TTD JEO
-
టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ
సాక్షి, అమరావతి : టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ అయ్యారు. శ్రీనివాసరాజును సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో టీటీడీ జేఈవోగా బసంత్‌కుమార్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని బసంత్‌కుమార్‌ను ఆదేశించింది. కాగా, బసంత్‌కుమార్ ప్రస్తుతం వీఎంఆర్డీఏ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. -
తిరుమల జేఈఓగా బసంత్ కుమార్‌కు భాద్యతలు
-
నల్ల బ్యాడ్జీలతో రావొద్దు: టీటీడీ జేఈఓ
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనంలో టైంస్లాట్ కోటా విధింపు విధానం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. టీటీడీ జేఈఓ శ్రీనివాస రాజు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... శనివారం, ఆదివారల్లో 30 వేల టోకన్లు, సోమ, శుక్రవాల్లో 20 వేలు, మంగళ, బుధ, గురువారల్లో 17 వేల టోకన్లు కేటాయింపు జరిగిందని జేఈఓ తెలిపారు. ఈ నిబంధనలు రేపు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని, భక్తులు టైంస్లాట్ కౌంటర్లు సౌకర్యాలు సులభంగా పొందేందుకు ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఆయన సూచించారు. టీటీడీ ఉద్యోగులు ఆలయం లోపల నిరసనలు తెలపకుండా ఆంక్షలు విధించారు. స్వామి వారి అభరణాల్లో కొన్ని కనిపించకుండా పోయాయని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు నేపథ్యంలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ టీటీడీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దీనిపై భక్తుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఆలయ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఆలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపరాదంటూ జేఈఓ శ్రీనివాస రాజు ఆదేశాలు జారీ చేశారు. -
అక్టోబర్ 2 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల: తిరుమలలో అక్టోబర్ 2 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అక్టోబర్ 2న అంకురార్పణ, 3న ధ్వజారోహణం, 7న గరుడసేవ, 8న స్వర్ణ రథం, 10న రథోత్సవం, 11న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. బుధవారం సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ జేఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు అత్యధికంగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 27న కోయల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగుతుందని జేఈవో వెల్లడించారు. -
'ఆగస్టు 7 నాటికి శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తి'
విజయవాడ : కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో భక్తులు శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. అందుకోసం గురువారం పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆగస్టు 7వ తేదీ నాటికి ఈ నమూనా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. -
పద్మావతీ పరిణయోత్సవం ఏర్పాట్ల పరిశీలన
తిరుమల: తిరుమలలో మే 16వ తేదీ నుంచి నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతీ పరిణయోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో పరిణయోత్సవం ఏర్పాట్లను శనివారం జేఈవో కె.శ్రీనివాసరాజు పరిశీలించారు. అలాగే శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూలో వెలుపలకు వచ్చారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలసి జేఈవో తనిఖీలు నిర్వహించారు. భక్తుల సత్వర దర్శనానికి వీలుగా ఆయన పలు సూచనలు చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న రికార్డు స్థాయి భక్తులు
-
శ్రీవారిని దర్శించుకున్న లక్షా 700 మంది భక్తులు
తిరుమల: తిరుమలలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని శనివారం ఒక్క రోజు లక్షా 700 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆదివారం తిరుమలలో శ్రీనివాసరాజు మాట్లాడుతూ... శ్రీవారిని ఒక్క రోజులో ఇంతమంది భక్తులు దర్శించుకోవడం ఇటీవల కాలంలో ఇదే ప్రధమం అని ఆయన అన్నారు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. రద్దీ నేపథ్యంలో ప్రోటోకాల్ పరిధిలోని వారికే మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్లు వివరించారు. లడ్డూల తయారీ 1.50 లక్షల నుంచి 3.50 లక్షలకు పెంచామని శ్రీనివాసరాజు న్నారు. అయితే తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులతో అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. దేవుని దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్ల వెలుపల బారులు తీరారు. -
ప్రసాదం పంపిణీకి కొత్త సాప్ట్వేర్
-
ముందు వచ్చిన ఎమ్మెల్యేలకే వెంకన్న దర్శనం
తిరుమల: వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు బుధవారం తిరుమలలో వెల్లడించారు. ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే మంత్రులు, ఎంపీలు, ఇతర వీఐపీలకు గదులు కేటాయించినట్లు తెలిపారు. అయితే వెంకన్నను దర్శించుకునేందుకు మొదట వచ్చే ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎంబీసీ, కౌస్తభం, టీబీ సెంటర్ కేంద్రాలను మూసివేస్తన్నట్లు చెప్పారు. కానీ సామాన్య భక్తుల కోసం సీఆర్ఓ కేంద్రం మాత్రం తెరచి ఉంటుందన్నారు. వారికి అక్కడ గదులు దొరకకపోతే షెల్టర్స్‌లో సదుపాయం కల్పిస్తామన్నారు. జనవరి 2వ తేదీ ద్వాదశి రోజు దర్శనం కోసం ఆన్లైన్లో 10 వేల టికెట్లు విక్రయానికి పెట్టినట్లు శ్రీనివాసరాజు పేర్కొన్నారు. జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం వచ్చింది. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ నేపథ్యంలో భక్తులు,వీఐపీలు శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తిరుమలకు వస్తారు. దాంతో వారికి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.