breaking news
brahmotsavam festival
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలు : కల్పవృక్ష వాహనంపై స్వామివారి వాహన (ఫొటోలు)
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలు : ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు (ఫొటోలు)
-
ఏటేటా పెరుగుతున్న భక్తజన సందోహం
కలియుగ దైవమైన శ్రీవెంకటేశ్వరుని దర్శనానికి భక్తజన సందోహం ఏటేటా పెరుగుతోంది. గడచిన పదకొండేళ్లలో దాదాపు పాతిక కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఏడాదికి సగటున రెండున్నర కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఎప్పటికప్పుడు క్యూలైన్లో మార్పులు చేస్తుంది. ఇప్పటికే వైకుంఠం క్యూకాంప్లెక్స్లు ఒకటి, రెండు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడుగా మరో క్యూకాంప్లెక్స్ నిర్మాణానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది.శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు ప్రతినిత్యం విచ్చేస్తుంటారు. పూర్వం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య వందల్లో ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంది. భక్తుల కోసం సౌకర్యాలు పెంచే కొద్ది తిరుమలలో భక్తుల తాకిడి కూడా పెరుగుతూ వస్తోంది. తొలినాళ్లలో తిరుమలకు చేరుకోవడానికి నడక మార్గం మాత్రమే ఉండేది. అప్పట్లో భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. తొలి ఘాట్‌రోడ్డును టీటీడీ 1943లో నిర్మించింది. క్రమంగా భక్తుల తాకిడి పెరుగుతూ రావడంతో 1979లో రెండో ఘాట్ రోడ్డును కూడా నిర్మించింది. తిరుమల చేరుకోవడానికి, తిరిగి తిరుపతి చేరుకోవడానికి రెండు రోడ్డు మార్గాలు అందుబాటులోకి రావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల మొదలైంది. మొదటి ఘాట్‌రోడ్డును నిర్మించిన తర్వాత కూడా 1951 నాటికి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజుకు ఆరువందలకు పైచిలుకుగా మాత్రమే ఉండేది. క్రమంగా ఈ సంఖ్య 1961 నాటికి రోజుకు మూడువేలకు పైచిలుకు, 1971 నాటికి రోజుకు తొమ్మిదివేల పైచిలుకు వరకు చేరుకుంది. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 1981 నాటికి గణనీయంగా పెరిగి, రోజుకు ఇరవై ఒక్క వేల పైచిలుకుకు చేరుకుంది. ఆ ఏడాదిలో శ్రీవారిని 79.52 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆ తర్వాత 1991లో తొలిసారిగా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏడాదికి కోటి దాటింది. మరో దశాబ్దం గడిచేసరికి 2001 నాటికి ఈ సంఖ్య రెట్టింపై రెండుకోట్లు దాటింది. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 2011లో రోజుకు డెబ్బయివేలకు చేరుకుంటే, ఆ ఏడాది 2.55 కోట్ల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే, ‘కోవిడ్’ ప్రభావంతో 2021లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. ఆ ఏడాది రోజుకు సగటున ఇరవై ఎనిమిదివేల మంది, ఏడాది మొత్తంలో 1.04 కోట్ల మంది మాత్రమే ఆ దేవదేవుని దర్శించుకున్నారు.రద్దీకి అనుగుణంగా మార్పులుతిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఎప్పటికప్పుడు క్యూలైన్ల విధానంలో మార్పులు చేస్తూ వస్తోంది. మొదట్లో భక్తులను మహాద్వారం నుంచి అనుమతించే టీటీడీ, ఆ తర్వాత 1970లలో పీపీ షెడ్లను ఏర్పాటు చేసింది. వరాహస్వామి ఆలయానికి వెనుక వైపున షెడ్లను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించేది. ఆ తర్వాత 1985లో మొదటి క్యూకాంప్లెక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. మరో పదహారేళ్లకు 2001లో రెండో క్యూకాంప్లెక్స్‌ను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. అప్పటికీ భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుండటంతో ఏడాదికి దాదాపు 150 రోజుల పాటు భక్తులు కంపార్ట్మెంట్లు దాటి వెలుపల క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో 2014లో నారాయణగిరి ఉద్యానవనంలో టీటీడీ తాత్కాలిక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. నారాయణగిరి ఉద్యానవనంలో 2019 నాటికి శాశ్వత ప్రాతిపదికన కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయగా, 2024 నాటికి గోగర్భం డ్యామ్ వరకు క్యూలైన్లను ఏర్పాటు చేసింది. ఇలా క్యూలైన్లలోనే 65 వేల మంది భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేసినా, స్వామివారి దర్శనం కోసం భక్తులు 24 గంటలకు పైగా వేచి ఉండే సమయాలు ఏడాదికి వంద రోజులకు పైగానే ఉంటున్నాయి.నిరీక్షణ తగ్గించడానికి చర్యలుశ్రీవారి దర్శనం కోసం భక్తులు నిరీక్షించే సమయాన్ని తగ్గించడానికి దర్శన విధానంలో టీటీడీ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తోంది. మొదట్లో భక్తులను శ్రీవారి ఆలయంలోని కులశేఖర పడి వరకు అనుమతించేవారు. దీంతో రోజూ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య దాదాపు ఇరవైవేలకు పరిమితం అయ్యేది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి 1983లో టీటీడీ లఘుదర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది. భక్తులను రాములవారి మేడ వరకు మాత్రమే అనుమతించే ఈ విధానంలో రోజూ స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య సుమారు నలభైవేలకు చేరుకుంది. భక్తుల తాకిడి మరింత పెరుగుతూ వస్తుండటంతో 2005లో టీటీడీ మహాలఘుదర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది. భక్తులను జయవిజయుల గడప నుంచి దర్శనానికి అనుమతిస్తుండటంతో స్వామివారిని రోజుకు దాదాపు లక్షమంది దర్శించుకునే అవకాశం ఏర్పడింది. తోపులాట లేకుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా 2014లో బంగారు వాకిలిలో మూడో క్యూలైన్‌ను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత మరిన్ని మార్పులు చేసే అవకాశం లేకపోవడంతో టీటీడీ అదే విధానాన్ని కొనసాగిస్తోంది. ∙ -
దిల్‌రాజు నిర్మించిన గుడిలో బ్రహ్మోత్సవాలు.. పూజలో కుటుంబ సభ్యులు (ఫోటోలు)
-
వైభవంగా యాదగిరిగుట్ట నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్ : వైభవంగా టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవోపేతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీనివాసుని గరుడ సేవ.. భక్తజనంతో కిక్కిరిసిన తిరుమల (ఫొటోలు)
-
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు .. చిన్నశేష వాహనంపై శ్రీవారు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలులో ఆకట్టుకుంటున్న ప్రదర్శన శాల (ఫొటోలు)
-
అక్టోబరు 4 నుండి 12 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి.వాహన సేవల వివరాలు :04/10/2024: సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.05/10/2024: ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.06/10/2024: ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం,07/10/2024: ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం,మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం,08/10/2024: ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం09/10/2024: ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం,10/10/2024: ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం,రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం,11/10/2024: ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం,12/10/2024: ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం. బ్రహ్మోత్సవాలకు టిటిడి ప్రత్యేక ఏర్పాట్లుతిరు వీధుల్లో గ్యాలరీలు ఏర్పాటు ...అక్టోబర్ 3 నుండి 12 తేది వరకు విఐపీ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు రద్దుప్రతిరోజు ఉదయం ,రాత్రి రెండు వాహన సేవల్లో దర్శనం ఇవ్వనున్న శ్రీవారు గరుడోత్సవం నాడు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు రద్దుతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ...శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు ...సర్వదర్శనానికి 24 గంటలు ...ప్రత్యేక దర్శనానికి 6 గంటలు ...నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,133 ...నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 35,502 నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.28 కోట్లు. -
అక్టోబరు 4 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు
-
ఘనంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్పెషల్ (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు.. పెదశేష వాహనంపై విహరించిన మలయప్పస్వామి (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: భక్తజనసందోహం నడుమ శ్రీవారికి రథోత్సవం (ఫోటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు స్వర్ణరథంపై గోవిందుడు (ఫోటోలు)
-
Tirumala Brahmotsavam 2023: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు హనుమంత వాహనంపై శ్రీనివాసుడు (ఫోటోలు)
-
ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
తిరుమలలో ధ్వజారోహణ కార్యక్రమం
-
రథంపై ఊరేగుతూ భక్తులకు అమ్మవారి దర్శనం
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా రథోత్సవం (ఫొటోలు)
-
ధ్వజారోహణం.. సకల దేవతలకు ఆహ్వానం
సాక్షి, తిరుమల: విశ్వపతి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ఆరంభమయ్యాయి. ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పతాకావిష్కరణతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. సకల దేవతలు, అష్టదిక్పాలకులు తొమ్మిది రోజులూ సప్తగిరి క్షేత్రంలో ఉంటూ ఉత్సవాలను తిలకించి తన్మయత్వం పొందుతారని పురాణాలు విశదీకరిస్తున్నాయి. చదవండి: నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ధ్వజారోహణానికి ముందు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప, పరివార దేవతలైన ఆదిశేషుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు, గరుడధ్వజం, సుదర్శన చక్రతాళ్వార్‌తో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. -
బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు
-
తిరుమల : కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి
-
తిరుమల బ్రహ్మొత్సవాలు : శోభాయమానం స్నపన తిరుమంజనం
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా తిరుమల
-
వైభవంగా కాణిపాకం బ్రహ్మోత్సవాలు
సాక్షి, చిత్తూరు: కాణిపాకం వరసిద్ధివినాయకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజారోహణ కార్యక్రమం ఆదివారం సంప్రదాయం గా నిర్వహించారు. కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయానికే పరిమితం అయ్యింది. ఈ రోజు సాయంత్రం హంస వాహన సేవ నిర్వహించనున్నారు. పరిమిత సంఖ్యల్లోనే భక్తులకు అనుమతి కల్పించనున్నారు. విద్యుత్ వెలుగులు, ప్రత్యేక పుష్పాలంకరణలతో గణనాథుని ఆలయం శోభాయమానంగా వెలిగిపోతోంది. శనివారం చవితి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేకువజామున మూలస్థానంలోని గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. -
బ్రహ్మోత్సవాలు : హనుమంత వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
-
సింహ వాహనంపై శ్రీగోవిందరాజస్వామివారు
-
ధ్వజారోహణంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
-
గరుడుడిపై గోవిందుని విహారం
-
కన్నుల పండువగా శ్రీవారి చక్రస్నానం
-
సూర్యప్రభ వాహనంపై తిరుమలేశుడు
-
హనుమంత వాహనంపై స్వామివారు వైభవం
-
కల్పవృక్ష వాహనంపై కనువిందు చేసిన శ్రీనివాసుడు
-
శ్రీవారికి వైభవంగా చక్రస్నానం
-
వైభవోపేతంగా శ్రీవారి రథోత్సవం
-
సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు
-
మోహినీ అవతారంలో శ్రీవారు
-
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఫోటోలు మీకోసం
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలు : హంస వాహనంపై దేవదేవుడు
-
‘నా జీవితం ఆయన పాదసేవకే అంకితం’
-
‘నా జీవితం ఆయన పాదసేవకే అంకితం’
తిరుమల : తనపై వచ్చిన ఆరోపణలపై తిరుమల స్వామివారి ఆలయం ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు స్పందించారు. తన జీవితం స్వామివారికే అంకితమని, 50 ఏళ్లుగా తన పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా గతనెలలో స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నైవేద్య విరామ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మనవడిని ఆలయంలోనికి తీసుకువెళ్లడంతో పాటు తిరునామానికి సంబంధించి రమణ దీక్షితులపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ...'1974 నుంచి స్వామిరవారికి కైంకర్యాలను నిర్వహిస్తున్నాం. ఉత్తమమైన పదవులను వదులుకుని దైవ సేవకు వచ్చా. సామరస్యం, సంస్కారం నా సొంతం. ఇంత అనుభవం ఉన్నా...నన్ను వేలెత్తి చూపుతున్నారు. ఇది దురదృష్టకర ఘటన. అర్చకులపై నిందారోపణలు రావడం శోచనీయం. నాపై కక్ష సాధింపు కోసమే ఈ ఆరోపణలు. నా పాత్ర వరకే నేను పరిమితం, ఇతర విషయాలు పట్టించుకోను. అపచారాలను నేను వేలెత్తి చూపుతాను. దేవాలయంలో ప్రలోభకరమైన విషయాలు ఉన్నాయి. కానుకలు, డబ్బులు, పదవుల కేంద్రంగా ఇవి సాగుతున్నాయి. ఈ ప్రలోభాలకు నేను దూరం. చేసేవారికి సహకరించకపోవడం వల్లే కక్ష కడుతున్నారు.’ అని తెలిపారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా తన మనవడిని ఆలయంలోకి తీసుకు వెళ్లిన ఘటనపై టీటీడీ యాజమాన్యం.. రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. -
మయూర వాహనంపై మల్లన్న
శ్రీైశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శనివారం రాత్రి శ్రీభ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి దగ్గర పడుతుండటంతో ఇప్పటికే సుమారు లక్షకు పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నట్లు అంచనా. అశేషభక్తజనం మధ్య ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను మయూరవాహనంపై అధిష్టింపజేసి అర్చకులు, వేదపండితులు విశేషపూజలు నిర్వహించారు. అనంతరం వాహన సమేతులైన ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి రథశాల వద్దకు చేర్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం గ్రామదేవత అయిన అంకాలమ్మగుడి, నంది మండపం, క్షేత్రపాలకుడైన బయలువీరభద్రస్వామి మండపం వరకు కొనసాగింది. కాగా, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం నుంచి మార్చి 2 వరకు మల్లన్న అలంకార దర్శనాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. - న్యూస్‌లైన్, శ్రీశైలం