆరంభమైనన రెండవ రోజు నుంచే రద్దీ ప్రారంభం అయ్యేది. కనీసం 50 నుంచి 80 వేల వరకు దర్శించుకునే వారు. అయితే ఈ ఏడాది స్వామిఅమ్మవార్లను ఉత్సవాలు ఆరంభమైన నాటి నుంచి కూడా ప్రతి రోజూ 25 వేల నుంచి 30 వేలకు మించి దర్శనాలు జరగలేదనే అభిప్రాయాన్ని ఆలయ అధికారులు, సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. అలాగే నాగలూటి, పెచ్చెర్వు, భీమునికొలను, కైలాసద్వారం ద్వారా శ్రీశైలం చేరుకుని పాదయాత్ర భక్తుల సంఖ్యకూడా గణనీయంగా తగ్గినట్టు కన్పిస్తుంది. ఈ ఏడాది సోమవారం మహాశివరాత్రి పర్వదినం రావడంతో శుక్రవారం నుంచి రద్దీ పెరిగే అవకాశం ఉంది. రఅన్నదాన కేంద్రాలు ఖాళీ సాధారణంగా ఉదయం 10.30 వరకు దేవస్థానం అన్నపూర్ణభవన్‌లో స్వాములకు, శివస్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తారు. అనంతరం 11.30 గంటల నుంచి సాంబార్ అన్నం, పెరుగన్నం,సాధారణభక్తులకు భోజన సౌకర్యం కల్పిస్తుంటారు. అయితే వండుతున్న పదార్ధాలు కూడా మిగిలే పరిస్థితి నెలకొని ఉండడంతో అన్నపూర్ణభవన్ అధికారులు వృధాను నియంత్రించడం కోసం రద్దీకి అనుగుణంగా అప్పటికప్పుడు వంటలు తయారు చేస్తున్నారు. 3 తర్వాతనే బందోబస్తు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కర్నూలు పర్యటన మార్చి 2కు వాయిదా పడడంతో శ్రీశైలానికి చేరాల్సిన బందోబస్తు సిబ్బంది సీఎం పర్యటనకు కేటాయించినట్లు తెలుస్తోంది. మార్చి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పూర్తి స్థాయి బందోబస్తు ఉండే అవకాశం ఉంది. పరీక్షలతోనే రద్దీ తగ్గుదల బ్రహ్మోత్సవాల్లో రద్దీ తగ్గడానికి ఇప్పటికే ఇంటర్ మీడియట్, పరీ క్షలు ప్రారంభం కావడంతో మరో 2 వారాల తరువాత 10వ తరగతి పరీక్షలు కూడా ఉండడంతో రద్దీ తగ్గడానికి ఈ పరీక్షలు కూడా ఓ కారణమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. సాధారణంగా శివరాత్రి వరకు ఇక్కడే శివ స్వాములు.. ఈ ఏడాది తమ పిల్లలకు పరీక్షలు ఉండటంతో ఇరుముడులను సమర్పించుకుని స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. -
హరహర మహదేవ
శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో స్వయంభుగా వెలసిన అఖిలాండ నాయకుడైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు సోమవారం యాగశాల ప్రవేశంతో ప్రారంభం కానున్నాయి. ఉదయం 7.47 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహ వాచనము,శివసంకల్పం, చండీశ్వర పూజ, రుత్విగ్వరణము కార్యక్రమాలుంటాయి. ఆ తరువాత అఖండ స్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, పంచావరణార్చన, మండపారాధన, రుద్ర కలశ స్థాపన పూజలను నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుంచి అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన, రాత్రి ఏడు గంటలకు త్రిశూలపూజ, భేరీపూజ, సకల దేవతాహ్వాన పూర్వక ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ, బలిహరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు మార్చి 7 వరకు కొనసాగుతాయి. 4న బ్రహ్మోత్సవ కల్యాణం బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 4న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లకు రాత్రి 7గంటల నుంచి నందివాహనసేవ, ఎదుర్కోలు ఉత్సవం ఉంటాయి. రాత్రి 10గంటల నుంచి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, 10.30 నుంచి పాగాలంకరణ, రాత్రి 12 గంటల తరువాత శాస్త్రోక్తంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సంప్రదాయానుసారం ఈ నెల 28న తిరుమల తిరుపతి దేవస్థానం, మార్చి 1న రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణానికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. విద్యుత్ దీపాల అలంకరణలో గంగాధర మండప కూడలి బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు 26న స్వామిఅమ్మవారు భృంగివాహనంపై దర్శనమిస్తారు. 27న హంసçవాహనం, 28న మయూర వాహనం, మార్చి 1న రావణవాహనం, 2న పుష్పపల్లకీ మహోత్సవం, 3న గజవాహనం, 4న ప్రభోత్సవం, నందివాహనసేవ, 5న రథోత్సవం, 6న పూర్ణాహుతి, ధ్వజావరోహణ, 7న అశ్వవాహన సేవలు ఉంటాయి. 5న రథోత్సవం మహాశివరాత్రి పర్వదినాన వధూవరులయ్యే శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లను మార్చి 5న రథంపై ఆవహింపజేసి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం ఏర్పాటు చేశారు. దీనికి ముందు రోజు చండీశ్వరుడి ప్రభోత్సవం ఉంటుంది. మార్చి 6న ఉదయం 9.30 గంటలకు రుద్ర, చండీహోమాలకు పూర్ణాహుతి నిర్వహించి.. వసంతోత్సవం, కలశోద్వాసన, త్రిశూల స్నానం తదితర విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 7.30 గంటలకు ధ్వజపటాన్ని అవరోహణ చేస్తారు. 7వ తేదీన శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్లకు పుష్పోత్సవ, శయనోత్సవ, ఏకాంత సేవలు నిర్వహిస్తారు. -
బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
చిత్తూరు, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 21వ తేదీ వరకు జరుగుతా యి. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు విస్తృత ఏర్పాట్లు చేశామని టీటీటీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈఓలు శ్రీనివాసరాజు.. పోలా భాస్కర్‌తో కలిసి సమీక్షించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో రాత్రి వాహనసేవను గంట ముందుగా ప్రారంభిస్తామన్నారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు జరుపుతామన్నారు. గరుడవాహనసేవను రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. రద్దీ దృష్ట్యా ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. భక్తుల కో సం రోజూ 7 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నామన్నారు. శ్రీవారి ఆలయం,ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో విద్యుత్, పుష్పాలం కరణలు చేపట్టామన్నారు. జిల్లా యంత్రాంగం కూడా సహకారం అందిస్తోందన్నారు. రూ.9 కోట్లతో అలంకరణ.. రూ.9 కోట్లతో విద్యుత్ అలంకరణలు, పెయింటింగ్, బారికేడ్లు తదితర ఇంజినీరింగ్ పనులు చేపట్టామన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం రూ.26 కోట్లతో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఆలయ మాడ వీధులు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. వాహన సేవలను తిలకించేందుకు 31 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. గరుడసేవ సమయంలో గ్యాలరీల్లో 2 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు. 7వేల వాహనాలకు పార్కింగ్.. తిరుమలలో 7 వేల వాహనాలు పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. గరుడసేవ సందర్భంగా ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను నిషేధించామన్నారు. ఇందుకోసం తిరుపతిలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, ప్రమాదాల నివారణకు 8 ప్రాంతాల్లో క్రేన్లు, ఆటోమొబైల్ క్లినిక్ వాహనాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. పోలీసులకు బాడివోర్న్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సాఫ్ట్వేర్ అందించినట్టు చెప్పారు. 3 వేల మంది పోలీసులు, 3 వేల మంది శ్రీవారి సేవకులు, వెయ్యి మంది స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, ఈతగాళ్లు అందుబాటులో ఉంటారన్నారు. దాతలకే గదులు.. బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయిస్తామన్నారు. గరుడసేవ సందర్భంగా 15 నుంచి 17వ తేదీ వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 12 నుంచి 14వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదన్నారు. 11 ప్రథమ చికి త్స కేంద్రాలను ఏర్పాటు చేశామని, 12 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వాహనసేవల ముందు స్థానిక కళాకారులతోపాటు ఇతర రాష్ట్రాల కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ గరుడసేవ సందర్భంగా ఈనెల 16, 17 తేదీల్లో దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేశామన్నారు. సెప్టెంబరు 17న సర్వదర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను రద్దు చేసినట్టు తెలిపారు. టీటీడీ ఇన్చార్జి సీవీఎస్ఓ శివకుమార్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఇ–2 రామచంద్రారెడ్డి, ఆలయ డెప్యూ టీ ఈఓ హరీంద్రనాథ్, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషా రెడ్డి, కల్యాణకట్ట డెప్యూటీ ఈఓ నాగరత్న, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు. బ్రహోత్సవాల నిర్వహణకు సకల ఏర్పాట్లూ పూర్తి చేశాం. టీటీడీలోని అన్ని విభాగాలను సమన్వయపర్చుకుని ముందుకెళ్తున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగరాదన్నది మా అభిమతం. వాహన సేవల్లో స్వామివారిని భక్తులు ఇబ్బంది లేకుండా వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. – అనిల్‌కుమార్ సింఘాల్, టీటీడీ ఈఓ -
బ్రహ్మోత్సవాల రోజుల్లో దాతలకు మాత్రమే గదులు
తిరుమల: శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజీ దాతలకు మాత్రమే గదులు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 10 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 17న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు కాటేజీ దాతలకు ఎలాంటి గదుల కేటాయించడం లేదని టీటీడీ తెలిపింది. అక్టోబర్ 14న గరుడసేవ సందర్భంగా అక్టోబర్ 12 నుండి 14 వరకు కాటేజీ దాతలకు టీటీడీ ఎలాంటి గదుల కేటాయించదు. ఒకే కాటేజీలో రెండు గదుల కంటే ఎక్కువగా విరాళంగా ఇచ్చిన దాతలకు రెండు గదులను రెండు రోజుల పాటు టీటీడీ కేటాయించనుంది. ఒకే కాటేజీలో ఒక గదిని విరాళంగా ఇచ్చిన దాతలకు ఒక గదిని రెండు రోజుల పాటు కేటాయిస్తుంది. ఈ విషయాన్ని గమనించాలని కాటేజీ దాతలకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం ఆహ్వాన పత్రికను అందజేసిన టీటీడీ ఈవో సాక్షి, అమరావతి: తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ శనివారం ఆహ్వానించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎంని కలిసిన సింఘాల్ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ, తిరుమలకు సంబంధించిన పలు అంశాలను ఆయన చంద్రబాబుకు వివరించారు. -
రామా.. కనుమా..!
రాజంపేట : రెండో అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన తదితర అంశాలపై టీటీడీ అధికారులు ఇంత వరకు సమీక్ష నిర్వహించలేదు. 13 రోజుల్లో ఏర్పాట్లు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగంతో తిరుమల తిరుపతి దేవస్థానం కలిసి చేయాల్సిన వాటిపై చర్చలు లేవు. మరో వైపు శాశ్వత అభివృద్ధి పనుల కన్నా.. బ్రహ్మోత్సవాల సమయంలో తాత్కాలిక పనులు చేపట్టి ఉత్సవాలను పూర్తి చేసుకుని వెళ్లడం పైనే టీటీడీ దృష్టి సారిస్తోంది. తొలిసారిగా టీటీడీ చేపట్టిన ఉత్సవాల సమయంలో.. రామాలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రూ.40 కోట్ల వరకు శాశ్వత, తాత్కాలిక పనులకు వెచ్చించినట్లుగా తెలుస్తోంది. ప్రచారమేదీ?: ఒంటిమిట్ట కోదండ రామాలయం (ఏకశిలానగరం)లో ఈ సారి జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రచారం ఊపందుకోలేదు. దీనికి సంబంధించి సమీక్షలు, పోస్టర్ల ఆవిష్కరణలు టీటీడీ ఏడీ బిల్డింగ్‌లో కాకుండా ఏకశిలానగంలో చేసి ఉంటే బాగుండేదని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మోత్సవాలకు ప్రచారం జరిగి ఉండేదని జిల్లా వాసులు అభిప్రాయ పడుతున్నారు. తిరుపతిలో అనేక ఆలయాలకు సంబంధించి పోస్టర్ల ఆవిష్కరణ, సమీక్షలు జరుగుతుంటాయి. కాబట్టే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు పెద్దగా ప్రాచుర్యం లేకుండా పోయిందనే అపవాదును టీటీడీ మూటకట్టుకుంది. ఇప్పటి వరకు ఈఓ సింఘాల్ ఇటు వైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలున్నాయి. టీటీడీ వైఖరిని స్థానిక ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేక పోతున్నారు. తమ భాగస్వామ్యం లేకుండా పోయిందనే ఆవేదన వారిలో నెలకొంది. గత బ్రహ్మోత్సవాలను ఓ సారి పరిశీలిస్తే.. గత బ్రహ్మోత్సవాలతో ఈ సారి ఏర్పాట్లను పోల్చుకుంటే వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. గతంలో బ్రహ్మోత్సవాల పనులకు సంబంధించి టీటీడీ ఈఓ సాంబ శివరావు ఒంటిమిట్టలో జిల్లా యంత్రాంగంతోపాటు టీటీడీ అధికారులను సమన్వయం చేసే విధంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అప్పట్లో రూ.3.20 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో కల్యాణ వేదిక ఏర్పాటు చేశారు. ఈ సారి ఆ వ్యయం రూ.3.50 కోట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఈ సారైనా అందుబాటలోకి వచ్చేనా..! కోదండరామున్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు, యాత్రికులు, పర్యాటకుల కోసం రూ.5 కోట్లతో విడిది సముదాయ భవనం నిర్మించారు. ఈ భవన నిర్మాణాన్ని రూ.3.20 కోట్లతో చేపట్టారు. రూ.1.83 కోట్లతో ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. గతేడాది టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి శంకు స్థాపన చేశారు. గతేడాది సీఎంతో ప్రారంభించాలనుకున్నారు. కానీ వీలుపడలేదు. దీంతో అందుబాటులోకి రాలేకపోయింది. ఈ సారైనా అందుబాటులోకి తేవాలని భక్తులు కోరుతున్నారు. గత పొరపాట్లను సరిద్దుకునేనా.. 2017 బ్రహ్మోత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న పొరపాట్లను టీటీడీ సరిదిద్దుకునేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు సరైన రీతిలో భోజన వసతి కల్పించలేదు. ఆర్టీసీ బస్సులను ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేయలేదు. చాలా మంది భక్తులు కల్యాణం చూడలేక వెనుదిరిగారు. వారికి స్వామి కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు అందలేదు. మరుగుదొడ్లు, మంచినీటి వసతి అంతంత మాత్రంగానే కల్పించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా టీటీడీ ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లాలని భక్తులు కోరుతున్నారు. ఆ దిశగా జిల్లా యంత్రాంగం సహకారంతో టీటీడీ పూర్తిగా తీసుకుంటేనే బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యే పరిస్థితులు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. -
తిరుమలలో స్వర్ణోత్సవం
-
అక్టోబర్ 2 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
జిన్నారం: మండలంలోని గుమ్మడిదల గ్రామంలో గల కల్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలను వచ్చే నెల 2 నుంచి నిర్వహించనున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు స్వామివారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను కూడ అర్చకులు ఆవిష్కరించారు. ఉత్సవాల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున స్వస్తి వాచనం, 3న ధ్వజారోహణం, శేషవాహనం, 4న స్వామివారి అభిషేకం, గజవాహన సేవ, 5న కల్యాణోత్సవం, హనుమంత వాహన సేవ, 6న సదస్వం, గరుడవాహన సేవ, 7న మహాపూర్ణాహుతి, అశ్వవాహన సేవ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆలయ వంశపారం పర్య ధర్మకర్తలు సుందరాచార్యులు, నర్సింహ్మాచార్యులు తెలిపారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించటంలో తాము కూడా భాగస్వాములవుతామని సర్పంచ్ సురేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ నరేందర్‌రెడ్డిలు తెలిపారు.