
సకల దేవతలు, అష్టదిక్పాలకులు తొమ్మిది రోజులూ సప్తగిరి క్షేత్రంలో ఉంటూ ఉత్సవాలను తిలకించి తన్మయత్వం పొందుతారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.
సాక్షి, తిరుమల: విశ్వపతి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ఆరంభమయ్యాయి. ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పతాకావిష్కరణతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. సకల దేవతలు, అష్టదిక్పాలకులు తొమ్మిది రోజులూ సప్తగిరి క్షేత్రంలో ఉంటూ ఉత్సవాలను తిలకించి తన్మయత్వం పొందుతారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.
చదవండి: నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ధ్వజారోహణానికి ముందు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప, పరివార దేవతలైన ఆదిశేషుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు, గరుడధ్వజం, సుదర్శన చక్రతాళ్వార్‌తో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.