తనపై వచ్చిన ఆరోపణలపై తిరుమల స్వామివారి ఆలయం ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు స్పందించారు. తన జీవితం స్వామివారికే అంకితమని, 50 ఏళ్లుగా తన పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా గతనెలలో స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నైవేద్య విరామ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మనవడిని ఆలయంలోనికి తీసుకువెళ్లడంతో పాటు తిరునామానికి సంబంధించి రమణ దీక్షితులపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ...'1974 నుంచి స్వామిరవారికి కైంకర్యాలను నిర్వహిస్తున్నాం.