తిరుమల: తిరుమల (Tirumala) పరకామణిలో బంగారు బిస్కెట్ (Gold biscuit) చోరీ ఘటన కీలక మలుపు తిరిగింది. ఇటీవల 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ పట్టుబడిన నిందితుడిని తిరుమల వన్‌టౌన్ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య శ్రీవారి పరకామణిలో అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు.
ఇతను తొందరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏడాదిగా పరకామణిలోని గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉంచే బంగారు వస్తువులను దొంగలిస్తూ వస్తున్నాడు. ఈ మేరకు అతనిపై నిఘా ఉంచగా.. ఈనెల 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను దొంగలించి దానిని ట్రాలీకి ఉన్న పైపుల్లో దాచిపెట్టాడు. తనిఖీ సమయంలో టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించడంతో పెంచలయ్య పరారయ్యాడు.
ఈ విషయమై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో మొత్తం 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు మొత్తం 655 గ్రాములు, 157 గ్రాముల వెండి వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి
Comments
Please login to add a commentAdd a comment