
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది.

భక్తజనసందోహం నడుమ ఉదయం 6గం.55ని. రథోత్సవం మొదలుకాగా.. స్వామివారిని రథంపై ఉరేగిస్తూ తిరుమాడవీధుల వెంట తిప్పారు.

గోవింద నామ స్మరణతో ఆ ప్రాంగణం మారుమోగింది





























