తిరుమల బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం | Tirumala Srivari Salakatla Brahmotsavam 2023: Chakra Snanam Date, Time And Other Details Inside - Sakshi
Sakshi News home page

తిరుమల: ముగింపు దశకు బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం

Published Tue, Sep 26 2023 7:09 AM | Last Updated on Tue, Sep 26 2023 12:29 PM

Tirumala Salakatla Brahmotsavam 2023: Chakra Snanam Updates - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరిరోజైన మంగళవారం పుష్కరిణిలో శ్రీవారికి చక్ర స్నానం వేడుకగా ముగిసింది. టీటీడీ చైర్మన్‌ భూమన, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.  ఇవాళ రాత్రి ధ్వజావరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 

బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి, చక్రత్తాళ్వర్‌కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం చక్రత్తాళ్వరుకు అర్చకులు పుష్కరిణీలో పవిత్ర స్నానం ఆచరించారు. సుదర్శన చక్రతాళ్వార్‌ను పుష్కరిణిలో పవిత్ర స్నానం తర్వాత భక్తులను పుణ్యస్నానాలకు అనుమతించడం ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం వరకు చక్రస్నానం పవిత్రత ఉంటుందని,భక్తులు సంయమనంతో పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెబుతున్నారు.

వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు
సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వైభవోపేతంగా నిర్వహించింది. సోమవారంతో వాహన సేవలు అత్యంత వైభవంగా ముగిశాయి.  ఎనిమిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై వివిధ అలంకరాల్లో మలయప్పస్వామి నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయంలోని పలు ఆర్జిత ఏకాంతంగా నిర్వహించింది టీటీడీ. ప్రముఖుల సిఫార్సు లేఖల దర్శనంతో పాటు పలు ప్రత్యేక దర్శనాలను TTD రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే నెల(అక్టోబర్‌) 15న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్దం అవుతుంది.

చక్రస్నానమంటే..
బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక.. పరమాత్మ సుదర్శన స్వామిని ముందుంచుకొని పుష్కరిణిలో తీర్థమాడుటే చక్రస్నానం. దీనినే చక్రతీర్థం అని కూడా అంటారు. బ్రహ్మోత్సవము అంటే యజ్ఞం. యజ్ఞం పూర్తిగానే అవభృధ స్నానం చేయాలి. ‘భృధం’ అంటే బరువు, ‘అవ’ అంటే దించుకోవడం. ఇన్ని రోజులు యజ్ఞం నిర్వహించి అలిసిపోయినవాళ్లు ఆ అలసట బరువును స్నానంతో ముగించుకుంటారు. యజ్ఞంలో పాల్గొనని వారు కూడ ‘అవభృంధం’లో పాల్గొంటే యజ్ఞ ఫలితం వస్తుందని శాస్త్ర నిర్వచనం. చక్రస్నానం నాడు సుదర్శన స్వామి, మలయప్ప స్వామితో కలిసి స్నానం చేసే మహాభాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement