
అక్టోబర్ ౩ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబరు 3వ తేదీ నుంచి 11వరకు నిర్వహించాలని టీడీడీ నిర్ణయించింది. బుధవారం అన్నమయ్య భవన్‌లో జేఈవో శ్రీనివాసరాజు అధ్యక్షతన సమావేశమైన అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు.