Salakatla brahmotsavam
-
చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు (ఫోటోలు)
-
కన్నుల పండువగా శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)
-
అక్టోబరు 4 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబరు 4 నుంచి12 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈఓ శ్యామలరావు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందన్నారు. అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మంలతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈఓ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరు 4న ధ్వజారోహణం ఉంటుందని, అదేరోజు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వర స్వామికి పట్టువ్రస్తాలు సమరి్పస్తారని తెలిపారు. ఈఓ వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు.. 👉 ఉ.8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 వరకు వాహన సేవలు జరుగుతాయి. గరుడ వాహన సేవ సా.6.30 గంటలకు ప్రారంభమవుతుంది. 👉 భక్తుల రద్దీ శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. 👉 అక్టోబరు 4 నుంచి 12 వరకు కాటేజీ దాతలకు గదుల కేటాయింపు ఉండదు. తిరుమలలో నీటి లభ్యతపై అపోహలొద్దు.. ఇదిలా ఉంటే.. శనివారం నాటికి తిరుమలలో కుమారధార, పసుపుధార, పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం డ్యాంలలో కలిపి 4,592 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉందని.. నీటి లభ్యతపై అపోహలొద్దని ఈఓ శ్యామలరావు కోరారు. తిరుపతిలోని కల్యాణి డ్యాంలో 5,608 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉన్నందున శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనపు నీటి అవసరాలతో సహా 130 రోజుల వరకు ఈ నీరు సరిపోతుందని ఆయన చెప్పారు. లాగే, కల్యాణి డ్యాం నుండి 11 లక్షల గ్యాలన్ల నీటిని అదనంగా సరఫరా చేయడానికి తిరుపతి మున్సిపల్ కమిషనర్ అంగీకరించారని.. తద్వారా అదనంగా మరో నెలరోజులు తిరుమల నీటి అవసరాలు తీరుతాయని ఆయన చెప్పారు. అంతేకాక.. కైలాసగిరి రిజర్వాయర్ నుండి మరో 10 ఎంఎల్డీ నీరు తిరుపతికి సరఫరా కానుందని ఆయన వివరించారు. ఇక తిరుపతికి నీటి సరఫరాను పెంచడానికి అదనపు పైప్‌లైన్ నిమిత్తం టీటీడీ రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు కూడా శ్యామలరావు వెల్లడించారు. -
Tirupati: తిరుమలలో అక్టోబర్ 4 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి.వాహన సేవల వివరాలు :04/10/2024 సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.05/10/2024 ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.06/10/2024 ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం,07/10/2024 ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం,మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం,08/10/2024 ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం,10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం,రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం,11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం,12/10/2024 ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం. ఆగష్టు 22న వర్చువల్ సేవల కోటా విడుదలవర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగష్టు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.ఆగష్టు 23న అంగప్రదక్షిణం టోకెన్లుంనవంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగష్టు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాంశ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను ఆగష్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాంవయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆగష్టు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.ఆగష్టు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలనవంబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగష్టు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదలంతిరుమల, తిరుపతిలలో నవంబరు నెల గదుల కోటాను ఆగష్టు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.ఆగష్టు 27న శ్రీవారి సేవ కోటా విడుదలఆగష్టు 27న తిరుమల ృ తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 71,595 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,981 తలనీలాలు సమర్పించిన భక్తుల . నిన్న హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు. ఇక ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. -
చక్రస్నానంతో సేద తీరిన శ్రీనివాసుడు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవంతో స్వామివారు వరాహస్వామి ఆలయానికి చేరుకున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ వాహనాల్లో ఊరేగి అలసిసొలసిన శ్రీవారు స్నపన తిరుమంజనం సేవలో సేద తీరారు. జీయర్లు, ఆలయ అర్చకుల నేతృత్వంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. వైదికంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు సాగింది. అనంతరం మంగళవాయిద్యాల నడుమ, వేదపండితుల వేదఘోష, అశేషభక్త జన గోవింద నామస్మరణల మధ్య గర్భాలయంలోని మూలమూర్తి అంశయైన సుదర్శన చక్రత్తాళ్వార్‌కు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. భక్తులు సైతం ఈ పుష్కరిణిలో పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. కాగా, తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఆగమ శాస్త్రం ప్రకారం గరుడపతాకాన్ని కిందకు దించి బ్రహ్మోత్సవాలు ముగించారు. -
తిరుమల: ముగింపు దశకు బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం (ఫోటోలు)
-
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
-
తిరుమల బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరిరోజైన మంగళవారం పుష్కరిణిలో శ్రీవారికి చక్ర స్నానం వేడుకగా ముగిసింది. టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఇవాళ రాత్రి ధ్వజావరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి, చక్రత్తాళ్వర్కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం చక్రత్తాళ్వరుకు అర్చకులు పుష్కరిణీలో పవిత్ర స్నానం ఆచరించారు. సుదర్శన చక్రతాళ్వార్‌ను పుష్కరిణిలో పవిత్ర స్నానం తర్వాత భక్తులను పుణ్యస్నానాలకు అనుమతించడం ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం వరకు చక్రస్నానం పవిత్రత ఉంటుందని,భక్తులు సంయమనంతో పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెబుతున్నారు. వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వైభవోపేతంగా నిర్వహించింది. సోమవారంతో వాహన సేవలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఎనిమిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై వివిధ అలంకరాల్లో మలయప్పస్వామి నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయంలోని పలు ఆర్జిత ఏకాంతంగా నిర్వహించింది టీటీడీ. ప్రముఖుల సిఫార్సు లేఖల దర్శనంతో పాటు పలు ప్రత్యేక దర్శనాలను TTD రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే నెల(అక్టోబర్) 15న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్దం అవుతుంది. చక్రస్నానమంటే.. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక.. పరమాత్మ సుదర్శన స్వామిని ముందుంచుకొని పుష్కరిణిలో తీర్థమాడుటే చక్రస్నానం. దీనినే చక్రతీర్థం అని కూడా అంటారు. బ్రహ్మోత్సవము అంటే యజ్ఞం. యజ్ఞం పూర్తిగానే అవభృధ స్నానం చేయాలి. ‘భృధం’ అంటే బరువు, ‘అవ’ అంటే దించుకోవడం. ఇన్ని రోజులు యజ్ఞం నిర్వహించి అలిసిపోయినవాళ్లు ఆ అలసట బరువును స్నానంతో ముగించుకుంటారు. యజ్ఞంలో పాల్గొనని వారు కూడ ‘అవభృంధం’లో పాల్గొంటే యజ్ఞ ఫలితం వస్తుందని శాస్త్ర నిర్వచనం. చక్రస్నానం నాడు సుదర్శన స్వామి, మలయప్ప స్వామితో కలిసి స్నానం చేసే మహాభాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం. -
Tirumala: చంద్రప్రభ వాహనంపై ఉరేగిన స్వామివారు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఏడో రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై కొలువుదీరి శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వాహన సేవలో కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాటాలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వేష ధారణలతో వాహన సేవ ముందు ఆకట్టుకున్నాయి. -
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
-
శ్రీవారి సేవలో సీఎం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలను సమర్పించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండుసార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో గడిపిన సీఎం జగన్ శ్రీవారి సేవలో పాల్గొనడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తిరుపతిలో నూతనంగా నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్, ఎస్వీ హాస్టల్ నూతన భవనాలను ప్రారంభించడంతోపాటు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. మంగళ వాయిద్యాల నడుమ... మొదటి రోజైన సోమవారం రాత్రి శ్రీవారికి సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. తొలుత తిరుపతి నుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్న సీఎం జగన్ భక్తుల కోసం దాతల సహకారంతో టీటీడీ నిర్మించిన రెండు విశ్రాంతి గృహాలను ప్రారంభించారు. పద్మావతి అతిథి గృహంలో కొద్దిసేపు గడిపారు. అనంతరం శ్రీవారి ఆలయానికి ఎదురుగా కొలువై ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రధాన అర్చకులు ముఖ్యమంత్రికి పరివట్టం కట్టారు. అనంతరం సీఎం జగన్ ప్రభుత్వం తరఫున తీసుకొచ్చిన పట్టువస్త్రాలను తలపైన పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ధ్వజ స్తంభానికి నమస్కరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు సీఎం జగన్‌ను ఆశీర్వదించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శ్రీవేంకటేశ్వర స్వామివారి కలంకారీ చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, కార్య నిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సీఎం వెంట ఉన్నారు. మరోసారి శ్రీవారిని దర్శించుకున్న సీఎం సోమవారం రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేసిన ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఉదయం ప్రాతః కాల సమయంలో తిరుమల శ్రీవారిని మరోసారి దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రి జగన్‌కు వేదపండితులు వేదాశీర్వచనం అందచేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రులు కొడాలి నాని, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, భరత్, ఈవో ఏవీ ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ప్రాచీన సంప్రదాయాన్ని పాటిస్తూ గంగమ్మకు పూజలు ముఖ్యమంత్రి జగన్ సోమవారం సాయంత్రం తిరుమలకు బయలుదేరే ముందు ప్రాచీన సంప్ర దాయాన్ని పాటిస్తూ తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, ఆదిమూలపు సురేష్, రోజా, తుడా చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంగమ్మను శ్రీవేంకటేశ్వరుని సోదరిగా పురాణాలు చెబుతున్నాయి. ఏటా గంగమ్మ జాతర సందర్భంగా తిరుమల శ్రీవారి తరపున సంప్రదాయంగా గంగమ్మకు సారె పంపుతారు. సీఎం తిరుమల చేరుకునే ముందు గంగమ్మను దర్శించుకునే సంప్రదాయం చాలా దశాబ్దాల తరువాత గత సంవత్సరం నుంచి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి కృషితో పునఃప్రారంభమైంది. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం ప్రాంతంలో దాతలు రాజేష్‌శర్మ, నరేంద్ర చౌదరి ఇ చ్చిన విరాళాలతో టీటీడీ వేర్వేరుగా నిర్మించిన 2 అతిథి గృహాలు వకుళామాత నిలయం, రచన విశ్రాంతి గృహాలను సీఎం ప్రారంభించారు. సోమవారం రాత్రి స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ముద్రించిన 2024 డైరీలు, క్యాలెండర్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఇవి సెప్టెంబరు 22 నుంచి తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉంటాయి. అక్టోబరు రెండో వారం నుంచి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. రూ.600 కోట్లతో 7 వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అన్నింటికన్నా సంతోషించే విషయం.. టీటీడీలో పనిచేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు కచ్చితంగా ఇళ్ల స్థలాలు ఉండాలని, వారికి మంచి చేయాలన్న తపనతో వేగంగా అడుగులు వేశాం. రూ.313 కోట్లను ఖర్చు చేసి 3,518 మందికి ఇవాళ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. మరో రూ.280 కోట్లు ఖర్చు చేసి ఇంకో 3,500 మందికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. నెల నుంచి 45 రోజుల్లోగా ఇది కూడా పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పారు. దాదాపుగా రూ.600 కోట్లతో సుమారు 7 వేల మంది టీడీపీ ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలిచ్చి వారి మొహల్లో సంతోషం చూసే మంచి కార్యక్రమం చేస్తున్నాం. 22 ఏ నుంచి తొలగించి పూర్తి హక్కులు తిరుపతిలో దాదాపు 8,050 మంది ఇళ్లు కట్టుకుని 22 ఏ సమస్యలో ఇరుక్కుని అమ్ముకోవాలనుకున్నా, పిల్లలకు ఇవ్వాలనుకున్నా కుదరక ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల కిందట వరదల సమయంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని నా దృష్టికి తెచ్చారు. ఆ సమస్యను పరిష్కరించి తిరుపతి ప్రజలకు మంచి చేస్తూ 22–ఏ నుంచి వాటిని డిలీట్ చేయించాం. చంద్రగిరిలో కూడా 2,500 మందిని 22–ఏ నుంచి డిలీట్ చేసి వారికి కూడా ఉపశమనం కలిగించాం. దేవుడి దయతో వీటన్నింటి వల్లా మంచి కోరుకుంటూ దాదాపు రూ.1,300 కోట్లకు సంబంధించిన పలు కార్యక్రమాలను ప్రారంభించుకుంటున్నాం. టెంకాయ కొట్టి వదిలేసిన టీడీపీ సర్కారు తిరుపతిలో గత ప్రభుత్వం టెంకాయ కొట్టి వదిలేసిన ప్రాజెక్టుని నాలుగేళ్లుగా చేయి పట్టుకుని నడిపిస్తూ శ్రీనివాస సేతుని పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. సోమవారం సాయంత్రం శ్రీనివాస సేతు వంతెనను ప్రారంభించిన సీఎం జగన్ ప్రజలకు అంకితం చేశారు. విద్యార్థులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు నిర్మించిన శ్రీవేంకటేశ్వర కళాశాల హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ‘శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు 2019లో ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం టెంకాయ కొట్టి, జీవో ఇచ్చి వదిలేసింది. నాలుగేళ్లలో చిత్తశుద్ధితో పూర్తిచేసి ఇవాళ తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నాం. దాదాపు రూ.650 కోట్ల వ్యయంతో నిర్మించిన 7 కి.మీ. పొడవైన ఈ ఫ్లైఓవర్‌తో భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ హాస్టళ్లకు సంబంధించి రూ.37.80 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను కూడా ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. దీనివల్ల విద్యార్థులకు మరింత మెరుగైన వసతి అందుబాటులోకి రానుంది’ అని సీఎం పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. -
బ్రహ్మోత్సవ వైభవం చూతము రారండి..!
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆరంభానికి నాందిగా ఆలయంలో సోమవారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తం గా నిర్వహించారు. అర్చకులు సాయంత్రం మీన లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా పవిత్ర గరుడ పతాకాన్ని (ధ్వజపటం) బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రానికి ఆవిష్కరించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. నిర్ణీత కొలతతో కూడిన కొత్త వస్త్రం మీద స్వామి వాహనమైన గరుడ బొమ్మను చిత్రీకరించారు. ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గోధూళి వేళలో కంకణ భట్టాచార్యులుగా రామకృష్ణ దీక్షితులు క్రతువును నిర్వహించి పతాకావిష్కరణ చేశారు. అంతకుముందు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పరివార దేవతలైన ఆదిశేషుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు, గరుడ ధ్వజం, సుదర్శన చక్రత్తాళ్వార్‌తో కలిసి ఆలయ పురవీధుల్లో ఊరేగారు. పెద్ద శేష వాహనంపై పురుషోత్తముని అభయం సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజైన సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు 7 తలల స్వర్ణశేషవాహనంపై (పెద్ద శేషవాహనం) వైకుంఠనాథుని అలంకారంలో మాడవీధుల్లో భక్తులను అనుగ్రహించారు. మంగళవారం ఉదయం స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై ద్వారక కృష్ణుడి అలంకారంలో, రాత్రి హంస వాహనంపై సరస్వతిదేవి రూపంలో భక్తులను కటాక్షించారు. అంతకుముందు కొలువు మండపంలో స్వామివారు ఊయలూగుతూ దర్శనమిచ్చారు. -
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్
CM Jagan Tirumala Tirupati Tour Live Updates 07:19AM, 19-09-2023 ►తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని పద్మావతి అతిథి గృహానికి బయలుదేరిన సీఎం జగన్ ►సీఎం వెంట డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్.కే.రోజా, టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, ఈవో ధర్నా రెడ్డి 07:09AM, 19-09-2023 ►శ్రీవారిని దర్శించుకుని శ్రీరంగనాయకులు మండపంకు చేరుకున్న సీఎం జగన్ ►ఆశీర్వదించిన వేద పండితులు 06:40AM, 19-09-2023 ►మహాద్వారం వద్ద స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు ►సీఎం జగన్మోహన్రెడ్డితో పాటు.టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ►శ్రీవారి ఆలయంకు చేరుకున్న సీఎం జగన్ 09:19PM, 18-09-2023 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి పెద శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులకు దర్శనం ఇస్తున్న మలయప్ప స్వామి ► గోవిందా నామ స్మరణతో మార్మోగుతున్న తిరుమాడ వీధులు ► తిరుమాడ వీధుల్లో పెద శేష వాహన స్వామి ► మంగళ వాయిద్యాలు , కొలాటల నడుమ కోలాహలంగా సాగిన వాహన సేవ ► విశేష సంఖ్యలో పాల్గొని కర్పూర నీరాజనాలు అందించిన భక్తులు ► గోవింద నామ స్మరణతో మారు మ్రోగిన తిరువీధులు... 08:41PM, 18-09-2023 ► తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ►మీనలగ్నంలో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం. ► కాసేపట్లో పెద శేష వాహనంపై శ్రీవారి ఊరేగింపు. 08:18PM, 18-09-2023 తిరుమలలో సీఎం జగన్ ► శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ.. స్వామివారి దర్శనం అనంతరం సీఎం జగన్‌కు వేద పండితుల ఆశీర్వచనం. ► శ్రీవారి ఆలయం రంగరాయలు మండపంలో 2024 టీటీడీ క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన సీఎం జగన్ ► శ్రీవారి ఆలయం నుంచి శ్రీపద్మావతి గెస్ట్ హౌస్‌కు బయలుదేరిన సీఎం జగన్.. రాత్రికి ఇక్కడే బస 08:07PM, 18-09-2023 ► తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ► ప్రభుత్వం తరపున స్వామివారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. 07:55PM, 18-09-2023 శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సీఎం జగన్ వెంట టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు. 07:50PM, 18-09-2023 ► సీఎం జగన్‌కి పరివట్టం కట్టిన ఆలయ ప్రధాన అర్చకులు. ► పట్టువస్త్రాలు సమర్పించేందుకు బేడి ఆంజనేయ స్వామి గుడి నుంచి బయల్దేరిన సీఎం జగన్. 07:42PM, 18-09-2023 ► బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సీఎం వైఎస్ జగన్ ► సీఎం జగన్‌తో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు. ► మరికాసేపట్లో శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ 06:42PM, 18-09-2023 ► కాసేపట్లో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్న సీఎం జగన్. ఆపై శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ. 06:37PM, 18-09-2023 ► రచన అతిథి గృహాన్ని ప్రారంభించిన సీఎం జగన్ 06:08PM, 18-09-2023 ►వకులమాత గెస్ట్ హౌస్ ప్రారంభించిన సీఎం జగన్. 06:05PM, 18-09-2023 ► తిరుమల చేరుకున్న సీఎం వైఎస్ జగన్ 05:40PM, 18-09-2023 ► తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. మాడవీధుల్లో గరుడ ధ్వజపటం, స్వామి, అమ్మవార్ల ఊరేగింపు. మీనలగ్నంలో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం. రాత్రి 9గంటలకు పెదశేష వాహనంపై శ్రీవారి దర్శనం. 05:28PM, 18-09-2023 మరికాసేపట్లో తిరుమలకు సీఎం జగన్ ► తాతయ్య గుంట గంగమ్మ ఆలయం దర్శించుకొని తిరుమలకి బయలుదేరిన సీఎం ► మరికాసేపట్లో తిరుమల చేరుకోనున్న సీఎం జగన్ ► తిరుమలలో వకుళా మాత, రచన అతిథి గృహాలు ప్రారంభించనున్న సీఎం జగన్ ► అనంతరం ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ 05:25PM, 18-09-2023 ► తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవత ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ 05:20PM, 18-09-2023 ►గంగమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం జగన్. 04:53PM, 18-09-2023 ► తిరుపతి శ్రీపద్మావతి పురం నుంచి గంగమ్మ ఆలయానికి బయలుదేరిన సీఎం జగన్ 04:42PM, 18-09-2023 ► టీటీడీ ఉద్యోగులకు సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 04:30PM, 18-09-2023 శ్రీపద్మావతిపురం.. సీఎం జగన్ ప్రసంగం ►ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. 2019లో అప్పట్లో కేవలం ఎన్నికల నిమిత్తం టెంకాయ కొట్టి.. జీవో ఇచ్చేసిన పరిస్థితి నుంచి.. ఈ నాలుగు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టును చెయ్యి పట్టుకుని నడిపించాం. ఇవాళ ఆ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించి.. తిరుపతి ప్రజలకు అంకితమిస్తున్నా. దాదాపు 650 కోట్ల ప్రాజెక్టు.. ఏడు కిలోమీటర్ల పొడవునా.. తిరుపతి ప్రజలకు ప్రత్యేకించి గుడికి పోయే భక్తులకు మరి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ►ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్‌కు సంబంధించి.. 37 కోట్ల రూపాయలకు సంబంధించి హాస్టల్స్ ప్రారంభించడం వల్ల మెరుగైన వసతులు విద్యార్థులకు అందనున్నాయి. ►వకులమాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్ ప్రారంభించి టీటీడీకి ఇవ్వడం జరగనుంది. ►అన్నింటికంటే సంతోషం కలిగించే అంశం ఏంటంటే.. టీటీడీలో పని చేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఉండాలని.. మంచి జరగాలనే తాపత్రయంతో త్వరగా అడుగులు వేశాం. రూ. 313 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసి.. 3,518 మందికి సంబంధించి ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. మరో 280 కోట్లు ఖర్చు చేసి మరో మూడు వేల మందికి ఇస్తాం. ఈ ప్రక్రియ కూడా నెల నుంచి 45 రోజుల్లో పూర్తి చేస్తాం. ►దాదాపు 600 కోట్ల రూపాయలతో.. ఏడు వేల మంది టీటీడీ ఉద్యోగుల ముఖాల్లో సంతోషం చూస్తున్నాం. ఇది అన్నింటికి కంటే ఎక్కువ సంతోషం ఇచ్చే రోజు ఇది. ►22ఏలో అమ్మాలనుకున్న ఇవ్వలేని పరిస్థితిలో సతమతమవుతా ఉన్న పరిస్థితుల్లో నేను ఒకసారి తిరుపతికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకువచ్చిన ఆ సమస్యను పరిష్కరించి సుమారు 8,000 మందికి పైగా నుంచి విముక్తి కల్పించాం. 8,050 మందికి తిరుపతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 2,500 చంద్రగిరిలో 22 ఏలో నుంచి తొలగించి ఉపశమనం కలిగించడం జరిగింది. ఇవన్నీ దేవుడి దయతో చేసే అవకాశం కలిగింది. ఈ నాలుగేళ్లలో మంచి జరగాలని కోరుకుంటూ అడుగులు వేశాం. ►ఇవాళ రూ. 1300 కోట్ల రూపాయలకు సంబంధించిన పలు కార్యక్రమాలు ప్రారంభించడం సంతోషం కలిగించింది. మరింత మంచి చేసే అవకాశం కలగాలని మనసారా కోరుకుంటూ సెలవు. 04:25PM, 18-09-2023 60 ఏళ్ల కల సీఎం జగన్ సాకారం చేశారు: భూమన ► టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గతంలో వైఎస్సార్ నిర్ణయించారు. ►పేదల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి సీఎం జగన్. ► టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం చేశారు. ► టీటీడీ ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్ తీసుకున్న చారిత్రక నిర్ణయం. ►సీఎం జగన్ చొరవతోనే శ్రీనివాస సేతు ప్రాజెక్టు పూర్తయ్యింది. 04:20PM, 18-09-2023 ► గోవిందరాజస్వామి డిగ్రీ కాలేజీకి సంబంధించి.. ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల శిలాఫలకాల ఆవిష్కరణ చేసి ప్రారంభించారు సీఎం జగన్. 04:15PM, 18-09-2023 ► శ్రీపద్మావతిపురంలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం జగన్. రూ.684 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం. 04:12PM, 18-09-2023 ► శ్రీపద్మావతిపురం చేరుకున్న సీఎం జగన్. శాస్త్రోక్తంగా పూజల్లో పాల్గొన్న సీఎం జగన్. 03:49PM, 18-09-2023 ► రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి కు బయలుదేరిన సీఎం జగన్. మరికాసేపట్లో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభం 03:33PM, 18-09-2023 ► రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ► సీఎం జగన్‌కు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఆర్కే రోజా, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి 02:23PM, 18-09-2023 ► తిరుమల బ్రహ్మోత్సవాల్లో.. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి పర్యటనకు బయల్దేరారు. అదే సమయంలో తిరుపతిలో పలు ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. తిరుమల స్వామివారికి.. సోమవారం సాయంత్రం 6.15–6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తం గా ధ్వజారోహణం నిర్వహించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు పెద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు. సీఎం జగన్ రేపటి(సెప్టెంబర్ 19) షెడ్యూల్ ఇదే.. ►మంగళవారం ఉదయం 6.20 గంటలకు సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. -
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి
-
సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం వైఎస్ జగన్‌కు ఆహ్వానం
-
బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి,అమరావతి/తిరుమల: తిరుమలలో ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం జగన్‌ను టీటీడీ ఆహ్వానించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎంకు వేద పండితులు ఆశీర్వచనమిచ్చారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి మంగళవారం కలిశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించారు. ముఖ్యమంత్రికి ఆహ్వనపత్రికతో పాటు శ్రీవేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 18 నుంచి 26 వరకు 9 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. చదవండి: చంద్రబాబు భద్రత ప్రభుత్వం బాధ్యత: హోంమంత్రి -
తిరుమలకు విపరీతంగా పెరిగిన రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలకు విపరీతంగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ మాసం ముగుస్తుండడంతో.. భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) కోసం 18 గంటలు, ప్రత్యేక దర్శనం కోసం 4 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం, 10) శ్రీవారిని 84,449 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 33,570గా ఉంది. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4.47 కోట్లుగా లెక్క తేలింది. రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ శుద్ధి చెయ్యనున్నారు అర్చకులు. ఈ నెల18 నుండి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 17న అంకురార్పణ, 18 ధ్వజారోహణం నిర్వహిస్తారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంతత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 22వ తేదీన గరుడ సేవ ఉండగా.. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల్ని అనుమతించరు. ఇక బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సిఫారసు లేఖలు రద్దు ఉంటుందని తెలియజేసింది టీటీడీ. అలాగే.. వాహనసేవలు తిలకించడానికి గ్యాలరీలు ఏర్పాటు చేశారు. -
తిరుమలలో ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు: ఈవో ధర్మారెడ్డి
సాక్షి, తిరుపతి: అధిక మాసం కారణంగా.. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రం సిద్ధమైంది. సోమవారం అన్నమయ్య భవన్లో అన్నివిభాగాల అధికారులతో ఈవో ధర్మారెడ్డి సోమవారం సమావేశం నిర్వహించి.. బ్రహోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించి.. అనంతరం అధికారిక ప్రకటన చేశారు. సెప్టెంబరు 18 నుండి 26 వరకూ సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15వ తేదీ నుండి 23 వరకు తేదీ వరకూ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉంటాయని వెల్లడించారాయన. ఈ ఏడాదిలో అధిక మాసం కారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రంను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణం కార్యక్రమంను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 22వ తారీఖున గరుడ సేవ, 23వ తేదీన స్వర్ణరథం, 25వ తేదీన రథోత్సవం, 26వ తేదీన చక్రస్నానం, తిరుమలలో వైభవంగా ధ్వజావరోహణం కార్యక్రమంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు మాత్రమే ఉంటుందని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారాయన. ఇక అధిక మాసం కారణంగా ఈ ఏడాది అక్టోబర్ నెలలో 14-18వ తేదీల నడుమ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారాయన. అక్టోబర్ 18వ తారీఖున గరుడవాహన సేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు.. ఈ ఏడాది పెరటాసి మాసంలో రెండు బ్రహ్మోత్సవాలు ఉన్న క్రమంలో భారీ స్ధాయిలో భక్తులు తిరుమల బ్రహ్మోత్సవాలకు విచ్చేసే అవకాశం ఉండొచ్చన్నారాయన. పవిత్ర మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుందన్నారు. అలాగే.. సెప్టెంబర్ 23, 30, అక్టోబర్ 7, 14 తేదీల్లో పురటాసి శనివారాలు జరుగుతాయని, కాబట్టి ఈ రెండు బ్రహ్మోత్సవాలు, పురటాసి శనివారాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. టీడీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు. -
వైభవంగా సాలకట్ల తెప్పోత్సవాలు
-
తిరుమల: అంగరంగ వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు (ఫోటోలు)
-
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ
సాక్షి, తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల బుక్లెట్లను ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆవిష్కరించారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబరు 20న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సెప్టెంబరు 26న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 1న గరుడవాహనం, అక్టోబరు 2న స్వర్ణరథం, అక్టోబరు 4న రథోత్సవం, అక్టోబరు 5న చక్రస్నానం జరుగనున్నాయి. వాహనసేవల వివరాలు.. ►సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం. ►సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు హంస వాహనం. ►సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనం. ►సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనం. ►అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనం. ►అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రథరంగ డోలోత్సవం(స్వర్ణ రథం), రాత్రి 7 నుండి 9 గంటల వరకు గజ వాహనం. ►అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ►అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనం. ►అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం. -
Tirumala: 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమల: రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సమాయత్తమవుతోంది. ఈనెల 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఆలయ మాడ వీధుల్లో వాహన సేవలు జరగనున్నాయి. 26న అంకురార్పణ, అక్టోబర్ 1న గరుడసేవ నిర్వహించనున్నారు. ఇక కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి మాడ వీధుల్లో వాహన సేవలు జరగనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశముంది. ఈ క్రమంలో వారి కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈనెల 20న ఉ. 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. (క్లిక్: ఏపీలో ‘ఆంధ్ర గోపుష్టి’ కేంద్రాలు.. విజయవాడలో తొలిస్టాల్) -
తిరుమల: సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
-
బ్రహ్మోత్సవాల్లో మాస్క్ తప్పనిసరి
తిరుమల: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్ తప్పని సరిగా ధరించాలని చెప్పారు. తిరుమల, అలిపిరిలో భక్తుల కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. అన్నమయ్య భవనంలో గురువారం ఆయన ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డితో కలసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 26న అంకురార్పణ, 27న ధ్వజారోహణం నిర్వహించనున్నట్లు చెప్పారు. 27న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేస్తామని, ఆర్జిత సేవలు, శ్రీవాణి, వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ప్రివిలైజ్డ్ దర్శనాలను రద్దు చేశామని పేర్కొన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు ప్రతిరోజూ 9 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచనున్నట్లు తెలిపారు. -
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
-
సీఎం జగన్ రెండో రోజు తిరుమల పర్యటన ఫోటోలు
-
మోహినీ అవతారంలో జగన్మోహనుడు
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామి మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు. మొదట రంగనాయకుల మండపంలో పల్లకిలో మోహినీ అవతారంలో ఉన్న మలయప్ప స్వామిని, శ్రీకృష్ణస్వామిని వేంచేపు చేశారు. అక్కడి నుంచి ఊరేగింపుగా కల్యాణ మండపానికి తోడ్కొని వచ్చారు. రాత్రి 7 గంటలకు స్వామివారికి విశేషమైన గరుడ వాహన సేవ కనులపండువగా జరిగింది. గరుడునిపై ఆశీనులై శ్రీమలయప్ప స్వామి భక్తకోటిని కటాక్షించారు. -
దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ
సాక్షి, తిరుపతి/తిరుమల: సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం రాత్రి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనమివ్వగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు.. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకున్న ఆయన సంప్రదాయబద్ధంగా నుదుటున తిరునామం.. పంచెకట్టుతో బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ముందుగా శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న తరువాత ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య గజరాజులు వెంటరాగా.. వైఎస్ జగన్ ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి సన్నిధిలో ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వామివారి వైభవాన్ని తెలియజేశారు. ఆలయ జీయర్లు శేషవస్త్రంతో వైఎస్ జగన్‌ను సత్కరించారు. స్వామివారి దర్శనానంతరం రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేకూరాలని ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వదించాలని శ్రీవారిని సీఎం ప్రార్థించారు. అనంతరం వకుళమాతను, ఆలయ ప్రదక్షిణ చేసి విమాన వేంకటేశ్వరస్వామిని, సబేరా, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్‌రెడ్డి స్వామివారి చిత్రపటంతో పాటు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ 2022 డైరీలు, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న సీఎం వైఎస్ జగన్ శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రికి శ్రీకారం శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రిని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలుత.. తాడేపల్లి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం సీఎం జగన్ పలు ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టులో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన తిరుపతికి చేరుకున్నారు. బర్డ్ ఆస్పత్రి వద్ద టీటీడీ సహకారంతో రూ.64 కోట్లతో నిర్మించిన బాలల ఆరోగ్య వరప్రదాయని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయాన్ని ప్రారంభించారు. ఆస్పత్రిలో వైద్య సేవలందించే వివిధ విభాగాలను పరిశీలించారు. ఇక గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఇక్కడ ఉచిత వైద్య సేవలను అందించనుంది. ఈ నెల 12వ తేదీ మంగళవారం నుంచి ఓపీ సేవలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ మొదటి వారం నుంచి శస్త్ర చికిత్సలు మొదలుకానున్నాయి. దీంతో ఈ తరహా చికిత్సలకు ఇకపై హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలిపిరి నడకదారి పైకప్పు ప్రారంభం అలిపిరి నడక దారి పైకప్పు ప్రారంభ కార్యక్రమంలో శ్రీవారికి పూలు సమర్పిస్తున్న సీఎం అలిపిరి నుంచి తిరుమల వరకు పునర్నిర్మించిన నడకమార్గం పైకప్పును కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. నిజానికి ఈ మార్గంలో 40 ఏళ్ల క్రితం పైకప్పు నిర్మించారు. ఇది పలుచోట్ల పాడవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.25 కోట్లతో దీనిని పునర్నిర్మించడానికి ముందుకొచ్చింది. ఈ కార్యక్రమాల్లో ఉపసభాపతి కోన రఘుపతితోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఉండగానే సామాన్యులకూ అనుమతి సహజంగా శ్రీవారి ఆలయంలో సీఎం ఉన్న సమయంలో సామాన్య భక్తులెవ్వరినీ అనుమతించరు. సీఎం బయటకు వచ్చిన తరువాతే వారిని దర్శనానికి అనుమతివ్వడం పరిపాటి. అయితే.. ఈసారి అందుకు భిన్నంగా వైఎస్ జగన్ శ్రీవారి ఆలయంలో ఉండగానే సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనం కల్పించారు. స్వామివారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించి, శ్రీవారి ఆలయ గర్భగుడి నుంచి రంగనాయక మండపంలోకి చేరుకున్నారు. క్యూలో భక్తులు వేచి ఉండడంతో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని శ్రీవారి దర్శనానికి అధికారులు అనుమతించారు. దీనిపై భక్తులు హర్షం వ్యక్తంచేశారు. గరుడ వాహనంపై కొలువుతీరిన మలయప్ప స్వామి వారిని దర్శించుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సప్త గోప్రదక్షిణ మందిరం ప్రారంభం గో ప్రదక్షిణ మందిరాన్ని ప్రారంభించిన తర్వాత గోవుకు గ్రాసం తినిపిస్తున్న సీఎం తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిర సముదాయాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. గో సంరక్షణకు పెద్దపీట వేస్తూ గోవిందుని, గోవు విశిష్టతను తెలియజేస్తూ సకల దేవతా స్వరూపిణిగా భావిస్తున్న గోమాతను దర్శించుకుని, తరువాత శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈ మందిరాన్ని నిర్మించారు. చెన్నైకి చెందిన దాత శేఖర్‌రెడ్డి అందించిన రూ.15 కోట్ల విరాళంతో టీటీడీ దీనిని నిర్మించింది. నడకదారిలోనూ, వాహనాల్లోనూ తిరుమలకు వెళ్లే భక్తులకు అనువుగా ఉండేచోట ఈ మందిరాన్ని ఏర్పాటుచేశారు. కనుమరుగవుతున్న భారతీయ స్వదేశీ గోజాతులు, వాటి ఔన్నత్యాన్ని దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా తెలియజేసే విధంగా గోవిజ్ఞాన కేంద్రాన్నీ ఏర్పాటుచేశారు. పూజకు సంబంధించిన వివిధ జాతుల గోవులను గోసదన్‌లో ఉంచారు. వాటి ఆలనాపాలనా చూసేందుకు వీలుగా గోసదన్ నిర్మించారు. గోప్రదక్షిణ మందిరాన్ని ప్రారంభించిన జగన్ గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చిగడ్డిని తినిపించి నమస్కరించారు. ఇక్కడ ఏడు కొండలకు సూచికగా ఏడు గోవులు, వాటి దూడల నడుమ శ్రీవేణుగోపాలస్వామి విగ్రహం ఏర్పాటుచేశారు. గోదర్శనం, గోపూజ, గ్రహశాంతి నివారణ పూజలు నిర్వహిస్తారు. భక్తులు వారు ఎంపిక చేసుకున్న గోవు బరువును బట్టి ద్రవ్యం, గ్రాసంగానీ తులాభారం ద్వారా దానంగా సమర్పించే అవకాశం కల్పించారు. -
ముగిసిన సీఎం జగన్ రెండు రోజుల తిరుమల పర్యటన
సాక్షి, తిరుపతి: రెండు రోజుల తిరుమల పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు మహా ద్వారం వద్ద టీటీడీ చైర్మన్, ఈఓలు స్వాగతం పలికారు. సీఎం జగన్ శ్రీవారి ధ్వజ స్తంభాన్ని నమస్కరిస్తూ ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి బియ్యంతో తులాభారం మొక్కులు సమర్పించారు. సీఎం జగన్‌కు అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్ధప్రసాదాలను అందచేశారు. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం జగన్.. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు సంబంధించి.. కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభించారు. సీఎం జగన్ వెంట మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, నారాయణ స్వామి, అనీల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యేలు ఉన్నారు. చదవండి: బడితోనే అమ్మఒడి బూందీ పోటును ప్రారంభించిన సీఎం జగన్ తిరుమలలో రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించిన బూందీపోటు భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అటు తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నమయ్య భవన్లో రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ సమక్షంలో టీటీడీ, రైతు సాధికార సంస్థ మధ్య ఎంవోయూ కుదిరింది. అనంతరం శ్రీ పద్మావతి అతిధి గృహం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు సీఎం జగన్. చదవండి: దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ -
సర్వభూపాల వాహనంపై సర్వాంతర్యామి
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కాళీయమర్ధనుడి అలంకారంలో సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి శ్రీరాజమన్నార్ అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహన సేవలలో పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వాములు, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి దంపతులు, ఇతర అధికారులు, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన సోమవారం ఉదయం 9 గంటలకు మోహినీ అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీమలయప్ప స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీనివాసుడికి గోదాదేవి మాలలు.. చెన్నై నుంచి గొడుగులు తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి మాలలు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి. తొలుత పెద్దజీయర్ మఠంలో ప్రత్యేక పూజల అనంతరం వీటిని ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. శ్రీవిల్లి పుత్తూరు ఆలయంలో గోదాదేవికి అలంకరించిన మాలలను సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గరుడవాహన సేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే, నేటి గరుడవాహన సేవలో స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి ట్రస్టుఆధ్వర్యంలో చెన్నై నుండి 9 గొడుగులను ఆదివారం తిరుమలకు తీసుకొచ్చారు. సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్జీ వీటిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డిలకుఅందజేశారు. -
నేడు తిరుమలకు సీఎం జగన్
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి/ సాక్షి ప్రతినిధి, విజయవాడ: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమ, మంగళవారాల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం సీఎం జగన్.. ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలివి.. ► మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుమలకు పయనం ► 3 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరిక ► అక్కడి నుంచి తిరుపతి బర్డ్ ఆస్పత్రికి చేరుకుని.. అక్కడ నిర్మించిన శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ► అనంతరం అలిపిరి వద్దకు చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు.. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు. ► మంగళవారం ఉదయం 5.30 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకుని గొల్ల మండపాన్ని సందర్శిస్తారు. ► అక్కడ శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు సంబంధించి.. కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించి.. అన్నమయ్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. ► అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తిరుగుపయనమవుతారు. ఉదయం 11.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. రేపు దుర్గమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12న మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చే దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఏర్పాట్లపై దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణీమోహన్ ఆదివారంఈవో కార్యాలయంలో దేవదాయ, పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ.. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో సీఎం.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఆలయానికి వస్తారని తెలిపారు. ఏర్పాట్లను సమీక్షిస్తున్న దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అంతరాలయంలోకి తీసుకెళ్తామని, అక్కడ అమ్మవారికి సీఎం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం వేద ఆశీర్వచనంతో పాటు, తీర్థప్రసాదాలు అందజేస్తామని వివరించారు. అమ్మవారి ప్రాశస్త్యాన్ని తెలిపే ఆగమెంటెడ్ రియాల్టీ షోను కూడా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. సమావేశంలో ఆలయ ఈవో భ్రమరాంబ, ఏసీపీ హనుమంతరావు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రకుమార్, రీజనల్ జాయింట్ కమిషనర్ సాగర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: విద్యుత్ ధగధగలతో మెరిసిపోతున్న తిరుమల
-
TTD: ఈనెల 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
-
TTD: ఈనెల 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
చిత్తూరు: తిరుమల తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి 15 వరకు జరుగుతాయని టీటీడీ అధికారులు తెలిపారు. కోవిడ్ కారణంగా ఈసారి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే జరుగుతాయని అధికారులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ అలిపిరి వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరంను ప్రారంభించనున్నారు. పాత బర్డ్ హాస్పిటల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలానే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ కన్నడ, హిందీ భాషలలో ప్రారంభించనున్నారు. తిరుమలలో స్వామివారి ప్రసాదాల తయారీకి నూతనంగా నిర్మించిన బూందీ పోటు నిర్మాణాన్ని కూడా ప్రారంభించనున్నారు. చదవండి: తిరుపతి వెంకన్నస్వామికి గద్వాల ఏరువాడ పంచెలు రెడీ -
సూర్య, చంద్రప్రభలపై సప్తగిరీశుడు
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సూర్య, చంద్రప్రభ వాహనాలపై విహరించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు శంఖు, చక్రం, గద, అభయహస్తం ధరించి చతుర్భుజ కేశవమూర్తి అలంకారంలో దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్యప్రాప్తి సూర్యుడు ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుణ్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్ప స్వామివారు అనుగ్రహించారు. వాహనసేవల్లో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి, డాక్టర్ నిశ్చిత, శివకుమార్, శేఖర్‌రెడ్డి, గోవిందహరి, డీపీ అనంత, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పాల్గొన్నారు. నేడు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబర్ 26 ఉదయం 11.00 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం హైదరాబాద్‌కు చెందిన దండు అనిల్‌కుమార్ రూ.10 లక్షలు శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు విరాళంగా అందించారు. -
శ్రీవారి సేవలో
-
ఏకాంతంగా దేవదేవుడి గరుడోత్సవం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు బుధవారం రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్ప స్వామి తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. పంచెకట్టు, తిరునామంతో సంప్రదాయబద్ధంగా అందజేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ► న్యూఢిల్లీ నుంచి నేరుగా సాయంత్రం 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం.. రోడ్డు మార్గాన తిరుమల పద్మావతి అతిథి గృహం చేరుకున్నారు. అక్కడ టీటీడీ చైర్మన్, అధికారులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకు స్వాగతం పలికారు. ► అనంతరం అన్నమయ్య భవన్ చేరుకుని ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అక్కడి నుంచి బేడి ఆంజనేయస్వామి ఆలయం చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు పరివట్టంతో తలపాగా చుట్టి పట్టువస్త్రాల పళ్లెంను సీఎం తలపై పెట్టారు. ► వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ 6.23 గంటలకు ఆలయం లోపలికి చేరుకుని, అర్చకులకు పట్టు వస్త్రాలు అందజేసి, శ్రీవారిని దర్శించుకున్నారు. ► అనంతరం వకుళామాత దేవిని, ఆలయ ప్రదక్షిణగా విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభానికి నమస్కరించారు. హుండీలో కానుకలు చెల్లించి, రంగనాయక మండపం చేరుకున్నారు. టీటీడీ 2021 డైరీని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ► వేద ఆశీర్వచనం అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి స్వామివారి చిత్రపటంతోపాటు, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కల్యాణ మండపం వద్ద ఏకాంతంగా సాగిన గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. కాగా, సీఎం హోదాలో వైఎస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఇది రెండోసారి. ► టీటీడీ ముద్రించిన 2021 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను సీఎం జగన్ ఆలయంలో ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు, టేబుల్ టాప్ క్యాలెండర్లు 75 వేలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది. ఇవి సెప్టెంబర్ 28వ తేదీ నుంచి తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ రెండో వారం నుంచి ఇతర ప్రాంతాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు. ► సీఎం వైఎస్ జగన్ బుధవారం రాత్రి తిరుమలలోనే బసచేస్తారు. గురువారం ఉదయం మరోమారు శ్రీవారిని దర్శించుకుంటారు. నాద నీరాజనం వేదికపై నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర చారిటీస్ సత్రాల శంకుస్థాపనలో పాల్గొంటారు. -
బ్రహ్మోత్సవాలపై ఉన్నతస్థాయి సమావేశం
తిరుమల: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఉన్నత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ సిద్ధార్థ సింగ్, ఎస్పీ విజయలక్ష్మీ, ఆలయ ఈవో, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అక్టోబర్ 3 నుంచి 11 వరకు స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అక్టోబర్ 2న అంకురార్పణ, 3న ధ్వజారోహణం, 7న గరుడసేవ, 8న స్వర్ణ రథం, 10న రథోత్సవం, 11న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు అత్యధికంగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 27న కోయల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగుతుందని ఈవో సాంబశివరావు వెల్లడించారు. -
అక్టోబర్ 2 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల: తిరుమలలో అక్టోబర్ 2 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అక్టోబర్ 2న అంకురార్పణ, 3న ధ్వజారోహణం, 7న గరుడసేవ, 8న స్వర్ణ రథం, 10న రథోత్సవం, 11న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. బుధవారం సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ జేఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు అత్యధికంగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 27న కోయల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగుతుందని జేఈవో వెల్లడించారు. -
ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు