Tirumala Brahmotsavam
-
తిరుమల : సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: కల్పవృక్ష వాహన సేవ (ఫొటోలు)
-
సేనాపతి ఉత్సవం.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. అంకురార్పణ కార్యక్రమంలో శ్రీవారి తరపున ఆయన సేనాధిపతి అయిన విశ్వక్సేనుడిని మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో శ్రీవారి ఉత్సవాలు.. 12వ తేదీ రాత్రి ధ్వజావరోహణంతో ముగుస్తాయి.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. దీన్నే ‘మృత్సంగ్రహణ యాత్ర’ (పుట్టమన్ను సేకరణ) అంటారు. ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పేర్కొంటారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 05వ తేదీన ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 06వ తేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 07వ తేదీ సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనం, ఎనిమిదో తేదీ ఉదయం మోహిని అవతారం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతారు. గరుడ సేవకు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.09వ తేదీ ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం, 10వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 11వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 12వ తేదీ శనివారం ఉదయం చక్రవాహనం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. అక్టోబరు 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబరు 8 అర్ధరాత్రి వరకు ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది. అలాగే.. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. -
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు హనుమంత వాహనంపై శ్రీనివాసుడు (ఫొటోలు)
-
హనుమంత వాహనంపై శ్రీవారి దర్శనం
-
తిరుమల బ్రహ్మోత్సవాలు : సింహ వాహనం పై శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)
-
తిరుమల: ముగింపు దశకు బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం (ఫోటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరిరోజైన మంగళవారం పుష్కరిణిలో శ్రీవారికి చక్ర స్నానం వేడుకగా ముగిసింది. టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఇవాళ రాత్రి ధ్వజావరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి, చక్రత్తాళ్వర్కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం చక్రత్తాళ్వరుకు అర్చకులు పుష్కరిణీలో పవిత్ర స్నానం ఆచరించారు. సుదర్శన చక్రతాళ్వార్‌ను పుష్కరిణిలో పవిత్ర స్నానం తర్వాత భక్తులను పుణ్యస్నానాలకు అనుమతించడం ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం వరకు చక్రస్నానం పవిత్రత ఉంటుందని,భక్తులు సంయమనంతో పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెబుతున్నారు. వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వైభవోపేతంగా నిర్వహించింది. సోమవారంతో వాహన సేవలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఎనిమిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై వివిధ అలంకరాల్లో మలయప్పస్వామి నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయంలోని పలు ఆర్జిత ఏకాంతంగా నిర్వహించింది టీటీడీ. ప్రముఖుల సిఫార్సు లేఖల దర్శనంతో పాటు పలు ప్రత్యేక దర్శనాలను TTD రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే నెల(అక్టోబర్) 15న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్దం అవుతుంది. చక్రస్నానమంటే.. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక.. పరమాత్మ సుదర్శన స్వామిని ముందుంచుకొని పుష్కరిణిలో తీర్థమాడుటే చక్రస్నానం. దీనినే చక్రతీర్థం అని కూడా అంటారు. బ్రహ్మోత్సవము అంటే యజ్ఞం. యజ్ఞం పూర్తిగానే అవభృధ స్నానం చేయాలి. ‘భృధం’ అంటే బరువు, ‘అవ’ అంటే దించుకోవడం. ఇన్ని రోజులు యజ్ఞం నిర్వహించి అలిసిపోయినవాళ్లు ఆ అలసట బరువును స్నానంతో ముగించుకుంటారు. యజ్ఞంలో పాల్గొనని వారు కూడ ‘అవభృంధం’లో పాల్గొంటే యజ్ఞ ఫలితం వస్తుందని శాస్త్ర నిర్వచనం. చక్రస్నానం నాడు సుదర్శన స్వామి, మలయప్ప స్వామితో కలిసి స్నానం చేసే మహాభాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం. -
తిరుమల బ్రహ్మోత్సవాలు: భక్తజనసందోహం నడుమ శ్రీవారికి రథోత్సవం (ఫోటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: శ్రీవారికి రథోత్సవం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. భక్తజనసందోహం నడుమ ఉదయం 6గం.55ని. రథోత్సవం మొదలుకాగా.. స్వామివారిని రథంపై ఉరేగిస్తూ తిరుమాడవీధుల వెంట తిప్పారు. గోవింద నామ స్మరణతో ఆ ప్రాంగణం మారుమోగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీన్నివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు కానీ, సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనడం ముదావహం. రాత్రి అశ్వవాహనం ఇవాళ రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలను వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. రేపు చివరి రోజు రేపు(సెప్టెంబర్ 26, మంగళవారం) చక్ర స్నాన మహోత్సవంలో ముగియనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తగ్గిన భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. బ్రహ్మోత్సవాలలో ఆదివారం ఏడవ రోజు శ్రీవారిని 66,598 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3.88 కోట్లుగా లెక్క తేలింది. 25,103 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. -
Tirumala: చంద్రప్రభ వాహనంపై ఉరేగిన స్వామివారు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఏడో రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై కొలువుదీరి శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వాహన సేవలో కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాటాలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వేష ధారణలతో వాహన సేవ ముందు ఆకట్టుకున్నాయి. -
తిరుమల బ్రహ్మోత్సవాలు స్వర్ణరథంపై గోవిందుడు (ఫోటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు:స్వర్ణరథంపై గోవిందుడు
తిరుమల/సాక్షి, తిరుపతి: తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వర్ణరథంపై దర్శనమిస్తున్నారు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి. తిరువీధుల్లో స్వామివారి బంగారు తేరుపై ఊరేగుతున్నారు స్వర్ణరథనాకి కల్యాణకట్ట నుంచి తెప్పించిన బంగారు గొలుసుతో స్వామివారిని అలంకరించారు. ఈరోజు ఉదయం హనుమంత వాహనంలో దర్శనమిచ్చారు శ్రీవారు. ఈ రాత్రికి గజవాహనంలో దర్శనం ఇవ్వనున్నారు స్వామివారు. శ్రీవారు శుక్రవారం రాత్రి గరుడ వాహనాన్ని అధిరోహించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. గరుడ వాహనం ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని విశ్వాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. విశిష్టమైన గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి వాడుతున్న మకరకంఠి, లక్ష్మిహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్‌కు అలంకరించే పురాతనమైన విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలను(గొడుగులు) అలంకరించారు. తన నిత్య సేవకుడు గరుత్మంతుడిపై దేవదేవుడు వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు శుక్రవారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు. శ్రీవారు మోహినీ రూపంలో దంత పల్లకిపై, పక్కనే వెన్న ముద్ద చేతబట్టిన చిన్నికృష్ణుడితో కలిసి భక్తకోటిని అనుగ్రహించారు. టీటీడీ ఏర్పాట్లు భేష్.. బ్రహ్మోత్సవాల్లో అతిముఖ్యమైన గరుడ వాహన సేవను వీక్షించడానికి వచ్చిన భక్తులెవరూ ఇబ్బందులు పడకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2 లక్షల మంది వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీలను నిర్మించింది. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి టీటీడీ సిబ్బంది అనుమతించారు. ఇలా రెండోసారి రీఫిల్లింగ్ చేసి భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. గరుడ వాహన సేవ నేపథ్యంలో వాహనాలపై తిరుమలకు చేరుకునే భక్తులతో ఘాట్ రోడ్డు అత్యంత రద్దీగా కనిపించింది. మధ్యాహ్నం 2 గంటలకే అన్ని గ్యాలరీలూ నిండిపోయాయి. వీరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నప్రసాదాలు, పాలు, బాదం పాలు, కాఫీ, మజ్జిగ, మంచినీరు, గుగ్గిళ్లను టీటీడీ అందిస్తూ వచ్చింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించింది. గరుడ సేవను తిలకించడానికి 3 లక్షలకు పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు టీటీడీ అంచనా. మరోవైపు భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్టు నుంచి పెద్ద ఎత్తున తిరుమలకు పయనమయ్యారు. శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు 2.1 కిలోమీటర్ల దూరమే ఉండటంతో భక్తులు ఈ మార్గం మీదుగా తిరుమలకు చేరుకునేందుకు ఆసక్తి చూపారు. రద్దీ నేపథ్యంలో చిన్న పిల్లలు తప్పిపోకుండా పోలీసులు జియో ట్యాగింగ్ వేశారు. అలాగే, గరుడసేవ నేపథ్యంలో తిరుమల బాలాజీ బస్టాండ్ నుంచి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం వరకు వాహన రాకపోకలను టీటీడీ, విజిలెన్స్, పోలీసు అధికారులు నిషేధించారు. ఉదయం నుంచి బాలాజీ బస్టాండ్, లేపాక్షి సర్కిల్, రాం భగీచా, నందకం గెస్ట్‌హౌస్, వెంగమాంబ అన్నదాన సత్రం వరకు వాహనాల అనుమతిని నిషేధించారు. దీంతో భక్తులెవరూ ఇబ్బందులు పడకుండా కొండ మీదకు సాఫీగా చేరుకుని గరుడ సేవను వీక్షించారు. -
గరుడ వాహనంపై గోవిందుడు
తిరుమల/సాక్షి, తిరుపతి: తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు శుక్రవారం రాత్రి గరుడ వాహనాన్ని అధిరోహించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. గరుడ వాహనం ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని విశ్వాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. విశిష్టమైన గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి వాడుతున్న మకరకంఠి, లక్ష్మిహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్‌కు అలంకరించే పురాతనమైన విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలను(గొడుగులు) అలంకరించారు. తన నిత్య సేవకుడు గరుత్మంతుడిపై దేవదేవుడు వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు శుక్రవారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు. శ్రీవారు మోహినీ రూపంలో దంత పల్లకిపై, పక్కనే వెన్న ముద్ద చేతబట్టిన చిన్నికృష్ణుడితో కలిసి భక్తకోటిని అనుగ్రహించారు. కాగా, తిరుమలలో శనివారం శ్రీవారు స్వర్ణరథంపై సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ పురవీధుల్లో ఊరేగనున్నారు. కాగా, శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకుని వాహన సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఏర్పాట్లు భేష్.. బ్రహ్మోత్సవాల్లో అతిముఖ్యమైన గరుడ వాహన సేవను వీక్షించడానికి వచ్చిన భక్తులెవరూ ఇబ్బందులు పడకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2 లక్షల మంది వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీలను నిర్మించింది. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి టీటీడీ సిబ్బంది అనుమతించారు. ఇలా రెండోసారి రీఫిల్లింగ్ చేసి భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. గరుడ వాహన సేవ నేపథ్యంలో వాహనాలపై తిరుమలకు చేరుకునే భక్తులతో ఘాట్ రోడ్డు అత్యంత రద్దీగా కనిపించింది. మధ్యాహ్నం 2 గంటలకే అన్ని గ్యాలరీలూ నిండిపోయాయి. వీరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నప్రసాదాలు, పాలు, బాదం పాలు, కాఫీ, మజ్జిగ, మంచినీరు, గుగ్గిళ్లను టీటీడీ అందిస్తూ వచ్చింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించింది. గరుడ సేవను తిలకించడానికి 3 లక్షలకు పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు టీటీడీ అంచనా. మరోవైపు భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్టు నుంచి పెద్ద ఎత్తున తిరుమలకు పయనమయ్యారు. శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు 2.1 కిలోమీటర్ల దూరమే ఉండటంతో భక్తులు ఈ మార్గం మీదుగా తిరుమలకు చేరుకునేందుకు ఆసక్తి చూపారు. రద్దీ నేపథ్యంలో చిన్న పిల్లలు తప్పిపోకుండా పోలీసులు జియో ట్యాగింగ్ వేశారు. అలాగే, గరుడసేవ నేపథ్యంలో తిరుమల బాలాజీ బస్టాండ్ నుంచి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం వరకు వాహన రాకపోకలను టీటీడీ, విజిలెన్స్, పోలీసు అధికారులు నిషేధించారు. ఉదయం నుంచి బాలాజీ బస్టాండ్, లేపాక్షి సర్కిల్, రాం భగీచా, నందకం గెస్ట్‌హౌస్, వెంగమాంబ అన్నదాన సత్రం వరకు వాహనాల అనుమతిని నిషేధించారు. దీంతో భక్తులెవరూ ఇబ్బందులు పడకుండా కొండ మీదకు సాఫీగా చేరుకుని గరుడ సేవను వీక్షించారు. -
Tirumala: వైభవంగా గరుడోత్సవం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజు.. శుక్రవారం సాయంత్రం గరుడోత్సవం వైభవంగా మొదలైంది. గరుడవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. చిరు జల్లులతో వరుణుడు స్వాగతం పలికారు. తిరు వీధులు భక్తులతో నిండిపోయి.. గోవింద నామ స్మరణతో మారుమోగాయి. వేద పండితుల మంత్రాలు, భక్తుల గోవింద నామాలు , మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, దేవతా మూర్తుల కళా రూపాలతో తుమ్మలగుంట క్షేత్రం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం వైభవోపేతంగా సాగింది. సాయంత్రం 4 గంటల నుంచే చుట్టు ప్రక్కల ప్రాంతాలు, పక్క మండలాల నుంచి భక్తులు తుమ్మలగుంటకు అధికంగా తరలివచ్చారు. వాహన సేవ ముందు కళాకారుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నిత్యం మూలమూర్తి అభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీకాసుల హారాలను గరుడసేవలో అలంకరించారు. ఏడాది మొత్తంలో.. గరుడోత్సవం రోజు మాత్రమే ఆభరణాలు గర్భాలయం నుంచి బయటకు వస్తాయన్నది తెలిసిందే. మరోవైపు గ్యాలరీలలో రెండు లక్షల భక్తులు చేరినట్లు అంచనా. గరుడవాహన దర్శనం కోసం భక్తులు పోటీ పడ్డారు. గరుడవాహన దర్శనం కోసం రింగ్ రోడ్డుకు భక్త సంద్రం తరలి వచ్చింది. గరుడోత్సవంలో జిల్లా కలెక్టర్ శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి గరుడ వాహన సేవలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శించారు. ఇస్కాన్ ప్రతినిధులు ఆలయం వద్దకు చేరుకుని సారె సమర్పించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారికి సారె సమర్పణ శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవ ప్రారంభానికి ముందు తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీవారికి సారె తెచ్చారు. సుమారు వెయ్యి మంది గ్రామస్తులు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు తీసుకు వచ్చి స్వామి వారికి సమర్పించారు. ఉదయం మోహినీ అవతారంలో నిత్య కళ్యాణ శోభితుడు అంతకు ముందు ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు కల్యాణ వెంకటేశ్వర స్వామి మోహినీ అవతారంలో పల్లకీపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనంకు వున్న ప్రత్యేకత ఏమంటే మోహినీ అవతారం లో వున్న స్వామి భక్తులను ఆకట్టుకునేలా వివిధ రకాల ఆభరణాలు ధరించి.. కుడి చేతిలో చిలుకను పట్టుకుని.. ముందు ఏర్పాటు చేసిన అద్దంలో ముఖాన్ని చూస్తూ వుంటారు. స్వామి వారి పల్లకీ సేవలో భక్తులు తరించి పునీతులయ్యారు. బ్రహ్మోత్సవాల్లో రేపు.. కల్యాణ వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 7 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 7 గంటలకు గజవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. -
పెద్ద శేషవాహనంపై ఊరేగుతున్న శ్రీవారు..!
-
తిరుమలలో వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు
-
బ్రహ్మోత్సవాలు రెండో రోజు.. శ్రీవారి సేవలో సీఎం జగన్
-
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్
CM Jagan Tirumala Tirupati Tour Live Updates 07:19AM, 19-09-2023 ►తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని పద్మావతి అతిథి గృహానికి బయలుదేరిన సీఎం జగన్ ►సీఎం వెంట డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్.కే.రోజా, టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, ఈవో ధర్నా రెడ్డి 07:09AM, 19-09-2023 ►శ్రీవారిని దర్శించుకుని శ్రీరంగనాయకులు మండపంకు చేరుకున్న సీఎం జగన్ ►ఆశీర్వదించిన వేద పండితులు 06:40AM, 19-09-2023 ►మహాద్వారం వద్ద స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు ►సీఎం జగన్మోహన్రెడ్డితో పాటు.టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ►శ్రీవారి ఆలయంకు చేరుకున్న సీఎం జగన్ 09:19PM, 18-09-2023 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి పెద శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులకు దర్శనం ఇస్తున్న మలయప్ప స్వామి ► గోవిందా నామ స్మరణతో మార్మోగుతున్న తిరుమాడ వీధులు ► తిరుమాడ వీధుల్లో పెద శేష వాహన స్వామి ► మంగళ వాయిద్యాలు , కొలాటల నడుమ కోలాహలంగా సాగిన వాహన సేవ ► విశేష సంఖ్యలో పాల్గొని కర్పూర నీరాజనాలు అందించిన భక్తులు ► గోవింద నామ స్మరణతో మారు మ్రోగిన తిరువీధులు... 08:41PM, 18-09-2023 ► తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ►మీనలగ్నంలో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం. ► కాసేపట్లో పెద శేష వాహనంపై శ్రీవారి ఊరేగింపు. 08:18PM, 18-09-2023 తిరుమలలో సీఎం జగన్ ► శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ.. స్వామివారి దర్శనం అనంతరం సీఎం జగన్‌కు వేద పండితుల ఆశీర్వచనం. ► శ్రీవారి ఆలయం రంగరాయలు మండపంలో 2024 టీటీడీ క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన సీఎం జగన్ ► శ్రీవారి ఆలయం నుంచి శ్రీపద్మావతి గెస్ట్ హౌస్‌కు బయలుదేరిన సీఎం జగన్.. రాత్రికి ఇక్కడే బస 08:07PM, 18-09-2023 ► తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ► ప్రభుత్వం తరపున స్వామివారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. 07:55PM, 18-09-2023 శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సీఎం జగన్ వెంట టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు. 07:50PM, 18-09-2023 ► సీఎం జగన్‌కి పరివట్టం కట్టిన ఆలయ ప్రధాన అర్చకులు. ► పట్టువస్త్రాలు సమర్పించేందుకు బేడి ఆంజనేయ స్వామి గుడి నుంచి బయల్దేరిన సీఎం జగన్. 07:42PM, 18-09-2023 ► బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సీఎం వైఎస్ జగన్ ► సీఎం జగన్‌తో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు. ► మరికాసేపట్లో శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ 06:42PM, 18-09-2023 ► కాసేపట్లో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్న సీఎం జగన్. ఆపై శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ. 06:37PM, 18-09-2023 ► రచన అతిథి గృహాన్ని ప్రారంభించిన సీఎం జగన్ 06:08PM, 18-09-2023 ►వకులమాత గెస్ట్ హౌస్ ప్రారంభించిన సీఎం జగన్. 06:05PM, 18-09-2023 ► తిరుమల చేరుకున్న సీఎం వైఎస్ జగన్ 05:40PM, 18-09-2023 ► తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. మాడవీధుల్లో గరుడ ధ్వజపటం, స్వామి, అమ్మవార్ల ఊరేగింపు. మీనలగ్నంలో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం. రాత్రి 9గంటలకు పెదశేష వాహనంపై శ్రీవారి దర్శనం. 05:28PM, 18-09-2023 మరికాసేపట్లో తిరుమలకు సీఎం జగన్ ► తాతయ్య గుంట గంగమ్మ ఆలయం దర్శించుకొని తిరుమలకి బయలుదేరిన సీఎం ► మరికాసేపట్లో తిరుమల చేరుకోనున్న సీఎం జగన్ ► తిరుమలలో వకుళా మాత, రచన అతిథి గృహాలు ప్రారంభించనున్న సీఎం జగన్ ► అనంతరం ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ 05:25PM, 18-09-2023 ► తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవత ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ 05:20PM, 18-09-2023 ►గంగమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం జగన్. 04:53PM, 18-09-2023 ► తిరుపతి శ్రీపద్మావతి పురం నుంచి గంగమ్మ ఆలయానికి బయలుదేరిన సీఎం జగన్ 04:42PM, 18-09-2023 ► టీటీడీ ఉద్యోగులకు సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 04:30PM, 18-09-2023 శ్రీపద్మావతిపురం.. సీఎం జగన్ ప్రసంగం ►ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. 2019లో అప్పట్లో కేవలం ఎన్నికల నిమిత్తం టెంకాయ కొట్టి.. జీవో ఇచ్చేసిన పరిస్థితి నుంచి.. ఈ నాలుగు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టును చెయ్యి పట్టుకుని నడిపించాం. ఇవాళ ఆ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించి.. తిరుపతి ప్రజలకు అంకితమిస్తున్నా. దాదాపు 650 కోట్ల ప్రాజెక్టు.. ఏడు కిలోమీటర్ల పొడవునా.. తిరుపతి ప్రజలకు ప్రత్యేకించి గుడికి పోయే భక్తులకు మరి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ►ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్‌కు సంబంధించి.. 37 కోట్ల రూపాయలకు సంబంధించి హాస్టల్స్ ప్రారంభించడం వల్ల మెరుగైన వసతులు విద్యార్థులకు అందనున్నాయి. ►వకులమాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్ ప్రారంభించి టీటీడీకి ఇవ్వడం జరగనుంది. ►అన్నింటికంటే సంతోషం కలిగించే అంశం ఏంటంటే.. టీటీడీలో పని చేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఉండాలని.. మంచి జరగాలనే తాపత్రయంతో త్వరగా అడుగులు వేశాం. రూ. 313 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసి.. 3,518 మందికి సంబంధించి ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. మరో 280 కోట్లు ఖర్చు చేసి మరో మూడు వేల మందికి ఇస్తాం. ఈ ప్రక్రియ కూడా నెల నుంచి 45 రోజుల్లో పూర్తి చేస్తాం. ►దాదాపు 600 కోట్ల రూపాయలతో.. ఏడు వేల మంది టీటీడీ ఉద్యోగుల ముఖాల్లో సంతోషం చూస్తున్నాం. ఇది అన్నింటికి కంటే ఎక్కువ సంతోషం ఇచ్చే రోజు ఇది. ►22ఏలో అమ్మాలనుకున్న ఇవ్వలేని పరిస్థితిలో సతమతమవుతా ఉన్న పరిస్థితుల్లో నేను ఒకసారి తిరుపతికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకువచ్చిన ఆ సమస్యను పరిష్కరించి సుమారు 8,000 మందికి పైగా నుంచి విముక్తి కల్పించాం. 8,050 మందికి తిరుపతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 2,500 చంద్రగిరిలో 22 ఏలో నుంచి తొలగించి ఉపశమనం కలిగించడం జరిగింది. ఇవన్నీ దేవుడి దయతో చేసే అవకాశం కలిగింది. ఈ నాలుగేళ్లలో మంచి జరగాలని కోరుకుంటూ అడుగులు వేశాం. ►ఇవాళ రూ. 1300 కోట్ల రూపాయలకు సంబంధించిన పలు కార్యక్రమాలు ప్రారంభించడం సంతోషం కలిగించింది. మరింత మంచి చేసే అవకాశం కలగాలని మనసారా కోరుకుంటూ సెలవు. 04:25PM, 18-09-2023 60 ఏళ్ల కల సీఎం జగన్ సాకారం చేశారు: భూమన ► టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గతంలో వైఎస్సార్ నిర్ణయించారు. ►పేదల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి సీఎం జగన్. ► టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం చేశారు. ► టీటీడీ ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్ తీసుకున్న చారిత్రక నిర్ణయం. ►సీఎం జగన్ చొరవతోనే శ్రీనివాస సేతు ప్రాజెక్టు పూర్తయ్యింది. 04:20PM, 18-09-2023 ► గోవిందరాజస్వామి డిగ్రీ కాలేజీకి సంబంధించి.. ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల శిలాఫలకాల ఆవిష్కరణ చేసి ప్రారంభించారు సీఎం జగన్. 04:15PM, 18-09-2023 ► శ్రీపద్మావతిపురంలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం జగన్. రూ.684 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం. 04:12PM, 18-09-2023 ► శ్రీపద్మావతిపురం చేరుకున్న సీఎం జగన్. శాస్త్రోక్తంగా పూజల్లో పాల్గొన్న సీఎం జగన్. 03:49PM, 18-09-2023 ► రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి కు బయలుదేరిన సీఎం జగన్. మరికాసేపట్లో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభం 03:33PM, 18-09-2023 ► రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ► సీఎం జగన్‌కు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఆర్కే రోజా, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి 02:23PM, 18-09-2023 ► తిరుమల బ్రహ్మోత్సవాల్లో.. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి పర్యటనకు బయల్దేరారు. అదే సమయంలో తిరుపతిలో పలు ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. తిరుమల స్వామివారికి.. సోమవారం సాయంత్రం 6.15–6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తం గా ధ్వజారోహణం నిర్వహించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు పెద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు. సీఎం జగన్ రేపటి(సెప్టెంబర్ 19) షెడ్యూల్ ఇదే.. ►మంగళవారం ఉదయం 6.20 గంటలకు సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. -
తిరుమలలో నేడు ధ్వజారోహణం.. సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ
సాక్షి, తిరుమల: నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7–8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన ఆదివారం సాయంసంధ్యా సమయంలో శ్రీవారి సర్వ సేనాధిపతి అయిన విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం సోమవారం సాయంత్రం 6.15–6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తం గా ధ్వజారోహణం నిర్వహించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు. సీఎం జగన్ పట్టు వస్త్రాల సమర్పణ.. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం జగన్ పర్యటన ఇలా.. ►నేడు మధ్యాహ్నం 3.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ►మధ్యాహ్నం 3.50 గంటలకు స్థానిక మ్యాంగో మార్కెట్ వద్ద శ్రీనివాస సేతు, ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల శిలాఫలకాల ఆవిష్కరణ చేసి ప్రారంభం. ►టీటీడీ ఉద్యోగులకు ఇంటిపట్టాల పంపిణీ. ►సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని తిరుమల బయలుదేరుతారు. ►సాయంత్రం 5.40 గంటలకు వకులమాత రెస్ట్ హౌస్ ప్రారంభిస్తారు. ►సాయంత్రం 5.55 గంటలకు రచన రెస్ట్ హౌస్ ప్రారంభించి, శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుంటారు. ►రాత్రి 7.45 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకు వెళ్లి సమర్పిస్తారు. ►పెద్ద శేష వాహన సేవలో పాల్గొని శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకొని రాత్రి బస చేస్తారు. రేపటి షెడ్యూల్ ఇదే.. ►మంగళవారం ఉదయం 6.20 గంటలకు సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ►ఉదయం 8.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని ఓర్వకల్ విమానాశ్రయానికి బయలుదేరుతారు. -
2 లక్షల మంది వీక్షించేలా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు
తిరుపతి: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు టీడీడీ ఈవోExecutive Officer ఏవీ ధర్మారెడ్డి సాక్షికి తెలిపారు. రెండు లక్షల మంది భక్తులు వీక్షించేలా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారాయన. సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇచ్చేలా.. బ్రహ్మోత్సవాలను వేడుకగా జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని సాక్షితో అన్నారాయన. బ్రహ్మెత్సవాలు జరిగే 9 రోజులు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారాయన. ఆన్లైన్లో 1.30 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు సర్వదర్శనం భక్తులకు 24 వేల ఉచిత దర్శన టికెట్లు టీటీడీ అందించనుందని తెలిపారాయన. అలాగే.. నడకదారిలో ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో బ్రేక్ దర్శనాలకు, సిఫారసు లేఖలను అనుమతించబోమని ఇప్పటికే టీటీడీ స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారాయన. ఇప్పటికే మాడ వీధుల్లో రంగవల్లులను టీటీడీ తీర్చిదిద్దామని.. గ్యాలరీల్లో ఉండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పుట్టమన్నులో నవధాన్యాలను.. తిరుమలలో సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 17న రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అంకురార్పణం జరగనుంది. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనుల వారు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటి వాటికి మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. 18వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. వాహన సేవల వివరాలివీ.. 18న రాత్రి 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు 7 తలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. 19న ఉదయం 8 గంటలకు 5 తలల చిన్నశేష వాహనంపై, రాత్రి 7 గంటలకు శ్రీమలయప్పస్వామి వారు వీణాపాణియై హంస వాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమివ్వనున్నారు. 20న ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతారు. 21న ఉదయం 8 గంటలకు శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. 22న ఉదయం 8 గంటలకు శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంలో ఊరేగుతారు. 23న ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగుతారు. సాయంత్రం 4 గంటలకు శ్రీనివాసుడు స్వర్ణరథంపై, రాత్రి 7 గంటలకు గజవాహనంపై తిరువీధుల్లో విహరిస్తారు. 24న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 25న ఉదయం 6:55 గంటలకు శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు స్వామివారు అశ్వ వాహనంపై విహరిస్తారు. 26న ఉదయం 6 గంటలకు చక్రస్నానాన్ని, రాత్రి 7గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం ధ్వజావరోహణాన్ని శాస్త్రోక్తంగా చేపడతారు. దీంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. భక్తులకు గమనిక ► స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ► వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలైజ్డ్ దర్శనాలూ రద్దు ► బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8–10 గంటల వరకు, రాత్రి 7–9 గంటల వరకు వాహన సేవలు ► సెప్టెంబర్ 22న గరుడ సేవ కారణంగా.. ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేసిన టీటీడీ
-
తిరుమల శ్రీవారికి ఎప్పుడు ప్రత్యేక నైవేద్యాలు
-
నేడు పెద్ద శేష వాహనంపై స్వామి వారి దర్శనం
-
కోనేటి రాయుడికి కొండంత బంగారం