malayappa Swamy
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కొంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 59,236 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,446 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం 4.38 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ► మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ► మార్చి 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనటికెట్ల కోటాను విడుదల చేస్తారు. తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి విహారం తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తెప్పపై విహరించారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. స్వామి, అమ్మవార్లు ముమ్మార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
యూరప్‌లో వైభవంగా మలయప్ప స్వామి కల్యాణం
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్, యూకేలో మలయప్ప స్వామి కల్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప కల్యాణోత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫ్రాంక్ఫర్ట్, ఉట్రేచ్‌్ట–నెదర్లాండ్స్‌లో టీటీడీ అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కల్యాణ క్రతువు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు హాజరై భక్తి పారవశ్యంతో పులకించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి సమన్వయంతో ప్రపంచంలోని తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల సహకారంతో శ్రీవారి కల్యాణాలు కనుల విందుగా సాగుతున్నాయన్నారు. కల్యాణాన్ని తిలకించిన భక్తులందరికీ లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు. యూరప్‌లో స్వామి వారి కల్యాణానికి శివరామ్ తడిగొట్ల, ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ కార్తీక్ యార్లగడ్డ, జి.వెంకట కృష్ణ, సూర్య ప్రకాష్ తదితరులు ఏర్పాట్లు చేశారని వివరించారు. -
తిరుమల బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరిరోజైన మంగళవారం పుష్కరిణిలో శ్రీవారికి చక్ర స్నానం వేడుకగా ముగిసింది. టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఇవాళ రాత్రి ధ్వజావరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి, చక్రత్తాళ్వర్కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం చక్రత్తాళ్వరుకు అర్చకులు పుష్కరిణీలో పవిత్ర స్నానం ఆచరించారు. సుదర్శన చక్రతాళ్వార్‌ను పుష్కరిణిలో పవిత్ర స్నానం తర్వాత భక్తులను పుణ్యస్నానాలకు అనుమతించడం ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం వరకు చక్రస్నానం పవిత్రత ఉంటుందని,భక్తులు సంయమనంతో పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెబుతున్నారు. వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వైభవోపేతంగా నిర్వహించింది. సోమవారంతో వాహన సేవలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఎనిమిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై వివిధ అలంకరాల్లో మలయప్పస్వామి నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయంలోని పలు ఆర్జిత ఏకాంతంగా నిర్వహించింది టీటీడీ. ప్రముఖుల సిఫార్సు లేఖల దర్శనంతో పాటు పలు ప్రత్యేక దర్శనాలను TTD రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే నెల(అక్టోబర్) 15న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్దం అవుతుంది. చక్రస్నానమంటే.. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక.. పరమాత్మ సుదర్శన స్వామిని ముందుంచుకొని పుష్కరిణిలో తీర్థమాడుటే చక్రస్నానం. దీనినే చక్రతీర్థం అని కూడా అంటారు. బ్రహ్మోత్సవము అంటే యజ్ఞం. యజ్ఞం పూర్తిగానే అవభృధ స్నానం చేయాలి. ‘భృధం’ అంటే బరువు, ‘అవ’ అంటే దించుకోవడం. ఇన్ని రోజులు యజ్ఞం నిర్వహించి అలిసిపోయినవాళ్లు ఆ అలసట బరువును స్నానంతో ముగించుకుంటారు. యజ్ఞంలో పాల్గొనని వారు కూడ ‘అవభృంధం’లో పాల్గొంటే యజ్ఞ ఫలితం వస్తుందని శాస్త్ర నిర్వచనం. చక్రస్నానం నాడు సుదర్శన స్వామి, మలయప్ప స్వామితో కలిసి స్నానం చేసే మహాభాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం. -
తిరుమలలో నేడు ఉట్లోత్సవం.. ఆర్జిత సేవలు రద్దు
సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయి ఉంది. బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. ఇక.. ఇవాళ తిరుమల మాడవీధులలో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. దీంతో ఇవాళ ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. ఆయా సమయాల్లో ఉట్లోత్సవం, మలయప్ప స్వామివారి ఊరేగింపు ఉంటుందని పేర్కొంది. తిరుమలలో ఈ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆలయ నాలుగు మాడ వీధులలో అత్యంత వైభవంగా ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. తిరుమాడ వీధులలో ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తీసుకొస్తారు. ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ్టి.. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. శ్రావణ మాసం ముగింపు కావడంతో.. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ క్యూ కాంప్లెక్స్ నిండిపోయి.. భక్తులు బయట క్యూ లైన్లలో నిల్చున్నారు. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న(సెప్టెంబర్ 7, 2023) 58,855 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో.. 29,014 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం రూ. 4.65 కోట్లుగా లెక్కతేలింది. -
కెనడా,యూఎస్‌లో వైభవంగా జరగనున్న శ్రీవారి కళ్యాణోత్సవాలు: వివరాలివిగో!
కెనడా, అమెరికాలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం జూన్ 4వ తేదీ నుండి జూలై 23 వ తేదీవరకు పద్నాలుగు నగరాల్లో శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈసందర్బంగా కెనడా, యూఎస్‌లో “శ్రీనివాస కళ్యాణోత్సవం” పోస్టర్లను తాడేపల్లి కార్యాలయంలో ఉదయం (11.05.2023) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ ఎస్. మేడపాటి, టూరిజం అధ్యక్షులు వరప్రసాద్, ప్రభుత్వ సలహాదారు స్త్రీ, శిశు సంక్షేమఅభివృద్ధి, కాపు కార్పోరేషన్ అధ్యక్షులు అడపా శేషు, ఇతర కార్పోరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రాష్ట్ర, దేశ, విదేశాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహించాలని నిర్ణయించాము. ఇందులో భాగంగా జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ 2022 నెలల్లో USA, UK & Europe లలోని 20 నగరాల్లో అత్యంత వైభవంగా శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణాలు ఆయా దేశాలలోని తెలుగు అసోసియేషన్ల, ధార్మిక సంస్థల సహకారంతో నిర్వహించామన్నారు. గత నెల 28వ తేదీన బహ్రెయిన్‌లో నిర్వహించిన కళ్యాణోత్సవానికి దాదాపు 15 వేలమందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారన్నారు. కెనడా యూఎస్‌లలోని పలు తెలుగు అసోసియేషన్లు, ధార్మిక,సేవా సంస్థల కోరిక మేరకు ఆయా దేశాలలోని భక్తులకోసం తితిదే శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ ఆయా నగరాల్లోని కార్యనిర్వాహకులతో సమన్వయం చేస్తోందన్నారు. తితిదే నియమాల ప్రకారం శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి దేవస్థానం నుండి వెళ్ళే అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమం మొదలవుతుంది. తిరుమలలో లాగానే శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆయా నగరాల్లో తెలుగు, భారతీయ అసోసియేషన్లు లడ్డూ ప్రసాదాలతో పాటు, భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారన్నారు. ఉచితంగా శ్రీవారి కళ్యాణోత్సవం తిలకించడానికి అందరూ ఆహ్వానితులే. భక్తులందరూ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించి, ఆ దేవదేవుడి ఆశీర్వాదాలు పొందాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు. కెనడా, అమెరికాలో దేవదేవుని కళ్యాణాలు నిర్వహించడానికి ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, అక్కడి ఏర్పాట్లు, తదితర విషయాల్లో ఇటు తితిదే అర్చకులు, అటు వేద పండితులతో సమన్వయం చేస్తున్నామని ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెల్లడించారు. కెనడా , యూఎస్‌లో “శ్రీనివాస కళ్యాణం” జరిగే నగరాలు, తేదీలు Toronto, ON, Canada - 4th June, 2023 Montreal, Quebec, Canada – 10th June, 2023 Ottawa, ON, Canada – 11th June, 2023 Raleigh, NC, USA – 17th June, 2023 Jacksonville, FL, USA – 18th June. 2023 Detroit, MI, USA – 24th June, 2023 Chicago, IL, USA- 25th June, 2023 Atlanta, GA, USA – 1st July, 2023 Dallas, TX, USA – 2nd July, 2023 St. Louis, MO, USA – 6th July, 2023 Philadelphia, PA, USA – 9th July, 2023 Morganville, NJ, USA – 15th July, 2023 Houston, TX, USA – 16th July, 2023 Irving, TX, USA – 21st – 23rd July, 2023 (Srivari Kalyanam & Brahmotsavams) అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో NRIలు పాల్గొని, ఆ దేవదేవుడి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. -
తిరుమలలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం
తిరుమల: శ్రీవారి ఆలయంలో ఆదివారం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాది కనుమ నాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు మలయప్పస్వామివారిని, శ్రీకృష్ణ స్వామివారిని ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఊరేగించి, కల్యాణ మండపంలో ఆస్థానం నిర్వహించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు, హరికథ పారాయణం నిర్వహించారు. టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో అడవిలో ఉండే విధంగా పులులు ఇతర క్రూర జంతువుల సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు 3 సార్లు స్వామి వారి తరఫున ఈటెను విసిరి పార్వేట ఉత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి ఆలయంలో ఘనంగా ‘కాకబలి’ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని ఉదయపూర్వం నిర్వహించే ‘కాకబలి’ కార్యక్రమం ఆదివారం వైదికోక్తంగా జరిగింది. అర్చక స్వాములు పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు. వరాహస్వామివారికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం తిరుమల వరాహస్వామివారి ఆలయంలో ఆదివారం మండలాభిషేకం సందర్భంగా స్వామివారికి ఏకాంతంగా ప్రత్యేక సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వరాహస్వామివారి విమాన గోపురానికి బంగారు తాపడం చేసి సంప్రోక్షణ చేసిన విషయం విదితమే. సంప్రోక్షణ చేసి మండలం (48 రోజులు) పూర్తయిన సందర్భంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక సహస్ర కలశాభిషేకం, ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు కల్యాణం జరిగింది. కాగా, తిరుమలలో సోమవారం నిర్వహించే రామకృష్ణ తీర్థ ముక్కోటిని టీటీడీ ఏకాంతంగా నిర్వహించనుంది. -
మోహినీ అవతారంలో జగన్మోహనుడు
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామి మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు. మొదట రంగనాయకుల మండపంలో పల్లకిలో మోహినీ అవతారంలో ఉన్న మలయప్ప స్వామిని, శ్రీకృష్ణస్వామిని వేంచేపు చేశారు. అక్కడి నుంచి ఊరేగింపుగా కల్యాణ మండపానికి తోడ్కొని వచ్చారు. రాత్రి 7 గంటలకు స్వామివారికి విశేషమైన గరుడ వాహన సేవ కనులపండువగా జరిగింది. గరుడునిపై ఆశీనులై శ్రీమలయప్ప స్వామి భక్తకోటిని కటాక్షించారు. -
మలయప్ప స్వామిగా శ్రీవారు
సాక్షి, తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు రాత్రి 7 నుంచి 8 గంటల నడుమ చంద్రప్రభ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. కోవిడ్-19 ప్రభావంతో శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో స్వామి వారి వాహన సేవలను ఆలయంలో ఏకంతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ మలయప్ప స్వామి వారు వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం ఉదయం 8.00 గంటలకు సర్వభూపాల వాహనంపై శ్రీదేవి,భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు..కరోనా విజృభిస్తున్న నేపధ్యంలో రేపు ఉదయం స్వర్ణరధంను రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. (వెంకన్న సన్నిధిలో పలువురు ప్రముఖులు ) -
కల్పవృక్ష వాహనంపై మలయప్ప
సాక్షి, తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో అభయమిచ్చారు. క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు.ఈ రోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమివ్వనున్నారు. చదవండి: తిరుపతి బండికి ఎగనామం -
సింహ వాహనంపై నరసింహస్వామి అలంకారంలో..
సాక్షి, తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై అభయ ఆహ్వాన నరసింహస్వామి అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు అభయమిస్తారు. -
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప
సాక్షి, తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజున శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. హంస వాహనసేవలో శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు కరోనా వైరస్ నియంత్రణ లో భాగంగా ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. కళ్యాణోత్సవ మండపంలో వాహన సేవల జరుగుతుంది.. కాగా, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు. -
సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు
సాక్షి, తిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సోమవారం ఉదయం సింహవాహనంపై యోగ ముద్రంకిత స్వరూపంలో మలయప్పస్వామి భక్తులకు ఏకాంతంగా దర్శనం ఇచ్చారు. సింహం అంటే ముందుగా నరసింహ అవతారమే సాక్షత్కరిస్తుంది. భక్తుల మదిలో వెంకటాద్రి రాజసింహం మృగరాజుపై యోగముద్రంకిత స్వరూపంతో దర్శనమిచ్చారు. కాగా ప్రపంచాన్ని గజ గజలాడిస్తున్న కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమల చరిత్రలోనే ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కల్యాణ మలయప్ప