
తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరిరోజైన మంగళవారం పుష్కరిణిలో శ్రీవారికి చక్ర స్నానం వేడుకగా ముగిసింది

టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఇవాళ రాత్రి ధ్వజావరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి, చక్రత్తాళ్వర్‌కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహిస్తారు

సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వైభవోపేతంగా నిర్వహించింది

































