అక్టోబరు 4 నుండి 12 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు | Tirumala Tirupati Devasthanam Brahmotsavam 2024 Dates, Special Arrangements, Various Vahanalu Sevas And Darshanam Details Inside | Sakshi
Sakshi News home page

Tirumala Brahmotsavalu 2024: అక్టోబరు 4 నుండి 12 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Published Sun, Sep 29 2024 7:48 AM | Last Updated on Sun, Sep 29 2024 10:51 AM

Tirumala Tirupati Devasthanam Brahmotsavam

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి.

వాహన సేవల వివరాలు :

04/10/2024: సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.

05/10/2024: ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.

06/10/2024: ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం,

07/10/2024: ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం,
మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం,

08/10/2024: ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం

09/10/2024: ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం,

10/10/2024: ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం,
రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం,

11/10/2024: ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం,

12/10/2024: ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం. 

బ్రహ్మోత్సవాలకు టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు

తిరు వీధుల్లో గ్యాలరీలు ఏర్పాటు ...

అక్టోబర్ 3 నుండి 12 తేది వరకు విఐపీ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు రద్దు

ప్రతిరోజు ఉదయం ,రాత్రి రెండు వాహన సేవల్లో దర్శనం ఇవ్వనున్న శ్రీవారు 

గరుడోత్సవం నాడు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు రద్దు

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ...
శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు ...
సర్వదర్శనానికి 24 గంటలు ...ప్రత్యేక దర్శనానికి 6 గంటలు ...
నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,133 ...
నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 35,502 
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.28 కోట్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement