అక్టోబర్ 2 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు | Salakatla brahmotsavams to be started from Oct 2 | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 2 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Published Wed, Jul 27 2016 6:56 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

Salakatla brahmotsavams to be started from Oct 2

తిరుమల: తిరుమలలో అక్టోబర్ 2 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అక్టోబర్ 2న అంకురార్పణ,  3న ధ్వజారోహణం, 7న గరుడసేవ, 8న స్వర్ణ రథం, 10న రథోత్సవం, 11న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. బుధవారం సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ జేఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు అత్యధికంగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 27న కోయల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగుతుందని జేఈవో వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement