
టీటీడీ జేఈఓ శ్రీనివాస రాజు (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ అయ్యారు. శ్రీనివాసరాజును సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో టీటీడీ జేఈవోగా బసంత్‌కుమార్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని బసంత్‌కుమార్‌ను ఆదేశించింది. కాగా, బసంత్‌కుమార్ ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ వైస్ చైర్మన్‌గా ఉన్నారు.