srinivasa raju
-
కర్ణాటకలో అసంబద్ధ నాటకం!
పార్టీ అధ్యక్ష స్థానం నుంచి రాహుల్ గాంధీ నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీ తన చరిత్రలో ఎన్నడూ లేనంత దుస్థితిలో కొట్టుమిట్టులాడుతుంటే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అన్ని పరిణామాలకు తాము అతీతంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నారు. డజనుకుపైగా పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి ఫిరాయింపుల జూదంలో మునిగితేలుతుండటంతో సంకీర్ణ ప్రభుత్వ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ దుస్థితి పట్ల బాధలేదు. పశ్చాత్తాపం లేదు. ఇప్పుడేం చేయాలి అనే ఆందోళన లేదు. ఎవరెలా చస్తే మాకేం అన్న చందాన ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. రాహుల్‌కి నమ్మినబంటులా వ్యవహరిస్తూవచ్చిన మాజీ సీఎం సిద్ధరామయ్య అనుయాయులే తిరుగుబాటు ప్రకటించడంతో బీజేపీ తదనంతర వారసుడిగా తాను రంగలోకి రానున్నారా అనే అనుమానాలు ప్రబలమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిని అస్తవ్యస్థత అనే ఒకే ఒక్క పదంతో వర్ణించవచ్చు. గాంధీల కుటుంబానికి చెందిన నాల్గవ తరం అధినేత ఏకంగా పార్టీ అధ్యక్ష పదవికే రాజీనామా సమర్పించి, తాను పార్టీలో ఒంటరినయ్యాను అని చేతులెత్తేశారు. తన రాజీనామా నిర్ణయానికి తిరుగులేదని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవి కంటే రాహుల్ తదుపరి చర్య ఏమిటన్నది ఇంకా స్పష్టం కాలేదు. కాగా ఇటీవలి దశాబ్దాలలో కాంగ్రెస్ పార్టీ అదృష్ట చిహ్నంగా ఉంటూ వచ్చిన మన్మోహన్ సింగ్ తాను మరోసారి రాజ్యసభకు ఎన్నిక అవుతానా అన్నది అర్థం కాని స్థితిలో పడిపోయారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇంతటి దుస్థితిలో కొట్టుమిట్టులాడుతుంటే, కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అన్ని పరిణామాలకు తాము అతీతంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నారు. ఒకవైపు డజనుకుపైగా పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి ఫిరాయింపుల జూదంలో మునిగితేలుతుండటంతో సంకీర్ణ ప్రభుత్వ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు చీమకుట్టినట్లుగా కూడా లేదు. ఒకవైపు ఐఎమ్ఎ కుంభకోణం పేరిట పాంజీ స్కీమ్ వేలాదిమంది పేద, మధ్యతరగతి ముస్లింలు తమ జీవితకాలం దాచుకున్న పొదుపు మొత్తాలను ఎగరేసుకుపోయింది. కానీ సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు ఇటీవల నిర్వహించిన ఒక ఈవెంటులో పై కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు ఆరోపణలకు గురైన పార్టీ సహచరులు హాజరై పండుగ చేసుకుంటున్న వార్తలు పత్రికలకెక్కాయి. పార్టీ అస్తిత్వమే సంక్షోభంలో పడిన ప్రస్తుత సందర్భంలోనూ కొందరు ఎమ్మెల్యేలు తమ రాజకీయ అవకాశవాదాన్నే పరమావధిగా భావించి తమ దారి తాము చూసుకోవడం గమనార్హం. ఇన్ని గందరగోళాల మధ్య, జావకారిపోయిన పార్టీని పునర్మిర్మాణం చేయడం ఎలా అనే మీమాంస ఎవరికీ ఉన్నట్లు లేదు. పార్టీలో సంక్షోభం, ఐఎమ్ఏ స్కామ్ నేపథ్యంలో ప్రజల్లో ఆగ్రహావేశం వంటివేవీ కర్ణాటక కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదు. అప్రతిష్టాత్మకమైన ఈవెం ట్లలో మునిగితేలుతూ ఫోటో పోజులకు దిగుతూ, సెలబ్రిటీలతో ట్వీట్లు పంచుకుంటూ ఆ పార్టీ నేతలు పొద్దుపుచ్చుతున్నారు. పార్టీ దుస్థితి పట్ల బాధలేదు. పశ్చాత్తాపం లేదు. ఇప్పుడేం చేయాలి అనే ఆందోళన లేదు. ఎవరెలా చస్తే మాకేం అన్న చందాన ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. జూలై 3న పార్టీకి రాసిన ఉత్తరంలో బహుశా రాహుల్ గాంధీ కీలక సమయాల్లో ‘తాను ఒంటరినయి’నట్లు చెప్పినదానికి అర్థం ఇదేనేమో? పైగా కాంగ్రెస్ పనితీరు మౌలికంగానే పరివర్తన చెందాల్సిన అవసరముందని, రాహుల్ స్పష్టం చేశారు కూడా. కానీ వాస్తవానికి గడచిన దశాబ్దాలుగా కాంగ్రెస్ ఇలాగే కొనసాగుతోంది. యుద్ధం చేయడాన్ని, సమరంలో గెలుపొందడాన్ని కాంగ్రెస్ సేనలు మర్చిపోయాయి. ఈ దయనీయ నేపథ్యంలోనే కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని మనం పరిశీలించాల్సి ఉంది. డజనుకుపైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడి పార్టీనుంచి నిష్క్రమించనున్నారు. లేక ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుని మంచి స్థితికోసం బేరసారాలకు పాల్పడుతున్నారు. అంతే తప్ప, ఒక సంవత్సర కాలంలోనే సంకీర్ణ ప్రభుత్వం వందోసారి సంక్షోభంలో కూరుకుపోవడం పట్ల వీరెవరికీ ఎలాంటి ఆందోళనా కలగడం లేదు. కానీ కర్ణాటకలో కాని దేశవ్యాప్తంగా కానీ కాంగ్రెస్ పరిస్థితి ఇంతకంటే భిన్నంగా మాత్రం లేదు. ప్రజలు ఇలాంటి వారిని, వీరి సిగ్గుమాలిన రాజకీయాలను చూస్తున్నారు. కానీ ప్రజల మనోభావాలను వీరు మాత్రం అర్థం చేసుకోవడం లేదు. ఇలాంటి కారణాలవల్లే రాష్ట్రంలో పార్టీ అధికారానికి దూరమై జనతాదళ (సెక్యులర్) సంకీర్ణ ప్రభుత్వానికి తావివ్వాల్సి వచ్చిందని, అది కూడా దారుణమైన అస్థిరత్వంతో కొనసాగుతోందని చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి కూడా. రెండు పార్టీలకు మద్దతిస్తున్న ప్రజలు పరస్పరం అతివ్యాప్తమయ్యారు కాబట్టి వీరు కలిసి ఉండలేరనే వాదన కూడా ఉంది. ఇది నిజమే కావచ్చు. కానీ ప్రత్యేకించి పాత మైసూరు, దక్షిణ కర్ణాటక జిల్లాల్లో బలీయంగా ఉన్న భూస్వామ్య రాజకీయాలు, అధికార దాహం, ప్రాదేశిక నియంత్రణ, వ్యక్తిగత దురాశలు ఈ అస్తవ్యస్తతకు కారణమని కూడా కొందరి వాదన. ఒక విషయంలో మనం నిజాయితీగా ఉందాం. సిద్ధరామయ్య వంటి అగ్రనేతలు కాంగ్రెస్ ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే పోరాడుతున్నారని నమ్మవచ్చా? సిద్ధరామయ్య వంటి వ్యక్తులు దేవేగౌడ కుటుంబ నిరంకుశత్వానికి, అవమానాలకు గురై వ్యక్తిగతంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే సిద్ధరామయ్య ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా సిద్ధపడతారు తప్పితే కొద్దిమంది ఎమ్మెల్యేలను మాత్రమే కలిగిన గౌడ కుటుంబ సభ్యుడొకరు తనపై బాస్ లాగా పెత్తనం చలాయించడానికి అసలు ఒప్పుకోరు. అందుకే తాజా సంక్షోభంలో సిద్ధరామయ్య అనుయాయులే తిరుగుబాటు పక్షంలో చేరిపోవడం చూస్తే ఆశ్చర్యమనిపించదు. పైగా తమ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే తప్ప హెచ్ డి కుమారస్వామి కానేకాదని ఈ ఎమ్మెల్యేలు చాలాసార్లు బహిరంగంగానే ప్రకటించడం కూడా ఆశ్చర్యం కలిగించదు. కానీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి అర్థం కానిదల్లా ఏమిటంటే, మెజారిటీ మద్దతును కూడగట్టడంలో తాను విఫలమైనందుకే చివరకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది అన్నదే. అయిదేళ్ల తన పదవీకాలంలోనూ ఇదే ప్రతిబింబించింది. చివరకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 పార్లమెంటు ఎన్నికల్లో తన చేతకానితనమే పార్టీ కొంప ముంచింది. అయితే వ్యూహరచనలో తనదే పైచేయి కాబట్టి ఈ పరాజయ బాధ్యతను ఆయన ఎన్నటికీ గుర్తించరు. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణాన్ని ప్రతిఘటించాలంటే మరింత గౌరవనీయ మార్గాలున్నాయి. కానీ రాష్ట్రంలో పార్టీ విధ్వంసానికి సిద్ధరామయ్యే కారణమని మీడియాలో వార్తలొస్తున్నాయి. దురదృష్టవశాత్తూ వాస్తవం ఎలా ఉన్నప్పటికీ ఆయన వారసత్వం మొత్తంగా ఇలాగే ఉంటోందన్నంత అపకీర్తి మాత్రం మిగిలింది. గడచిన దశాబ్దాలలో ఆయన మృదు స్వభావం, ప్రగతిశీల సంభాషణలు ఒక ముసుగుగా మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి ప్రస్తుత పరిస్థితిలో ఆయన తన పార్టీకి సహాయకారిగా లేరనే అర్థాన్ని కల్పిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాన్ని బలహీనపరిచే మరొక అంశం కూడా ఇక్కడ తోడైంది. 2013లో తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి ఏకైక కారకుడు రాహుల్ గాంధీయే అని సిద్ధరామయ్య ప్రగాఢ నమ్మకం. సోనియాగాంధీ ఏఐసీసీ ప్రెసిడెంటుగా ఉంటుండగా సీఎం కుర్చీకి చాలా పోటీ ఉన్నప్పుడు రాహుల్ తనవైపే మొగ్గు చూపారని ఆయన నమ్మిక. అయితే ఇప్పుడు రాహుల్ ఢిల్లీకి దూరమైపోయారు కాబట్టి సీజనల్ రాజకీయనేత అయిన సిద్ధరామయ్య వెంటనే తన విశ్వాసాన్ని మార్చుకుని తనకు మరింత ప్రాధాన్యత లభించే చోటుకోసం వెతుక్కుంటున్న్టట్లు కనిపిస్తోంది. తాను సేవలిందించే పార్టీపైనే తిరుగుబాటు చేసే సుదీర్ఘ చరిత్ర సిద్ధరామయ్యకు ఉందని చాలామందికి తెలీదు. అయితే కాంగ్రెస్ పతనానికి సిద్ధరామయ్య మాత్రమే కారకులని నిందించలేం. సీనియర్ కాంగ్రెస్ నేతలు చాలామంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల వలే పనిచేస్తూవచ్చారు. గత నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ చరిత్రను పరిశీలిస్తే 1983లో రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి నేటివరకు కాంగ్రెస్ వృద్ధిబాట పట్టలేకపోయింది. దాని సగటు వోటు వాటా 30.49 శాతం వద్దే నిలిచిపోయింది. జనతా పరివార్ కావచ్చు, సంఘ్ పరివార్ కావచ్చు వాటిలో చీలికలు వచ్చి బలహీనపడినప్పుడు మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. 1989లో వీరేంద్రపాటిల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొద్ది కాలం మినహాయిస్తే, ఇతర ఏ కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలు కూడా సానుకూల ఓటుతో వచ్చినవి కాదు. అధికారం నిలుపుకోవడానికి ఒక కొత్త ఆలోచనవైపు కానీ, ఒక కొత్త సామాజిక బృందం వైపు కానీ కాంగ్రెస్ నేతలు ఎన్నడూ నడిచిన పాపాన పోలేదు. ప్రస్తుత నేపథ్యంలో బీజేపీ ఏం చేయాలనుకుంటోందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వారు అధికారంపై మాత్రమే దృష్టి పెట్టడంలేదు. బీఎస్ ఎడ్యూరప్పను మళ్లీ సీఎంగా నిలుపడానికి వారు ఏమాత్రం తొందరపడలేదు. ఆయన తదనంతర వారసుడికోసం తగిన మార్గాలకోసం వారు అన్వేషిస్తున్నారు. సిద్ధరామయ్య వంటివారు తమ పార్టీలోకి రావడం ఖరారైతే నూతన నాయకత్వానికి పట్టం కట్టడం కూడా వారు ఎడ్యూరప్ప ద్వారానే చేస్తారు కూడా. బీజేపీ నిజమైన ఉద్దేశం దక్షిణ కర్ణాటకలో బలంగా పాదుకోవడమే. ఉత్తర కర్ణాటకనుంచి ఒక లింగాయత్‌ను పదే పదే నాయకుడిగా నిలుపడం ద్వారా బీజేపీ అలసిపోయినట్లుంది. ఇప్పుడు వొక్కళిగ కమ్యూనిటీ నుంచి నాయకత్వాన్ని రూపొం దించడం దాని లక్ష్యం. అందుకేవారు కాంగ్రెస్ విస్మృత నేత ఎస్ఎమ్ కృష్ణను వారు తమలో చేర్చుకున్నారు. ఈ ప్రాంతంలో ఆయన అస్తిత్వ రాజకీయాలకు బలమైన చిహ్నంగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ రీజియన్‌లో తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వారికి చాలా ప్రోత్సాహకరంగా మారాయి. మొత్తంమీద చూస్తే రాజకీయంగా కర్ణాటకలో బీజేపీ భవిష్యత్తు మాత్రం నిరాశా నిస్పృహలతో కొనసాగదన్నది వాస్తవం. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, రచయిత సుగత శ్రీనివాసరాజు -
‘చైనా తరువాత మనదేశమే’
సాక్షి, విజయవాడ : ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజల ఆశలు నెరవేర్చేలా ఉదని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు అన్నారు. 2019-20 బడ్జెట్ 25 లక్షల కోట్లు దాటిందని రానున్న ఐదేళ్లలో అది 50 లక్షల కోట్లకు చేరుతుందని అంచనావేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భారత్ గొప్ప ఆర్ధిక శక్తిగా ఎదగనుంది. తాజా బడ్జెట్లో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత ఇచ్చారు. 6 లక్షల గ్రామాలకు జలశక్తి యోజనా పథకం ద్వారా తాగునీరు అందించనున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి ఉపాధి చూపే విధంగా బడ్జెట్ ఉంది. చైనా తరువాత భారతే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ముందుకు సాగుతోంది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి వివిధ రంగాల్లో సుమారు రూ.35 వేల కోట్లు కేటాయింపులు జరిగాయి. తెలంగాణకు రూ.20 వేల కోట్లు కేటాయింపులు జరిగాయి. 2030 నాటికి విద్యుత్ వాహనాల వినియోగం పెరిగేలా బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించారు’ అన్నారు. -
టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ
సాక్షి, అమరావతి : టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ అయ్యారు. శ్రీనివాసరాజును సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో టీటీడీ జేఈవోగా బసంత్‌కుమార్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని బసంత్‌కుమార్‌ను ఆదేశించింది. కాగా, బసంత్‌కుమార్ ప్రస్తుతం వీఎంఆర్డీఏ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. -
కొండపై రాజకీయం
సాక్షి, తిరుపతి/తిరుమల: టీటీడీ పాలకమండలి సభ్యుల పాచిక పారలేదు. పది మందికి తాత్కాలిక ఉద్యోగాలు ఇప్పించడం, కాంట్రాక్టు పనులు దక్కించుకోవడం కోసం ఏర్పాటు చేస్తున్నారంటూ విమర్శల నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాలకమండలి సమావేశం చివరకు అర్ధంతరంగా ముగిసింది. టీటీడీ ఈవో, జేఈవో సమావేశాన్ని బహిష్కరించడంతో సభ్యుల వ్యూహం బెడిసికొట్టింది. తర్వాత పది నిముషాల్లో చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, సభ్యులు కూడా సమావేశాన్ని ముగించారు. టీటీడీ అధికారుల తీరుకు నిరసనగా పాలకమండలి సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని చైర్మన్ పుట్టా చెప్పారు. తిరుమల జేఈవోపై విమర్శలు గత ప్రభుత్వం హయాంలో నియమించిన టీటీడీ పాలకమండలి సభ్యులు మంగళవారం సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తిరుమల అన్నమయ్య భవన్లో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశం ప్రారంభం కాగానే తిరుమల జేఈవోపై పలువురు బోర్డు సభ్యులు దర్శన టికెట్లకోసం విమర్శలు చేయడంతో రసాభాసగా మారింది. దీంతో జేఈవో శ్రీనివాసరాజు బయటకు వచ్చేశారు. టికెట్ల విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటి విషయాలు జేఈవో పరిధిలోనిది అని బోర్డు సభ్యులకు ఈవో ఎకె సింఘాల్ వివరించారు. అనంతరం సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కూడా బయటకు వచ్చారు. తర్వాత బోర్డు సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి బయటకు వచ్చి తన రాజీనామా లేఖను ఈవోకు ఇచ్చి వెళ్లిపోయారు. మరో పది నిమిషాల తర్వాత బోర్డు చైర్మన్ పుట్టా కూడా సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. కాగా ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు పాలకమండలి కొనసాగుతుందని చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. రాజీనామా చేసే యోచన తమకు లేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే తాము నడుచుకుంటామని తెలిపారు. అంతవరకు టీటీడీ చైర్మన్ పదవిని వదిలే ప్రసక్తే లేదని చెప్పడం గమనార్హం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అప్పుడెందుకు అనుమానం రాలేదు?
సాక్షి, విజయవాడ: ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు నాయుడు ఈవీఎంలు పని చేయడం లేదని నాటకాలు ఆడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి వి. శ్రీనివాసరాజు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఈవీఎంలు గురించి మాట్లాడని చంద్రబాబు పోలింగ్ తర్వాతే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఒకవైపు 130 సీట్లు వస్తాయంటూనే, మరోవైపు ఈవీఎంలు పని చేయలేదని చెబుతున్న చంద్రబాబు.. ఇందులో ఏది నిజమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికలు, నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచినపుడు ఈవీఎంలపై ఎందుకు చంద్రబాబు ఆరోపణలు చేయలేదని నిలదీశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ అని, దాన్ని ఎవరు ప్రభావితం చేయలేరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని శ్రీనివాసరాజు కోరారు. (చదవండి: దురుద్దేశంతోనే ప్రభుత్వ పెద్దల దుష్ప్రచారం) -
నాలుగు భాషల్లో థ్రిల్
లవర్‌బాయ్ ఇమేజ్ ఉన్న సుమంత్ అశ్విన్ ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యారు. ఆయన హీరోగా ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వంలో ఓ భారీ హారర్ థ్రిల్లర్ సినిమా రూపుదిద్దుకోనుంది. జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై ‘గరుడవేగ’ వంటి యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మించిన ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రం ఈ నెల రెండో వారంలో ప్రారంభం కానుంది. శ్రీనివాసరాజు మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సబ్జెక్ట్ ఇది. అందుకే నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఇతర పాత్రల్లో భారీ తారాగణం నటిస్తారు. రీ–రికార్డింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న హారర్ థ్రిల్లర్ ఇది. అందుకే మణిశర్మగారు ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు. హారర్ థ్రిల్లర్స్‌లోనే ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్‌వర్మ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా శ్యామ్‌ప్రసాద్. -
తిరుమలలో ఘనంగా బ్రహ్మోత్సవాలు
-
గరుడునిపై గోవిందుడు
తిరుమల: విశ్వపతి శ్రీవేంకటేశ్వరుడు తన ప్రియ వాహనమైన గరుడునిపై ఊరేగుతూ ఆదివారం భక్తకోటికి సాక్షాత్కరించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. లక్షలాది మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని జగాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. ఉత్కృష్టమైన ఈ గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు అలంకరించారు. గరుడునితో స్వామికి ఉన్న అనుబంధాన్ని ఈ గరుడ వాహన సేవ లోకానికి తెలియజేస్తోంది. అశేష జనవాహిని గోవిందనామ స్మరణతో తిరుమల క్షేత్రం భక్తిభావంతో నిండింది. వాహనసేవ ప్రారంభం నుంచి ముగిసే వరకు వాహనాన్ని అటూఇటూ తిప్పుతూ భక్తులందరూ ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు స్వయం గా పర్యవేక్షించారు. ఇక వీఐపీల పేరుతో అధిక సంఖ్యలో వచ్చిన వారి మధ్య తోపులాట చోటుచేసుకున్నాయి. వారిని అదుపు చేసేందుకు అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందిపడ్డారు. వాహన సేవల ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యా లు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల వేషధారణలు, నగర సంకీర్తనలతో కోలాహలం నిండింది. కాగా మధ్యలో కాసేపు వర్షం పడటంతో ఘటాటోపం నడుమ ఊరేగింపు కొనసాగించారు. భక్తజన సంద్రంగా తిరుమల కొండ.. గరుడ వాహన సేవను వీక్షించేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండలు భక్తజన సంద్రంగా మారాయి. స్వామివారి దర్శనంకోసం ఉదయం నుంచే భక్తులు గ్యాలరీల్లో పడిగాపులు కాశారు. ఉదయం మోహినీ వాహన సేవలో పాల్గొన్న భక్తులు గరుడవాహనసేవ కోసం ఎక్కడికక్కడ నిరీక్షించారు. 2 లక్షల మంది కూర్చునేందుకు సిద్ధం చేసిన గ్యాలరీల్లో భక్తులు కిక్కిరిసి కనిపించారు.గ్యాలరీల్లో భక్తుల మధ్య తోపులాటలు లేకుండా పరిమిత సంఖ్యలోనే అనుమతించేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారు. రోడ్లపై నడిచి మాడ వీధుల్లోకి వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా బారికేడ్లు నిర్మించటంతో భక్తులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. అర్బన్ జిల్లా ఎస్పి అభిషేక్ మొహంతి పటిష్ట భద్రత కల్పించారు. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలు నడిచి వచ్చే భక్తులతో నిండింది. మోహిని అవతారంలో గోవిందుడు.. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు ఆదివారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పాలకడలిని మధించడంలో ఉద్భవించిన అమృతాన్ని రాక్షసుల బారిన పడకుండా కాపాడిన మహావిష్ణువు కలియుగంలో మాయామోహాల బారిన పడకుండా తన శరణాగతిని పొందాలని ఈ మోహిని అవతారం ద్వారా సందేశాన్ని ఇచ్చారు. -
వైఎస్ జగన్ పాదయాత్రలో పాల్గొన్న ఎన్ఆర్ఐ శ్రీనివాసరాజు
-
నల్ల బ్యాడ్జీలతో రావొద్దు: టీటీడీ జేఈఓ
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనంలో టైంస్లాట్ కోటా విధింపు విధానం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. టీటీడీ జేఈఓ శ్రీనివాస రాజు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... శనివారం, ఆదివారల్లో 30 వేల టోకన్లు, సోమ, శుక్రవాల్లో 20 వేలు, మంగళ, బుధ, గురువారల్లో 17 వేల టోకన్లు కేటాయింపు జరిగిందని జేఈఓ తెలిపారు. ఈ నిబంధనలు రేపు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని, భక్తులు టైంస్లాట్ కౌంటర్లు సౌకర్యాలు సులభంగా పొందేందుకు ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఆయన సూచించారు. టీటీడీ ఉద్యోగులు ఆలయం లోపల నిరసనలు తెలపకుండా ఆంక్షలు విధించారు. స్వామి వారి అభరణాల్లో కొన్ని కనిపించకుండా పోయాయని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు నేపథ్యంలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ టీటీడీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దీనిపై భక్తుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఆలయ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఆలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపరాదంటూ జేఈఓ శ్రీనివాస రాజు ఆదేశాలు జారీ చేశారు. -
నమో.. తిరుమలేశా
సాక్షి, తిరుమల: విశ్వపతి వేంకటేశ్వరుడు బుధవారం గరుడునిపై అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు ఆరంభమైన వాహన సేవ అర్ధరాత్రి వరకూ సాగింది. లక్షలాది మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని జగాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. ఈ గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ కాసులమాల.. వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నయ్ నూతన ఛత్రాలు(గొడుగులు) అలంకరించారు. అశేష జనవాహిని గోవిందా.. గోవిందా.. నామస్మరణతో తిరుమల క్షేత్రం భక్తిభావంతో నిండింది. ప్రారంభం నుంచి.. ముగిసే వరకూ వాహనాన్ని అటూ ఇటూ తిప్పుతూ భక్తులందరూ ఉత్సవమూర్తిని దర్శించుకునేలా టీటీడీ ఈవో అనిల్కుమార్సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ఏర్పాట్లు చేశారు. మరోవైపు వాహన సేవల ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల వేషధారణలు, నగర సంకీర్తనలు కోలాహలంతో సాగాయి. గురువారం శ్రీవారి స్వర్ణరథాన్ని (రథరంగ డోలోత్సవం) ఊరేగించనున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఊరేగింపు ప్రారంభంకానుంది. గరుడోత్సవంలో గజరాజు హల్చల్ తిరుపతి మెడికల్: శ్రీవారి గరుడోత్సవంలో గజరాజు హల్చల్ చేసింది. మాడ వీధుల్లో కళాబృందాల ప్రదర్శనలో వాయిద్యాల చప్పుళ్లకు బెదిరిపోయింది. దీంతో ఆలయం ఎదుట ఉన్న గ్యాలరీలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఊహించని పరిణామానికి భక్తులు భయాందోళనలకు గురయ్యారు. సకాలంలో మావటి గజరాజును అదుపుచేయడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. -
27, 30 తేదీల్లో దివ్యదర్శన టోకెన్లు రద్దు
తిరుపతి (అలిపిరి): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కాలి నడకన వచ్చే భక్తులకు జారీచేసే దివ్య దర్శన టోకెన్లను ఈనెల 27, 30 తేదీ ల్లో రద్దు చేస్తున్నట్లు తిరుమల జేఈవో కె.ఎస్. శ్రీనివాసరాజు తెలిపారు. బ్రహ్మోత్సవాల రోజువారీ సమీక్షలో భాగంగా సోమవారం ఆయన కంట్రోల్‌రూంలో ఉన్నతాధికారులతో సమా వేశం నిర్వహించారు. జేఈవో మాట్లా డుతూ.. ఈనెల 27న గరుడ సేవ, 30న పెరటాసి రెండో శనివారం కావ డంతో దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేశామన్నారు. ఈ విషయం కాలినడక భక్తులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. గరుడ సేవకు పటిష్ట ఏర్పాట్లుచేస్తున్నామని చెప్పారు. వాహన సేవలు జరిగే సమ యంలో ప్రముఖ వ్యక్తులు మాట్లాడే అంశాలు భక్తులకు స్పష్టంగా వినప డేలా సాంకేతిక అంశాలను సరిచేసుకో వాలని సంబంధిత విభాగాలకు సూచించారు. టీటీడీ సీవీఎస్వో ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, గరుడ సేవ రోజున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. -
ఆచార్య ఆరెస్ట్
కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతి అరెస్ట్ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? అనే కథతో ‘ఆచార్య అరెస్ట్’ సినిమా రూపొందించనున్నట్లు ‘దండుపాళ్యం’ దర్శకుడు శ్రీనివాసరాజు ప్రకటించారు. ‘యాన్ ఇన్సల్ట్ టు ఎవ్రీ హిందు’ అనేది ఉపశీర్షిక. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రామ్ తుళ్ళూరి నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘2004లో కంచి మఠంలో జరిగిన ఓ భక్తుడి హత్య నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. జయేంద్ర సరస్వతిగారిని కలసి ఆయన వెర్షన్ తీసుకోబోతున్నా’’ అన్నారు. ‘దండుపాళ్యం’కి సీక్వెల్‌గా శ్రీనివాసరాజు తీసిన ‘దండుపాళ్యం–2’ ఈ నెల 14న విడుదల కానుంది. -
అక్టోబర్ ౩ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబరు 3వ తేదీ నుంచి 11వరకు నిర్వహించాలని టీడీడీ నిర్ణయించింది. బుధవారం అన్నమయ్య భవన్లో జేఈవో శ్రీనివాసరాజు అధ్యక్షతన సమావేశమైన అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. -
శ్రీవారిని దర్శించుకున్న రికార్డు స్థాయి భక్తులు
-
శ్రీవారిని దర్శించుకున్న లక్షా 700 మంది భక్తులు
తిరుమల: తిరుమలలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని శనివారం ఒక్క రోజు లక్షా 700 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆదివారం తిరుమలలో శ్రీనివాసరాజు మాట్లాడుతూ... శ్రీవారిని ఒక్క రోజులో ఇంతమంది భక్తులు దర్శించుకోవడం ఇటీవల కాలంలో ఇదే ప్రధమం అని ఆయన అన్నారు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. రద్దీ నేపథ్యంలో ప్రోటోకాల్ పరిధిలోని వారికే మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్లు వివరించారు. లడ్డూల తయారీ 1.50 లక్షల నుంచి 3.50 లక్షలకు పెంచామని శ్రీనివాసరాజు న్నారు. అయితే తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులతో అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. దేవుని దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్ల వెలుపల బారులు తీరారు. -
శ్రీవారి సేవలో సిరిసేన దంపతులు
తిరుమల: శ్రీ లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తన భార్య కుమారితో కలసి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని బుధవారం వేకువజామున సుప్రభాత సేవా సమయంలో దర్శించుకున్నారు. వీరి వెంట శ్రీ లంక కేబినెట్ మంత్రులు పలువురు కూడా ఉన్నారు. వీరికి వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 వద్ద టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు ఆహ్వానం పలికారు. దర్శనానంతరం స్వామి ప్రసాదాలను అందజేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించారు. -
ముందు వచ్చిన ఎమ్మెల్యేలకే వెంకన్న దర్శనం
తిరుమల: వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు బుధవారం తిరుమలలో వెల్లడించారు. ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే మంత్రులు, ఎంపీలు, ఇతర వీఐపీలకు గదులు కేటాయించినట్లు తెలిపారు. అయితే వెంకన్నను దర్శించుకునేందుకు మొదట వచ్చే ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎంబీసీ, కౌస్తభం, టీబీ సెంటర్ కేంద్రాలను మూసివేస్తన్నట్లు చెప్పారు. కానీ సామాన్య భక్తుల కోసం సీఆర్ఓ కేంద్రం మాత్రం తెరచి ఉంటుందన్నారు. వారికి అక్కడ గదులు దొరకకపోతే షెల్టర్స్‌లో సదుపాయం కల్పిస్తామన్నారు. జనవరి 2వ తేదీ ద్వాదశి రోజు దర్శనం కోసం ఆన్లైన్లో 10 వేల టికెట్లు విక్రయానికి పెట్టినట్లు శ్రీనివాసరాజు పేర్కొన్నారు. జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం వచ్చింది. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ నేపథ్యంలో భక్తులు,వీఐపీలు శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తిరుమలకు వస్తారు. దాంతో వారికి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. -
ఇకపై గంటలోపే శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో గంటకు 4200 మంది భక్తులకు తగ్గకుండా అన్ని రకాల దర్శనాలను శాస్త్రీయ పద్ధతిలో అనుమతించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు మంగళవారం తెలిపారు. దీనివల్ల రూ.300 టికెట్లను ఆన్లైన్, ఈ-దర్శన్‌లో టైంస్లాట్‌లో కేటాయించినప్పటికీ అన్ని క్యూలు ఏకకాలంలోనే కొనసాగే వీలుంటుందని చెప్పారు. కంపార్ట్మెంట్ నుంచి వచ్చిన భక్తుడికి గంటలోపే స్వామి దర్శనం లభించేలా ప్రత్యేకంగా ‘కోరమాండల్ ఇన్ఫోటెక్’ సంస్థ ద్వారా సాఫ్ట్వేర్ రూపకల్పన చేశామన్నారు. శ్రావణమాసంలో ఆగస్టు 8, 9, 10వ తేదీలు, తిరిగి 15, 16, 17వ తేదీల్లో వరుస సెలవు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు జేఈవో వెల్లడించారు. ఆ రోజుల్లో ప్రొటోకాల్ వీఐపీలను మాత్రమే అంగీకరించనున్నామన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమలలో మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. వీరికి 24 గంటలు, కాలిబాట మార్గాల్లో వచ్చిన వారికి 8 గంటలు, రూ. 300 టికెట్ల భక్తులకు 6 గంటల తర్వాత దర్శనం లభించనుంది. శ్రీవారి హుండీ ఆదాయం సోమవారం రూ. 3.59 కోట్లు, మంగళవారం కూడా రూ.3.47 కోట్లు లభించింది. సాధారణంగా జూలై నెలలో రూ. 3 కోట్లుపైబడిన సందర్భాలు అరుదు. గిరిజనులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామాలు, తండాలకు చెందిన 250 మంది గిరిజనులు మంగళవారం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కాకినాడలోని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో వచ్చిన వీరిని టీటీడీ ప్రత్యేకంగా సుపథం మార్గం ద్వారా ఆలయానికి తీసుకెళ్లారు. కాగా, తిరుపతిలో వకుళమాత ఆలయం నిర్మించేంతవరకు తాను శ్రీవారిని దర్శించుకోనని పరిపూర్ణానంద మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం ఆలయ సమీపంలోని ఆస్థాన మండపం వరకు మాత్రమే పరిపూర్ణానంద వచ్చి తిరిగి వెళ్లిపోయారు. తిరుమలకు ‘గంగ’ కోటా పెంపు శ్రీవారి భక్తుల దాహార్తి తీర్చేందుకు తెలుగుగంగ నీటి కోటాను పెంచారు. మంగళవారం నుంచి రోజుకు 50 లక్షల లీటర్ల (5 ఎంఎల్డీ) నీరు సరఫరా చేస్తున్నారు. రోజుకు 10 ఎంఎల్డీ (కోటి లీటర్లు) తెలుగుగంగ నీటిని టీటీడీ అవసరాలకు(తిరుమల, తిరుపతికి) తరలించేందుకు ప్రభుత్వం, టీటీడీ మధ్య గతంలో ఒప్పందం కుదిరింది. జలాశయాలు ఎండిపోవటంతో మంగళవారం నుంచి ఆ మేరకు విడుదల చేస్తున్నారు. -
వీడిన మిస్టరీ.. భర్తే హంతకుడు
ఈడూరు (అత్తిలి): అత్తిలి మండలం ఈడూరు గ్రామానికి చెందిన పెన్మెత్స పావని హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తే భార్యను చంపి ఆత్మహత్యగా నమ్మించాడు. మృతురాలు బంధువులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే అత్తిలి మండలం ఈడూరు గ్రామానికి చెందిన వేగేశ్న శ్రీనివాసరాజు కుమార్తె పావని (22)కి, పాలకోడేరు మండలం మోగల్లు గ్రామానికి చెందిన పెన్మెత్స సూర్యనారాయణరాజు కుమారుడు సుబ్రహ్మణ్య కుమార్‌రాజుతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహమయ్యింది. వివాహం అనంతరం ఉద్యోగరీత్యా వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వారితో పాటు సుబ్రహ్మణ్యకుమార్ తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. ఈనెల 24న పావని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు భర్త దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతి కేసుగా పోలీసులు నమోదు చేశారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని స్వగ్రామమైన ఈడూరుకు బుధవారం అర్ధరాత్రి తీసుకువచ్చారు. భార్య మృతదేహాన్ని చూడటానికి వచ్చిన భర్తను మృతురాలి కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయాన్ని బయటపెట్టాడు. భార్యతో గొడవపడి, ఆవేశంలో కొట్టడంతో చనిపోయిందని వివరించాడు. ఇదే విషయాన్ని అతడు మీడియాకూ తెలిపాడు. ఈ ఘటనను ఆత్మహత్యగా మలిచేందుకు తానే ఫ్యాన్‌కు ఉరివేశానని ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు అత్తిలి పోలీసులు సమాచారాన్ని అందజేశారు. అయితే ఇరుకుటుంబాల మధ్య పెద్దలు రాజీకుదిర్చినట్టు తెలిసింది. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
బ్రహ్మోత్సవాలు విజయవంతం
సాక్షి, తిరుమల: ఓ వైపు సమైక్య ఉద్యమ హోరు.. మరో వైపు భక్తుల భక్తి పారవశ్యం..మధ్య అఖిలాండకోటి బ్రహ్మోండ నాయకుని బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగవైభవంగా ముగిశాయి. ఉదయం చక్రస్నానంలో సేద తీరిన శ్రీవారు, రాత్రి ధ్వజావరోహణంలో ఉత్సవాలకు ముగింపు పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సమైక్యాంధ్ర ఉద్యమ సెగలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు సాగాయి. తిరుమలకు వచ్చే భక్తులకు అడుగడుగునా ప్రయాణ కష్టాలు ఎదురయ్యాయి. ఫలితంగా భక్తుల సంఖ్య, హుండీ కానుకలు తగ్గిపోయాయి. వాహన సేవల్లో భక్తులు పలుచగా కనిపించినా గరుడవాహనంలో రెండున్నర లక్షల మంది పాల్గొనడం విశేషం. ఈసారి బ్రహ్మోత్సవాల్లో స్వర్ణరథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ ఎక్కడా హడావిడిగా కనిపించలేదు. టీటీడీ బోర్డు చైర్మన్ బాపిరాజు సాదాసీదాగా వ్యహరించారు. కోలాహలంగా వాహన సేవలు ఈ నెల 5వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమైన ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు అత్యంత వేడుకగా సాగాయి. తొలి రోజు పెద్ద శేషవాహనంతో ప్రారంభమైన ఉత్సవాలు ఆఖరి రోజు తిరిచ్చివాహనంతో ముగిశాయి. జేఈవో శ్రీనివాసరాజు నేతృత్వంలో ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కారు సెల్వం, స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి వాహన సేవల ఊరేగింపుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. తగ్గిన భక్తులు .. హుండీ కానుకలు ఈ సారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిది రోజుల్లో మొత్తం 4లక్షలా 48వేల 416 మంది దర్శించుకున్నారు. ఈ సంఖ్య గతంలో కంటే 5.47 శాతం తగ్గింది. పటిష్ట భద్రత బ్రహ్మోత్సవాల్లో టీటీడీ సీవీఎస్వో జీవీజీ అశోక్‌కుమార్, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, అర్బన్‌జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు, ఏఎస్పీ ఉమామహేశ్వర్ శర్మ, డీఎస్పీ నంజుండప్ప పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు 3 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. సమష్టిగా చైర్మన్, ఈవో, అధికారులు ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు , టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో అశోక్‌కుమార్ నుంచి అటెండర్ స్థాయి వరకు అధికార యంత్రాంగం సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. బోర్డుల సభ్యుల హడావిడి ఏమాత్రం కనిపించలేదు. సభ్యుల్లో ఎల్ఆర్.శివప్రసాద్, లక్ష్మణరావు అన్ని వాహన సేవల్లో పాల్గొన్నారు. హడావిడికి దూరంగా ఈవో టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ గత ఈవోలకు భిన్నంగా తనదైన శైలిలలో కనిపించారు. ఉత్సవాల్లో ఎక్కడా హడావిడికి అవకాశం ఇవ్వలేదు. ఇదే తరహాలోనే జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు కూడా కనిపించారు. చైర్మన్ బాపిరాజు మాత్రం సమైక్యసెగ ఉండడంతో ఈసారి ఉత్సవాల్లో ఎక్కడా సందడి చేయకుండా వాహనసేవలకే పరిమితమయ్యారు. జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్వో జీవీజీ అశోక్‌కుమార్, అదనపు సీవీఎస్వో శివకమార్రెడ్డి, చీఫ్ ఇంజినీరు చంద్రశేఖరరెడ్డి బ్రహ్మోత్సవాలను పర్యవేక్షించా రు. ఆలయ వ్యవహారాల్లో డెప్యూటీ ఈవోలు చిన్నంగారి రమణ, గదుల కేటాయింపుల్లో ఎస్టేట్ ఆఫీసర్ దేవేంద్రరెడ్డి, తిరుమలను పరిశుభ్రంగా ఉంచడంలో హెల్త్ ఆఫీసర్ వెంకట్రమణ నిరంతరం జేఈవోకు అందుబాటులో ఉంటూ పర్యవేక్షించారు. పుష్ప, ఫొటో ప్రదర్శన విద్యుత్ అలంకరణలు భేష్ ఈసారి టీటీడీ ఉద్యానవన ం, విద్యుత్ విభాగాలు పోటీపడి అలంకరణ లు చేశాయి. గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు నేతృత్వంలో 25 టన్నుల పుష్పాలతో ఆలయ మహద్వారం నుంచి గర్భాలయం వరకు సుగంధ పరిమళ భరిత పుష్పాలతో అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక వాహనసేవల్లో కూడా పూల అలంకరణలు ఉత్సవాలకు ఆకర్షణగా నిలిచి భక్తులను మైమరింపించాయి. విద్యుత్ విభాగం ఎస్ఈ వేంకటేశ్వర్లు, డీఈ రవిశంకర్‌రెడ్డి రాత్రీపగలూ తేడా లేకుండా పని చేశారు. పుష్ప ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్లకు భక్తుల నుంచి విశేష సందన లభించింది. -
కేసీఆర్ దురహంకారానికి ఘోరీ కట్టాలి: సతీష్ మాదిగ
హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు దురహంకారానికి ఘోరీ కట్టాలని తెలంగాణ సీమాంధ్ర జేఏసీ నేత సతీష్ మాదిగ అన్నారు. టీఆర్ఎస్ కనుసన్నల్లోనే తెలంగాణ సకల జన భేరీ జరిగిందని తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ అధ్యక్షుడు శ్రీనివాసరాజు చెప్పారు. సీమాంధ్రప్రజలను అవహేళన చేయడం తగదని ఆయన అన్నారు. అహంకారపూరిత ప్రకటనలే తెలంగాణకు అడ్డు అని ఆయన చెప్పారు. -
తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ అధ్యక్షుడు శ్రీనివాసరాజుతో సాక్షి వేదిక
-
కేసీఆర్‌కు జడ్‌ప్లస్ అయితే సీమాంధ్రులకు ఎంత?
-
కేసీఆర్‌కు జడ్‌ప్లస్ అయితే సీమాంధ్రులకు ఎంత?
హైదరాబాద్ నగరంలో ఉండే సీమాంధ్రుల భద్రతపై స్ఫష్టత వచ్చే వరకు విభజన ప్రక్రియ చేపట్టకూడదని తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ అధ్యక్షుడు శ్రీనివాసరాజు యూపీఏ సర్కార్‌ను డిమాండ్ చేశారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలోనే ప్రముఖ నేత అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌కు జెడ్‌ప్లస్ భద్రత కావాలంటే... హైదరాబాద్ నగరంలో నివసించే సీమాంధ్రులకు ఎంత రక్షణ కావాల్సి ఉంటుందని అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 31, సెప్టెంబర్ 1వ తేదీలలో కూకట్‌పల్లిలో దీక్ష చేపట్టనున్నట్లు శ్రీనివాసరాజు వివరించారు.