brahmotsava
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
-
పద్మావతీదేవీ పాహిమాం
కలియుగదైవం శ్రీనివాసుని హృదయేశ్వరి శ్రీపద్మావతి అమ్మవారు తిరుచానూరులో కొలువై భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలందుకుంటోంది. స్వామి తరహాలోనే నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలను జరిపించుకుంటూ... నిత్యకల్యాణం... పచ్చనితోరణంలా ఆలయం భాసిల్లుతోంది. ఒకప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరు సన్నిధి వీధిలో అప్పట్లో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించేవారని తెలుస్తోంది. ముందుగా తిరుమల ఆలయంలో ధ్వజారోహణం చేసి, ఆ తరువాత వాహన సేవలను తిరుచానూరు పురవీధుల్లో నిర్వహించేవారట. శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారితో సమానంగా నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని ఏ వైష్ణవాలయాల్లోనూ ఇలా అమ్మవారికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించరు. ఒకప్పుడు తిరుమలగిరులు అరణ్యంతో నిండి ఉండేవి. క్రూరమృగాలు అధికంగా ఉండేవి. దీనికితోడు ఎటువంటి వసతులు లేకపోవడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరులో నిర్వహించేవారని పెద్దలు చెబుతున్నారు. అయితే వెయ్యేళ్లకిందట భగవద్రామానుజాచార్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పుడే శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుమల క్షేత్రంలోనే జరిపించాలని చెప్పడంతో నాటినుంచి తిరుమలలోనే బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం (తమిళ) కార్తిక మాసంలో పంచమి తీర్థం నిర్వహిస్తారు. స్వామివారి నుంచి పసుపు, కుంకుమ, గాజులు త దితర మంగళకర ద్రవ్యాలతో అమ్మవారికి స్వా మివారు సారె పంపడం ఆనవాయితీ. తొమ్మిదవ రోజు పంచమితీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయి. సింహాల మోహన, సాక్షి, తిరుచానూరు బ్రహ్మోత్సవ సేవలు శనివారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమై, రాత్రి 7.30 గంటలకు బ్రహ్మోత్సవాల్లో తొలి వాహనంగా చిన్నశేష వాహనంపై శ్రీ పద్మావతిదేవి విహారం జరిగింది. ►24, ఆదివారం ఉదయం పెద్ద శేష వాహనం, రాత్రి హంసవాహనం ►25, సోమవారం ఉదయం ముత్యపుపందిరి, రాత్రి సింహవాహనం ►26, మంగళవారం ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి హనుమంత వాహనం ►27, బుధవారం ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గజవాహనం ►28, గురువారం ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం స్వర్ణరథోత్సవం, రాత్రి గరుడసేవ ►29, శుక్రవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ ►30, శనివారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం ►డిసెంబరు 1 ఆదివారం పంచమి తీర్థం (చక్రస్నానం), సాయంత్రం ధ్వజావరోహణం -
నేడు పుష్పయాగోత్సవం
నేటితో ముగియనున్న నృసింహుడి బ్రహ్మోత్సవాలు ఖాద్రీ లక్ష్మీ నృసింహుడి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనుండడంతో శ్రీవారి ఆలయ ప్రాంగణంలో పుష్పయాగోత్సవం నిర్వహించనున్నారు. ఆలయంలోని కళ్యాణ మండపంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభుడు భక్తులను ఆశీర్వదిస్తారు. బ్రహ్మోత్సవాలకు నలుదిక్కుల నుంచి విచ్చేసిన ఇంద్రాది అష్ట దిక్పాలకులు, ముక్కోటి దేవతలకు కృతజ్ఞతలతో చందన పుష్ప తాంబూలాలు సమర్పించి, వారిని వారి వారి లోకాలకు సాగనంపుతారు. తొలుత నవ కలశ ప్రతిష్ట, వాస్తు హోమాలు జరిపి, ఆలయ మహా సంప్రోక్షణ గావిస్తారు. శ్రీవారికి నిత్యకైంకర్యములు పూర్తిచేసి, తర్వాత విశేష పూల అలంకరణ, మంగళ హారతులు ఇచ్చి, పుష్పయాగోత్సవం ముగిస్తారు. ఉభయదారులుగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పూల అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, చైర్మన్ నరేంద్రబాబు తెలిపారు. -
కనుల పండువగా శ్రీవారి చక్రస్నానం
పోటెత్తిన భక్త జనం ధ్వజావరోహణం తర్వాత నృసింహాలయం మూసివేత నేటి నుంచి యథావిధి దర్శనం శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీవారి చక్రస్నానం (తీర్థవాది ఉత్సవం) కనుల పండువగా, కోలాహలంగా జరిగింది. యాగశాల నుంచి శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామి వారు విచ్చేసి ఆలయ ప్రాంగణంలో కాసేపు కొలువు దీరారు. అక్కడ వసంతోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు దంపతులు, ఈఓ వెంకటేశ్వరరెడ్డి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఆలయ సిబ్బంది, బందోబస్తులో ఉన్న పోలీసులతో పాటు భక్తులంతా ఆనందోత్సాహాలతో వసంతాలు(రంగులు) చల్లుకున్నారు. అనంతరం శ్రీవారు శ్రీదేవి, భూదేవితో కలిసి తిరువీధుల గుండా దర్శనమిస్తూ భృగుతీర్థం చేరుకున్నారు. అక్కడ భక్తుల గోవింద నామస్మరణ మధ్య శ్రీవారు చక్రస్నానం ఆచరించారు. అనంతరం భక్తులందరూ కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడి నుంచి ఖాద్రీ«శుడు కోనేరు వెలుపలకొచ్చి అక్కడ విశేషాలంకరణ అనంతరం తిరువీధుల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్గిస్తూ తిరిగి ఆలయ ప్రాంగణం చేరుకున్నారు. ధ్వజావరోహణం బ్రహ్మోత్సవాలకు సకల దేవతా మూర్తులను ఆహ్వానించేందుకు అర్చకులు ఆలయం ముందు ప్రారంభం నాడు ధ్వజారోహణం చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు కొత్త వస్త్రాన్ని తెచ్చి శ్రీవారి వాహనమైన గరుడి బొమ్మను చిత్రీకరించారు. దాన్ని గరుడ ధ్వజ పటం అంటారు. కొడితాడు సాయంతో దాన్ని ధ్వజస్తంభం మీద కట్టి పైకి ఎగుర వేశారు. పక్షం రోజుల పాటు గాలిలో ఎగిరిన ఈ గరుడ పతాకమే సకల దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రం. ఈ ఆహ్వానాన్ని అందుకొనే ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసి కదిరి కొండపై నుంచి తిలకిస్తారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. «ధ్వజపటాన్ని శ్రీవారి చక్రస్నానం అనంతరం «అవరోహణం గావించారు. దీంతో ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలికినట్లైందని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఆలయం మూసివేత కల్యాణోత్సవం నాటి నుంచి తీర్థవాది వరకూ స్వామి వారు యాగశాలలోనే గడిపారు. తీర్థవాది ముగించుకొని తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచి రోజంతా ఆలయం తలుపులు మూసేశారు. తిరిగి మంగళవారం ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. ఎప్పటిలాగానే శ్రీవారు ఆలయంలో యథాప్రకారం పూజలందుకొని భక్తులకు దర్శనమిస్తారు. -
నేడు మోహినీ ఉత్సవం
కదిరి: కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి వారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. పూర్వం పాల కడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడతారు. ఆ అమృతాన్ని పంచడానికి శ్రీమహా విష్ణువు మోహినీ అవతారమెత్తారు. దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి అసురులను మభ్యపెట్టేందుకు శ్రీవారు ఈ అవతారాన్ని ధరిస్తారని భక్తుల నమ్మకం. వయ్యారాలు పోసే సోయగాలతో, చంకన అమృత భాండాగారాన్ని పెట్టుకొని సుకుమార వేషంలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి కుచ్చుల వాలుజడ నేటి ఉత్సవంలోని ప్రత్యేకత. ఉభయదారులుగా కోటా వెంకట కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు తెలిపారు. -
శేషవాహనంపై లక్ష్మీ నారసింహుడు
కదిరి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు సోమవారం రాత్రి శేష వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఉత్సవంలో నారసింహుడు మాత్రమే తిరు వీధుల్లో విహరించేవారు. అయితే.. శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవ ప్రత్యేకత. పాలసంద్రంపై శేష తల్పమున పవళించిన శ్రీమహా విష్ణువుకు ఇది ప్రీతి పాత్రమైన అంశం. లక్ష్మీ నారసింహునికి సేవ చేయడానికి సాక్షాత్తూ ఆదిశేషుడే వాహనంగా విచ్చేశారని ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబరాలతో విశేషాలంకరణలో ఉన్న ఖాద్రీశుడు రాత్రి తొమ్మిది గంటలకు శేషవాహనంపై కొలువుదీరారు. ఆలయం ముందు విద్యుద్దీపాలంకరణ పూర్తి కాగానే తిరువీధుల్లో ఊరేగారు. స్వామివారి దివ్య మంగళరూపాన్ని భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందారు. యాగశాల ప్రవేశం, నిత్య హోమం నిర్వహించి స్వామి వారిని సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు. ఆచార్య రుత్వికులను ఆలయ మర్యాదలతో అర్చకులు ఆహ్వానించారు. శేష వాహనంపై ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే నాగదోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. శేష వాహనోత్సవం ఉభయదారులుగా యాదాలం శ్రీనివాసులు, బాలాజీ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు, ఈఓ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. -
శ్రీశైలంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
-
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
ఆళ్లగడ్డ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు 2వ తేదీన అంకురార్పన జరగనుందని దేవస్థాన పర్యవేక్షణాధికారి మల్లికార్జున ప్రసాద్ బుధవారం తెలిపారు. గురువారం నుంచి ఎగువ అహోబిలం, శుక్రవారం నుంచి దిగువ అహోబిల క్షేత్రాల్లో అంకుర్పారణతో 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో కొనసాగే ఉత్సవాలు 13వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గురువారం నుంచి ప్రతిరోజు ప్రత్యేక పూజలు, వాహన సేవలు ఎగువ అహోబిలంలో గురువారం, దిగువ అహోబిలంలో శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలకు అంకుర్పాణ చేస్తారు. 4 నుంచి ప్రతి రోజు ప్రత్యేక పూజధికాలను, ఆలయప్రాంగణంలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతిరోజు స్వామి అమ్మవారిని ఓ వాహనంపై కొలువుంచి మాడ వీధుల్లో ఊరేగిస్తారు. 9న ఎగువ, 10న దిగువన తిరుకల్యాణోత్సవం ఎగువ అహోబిలంలో వెలసిన జ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణం 9తేదీన, దిగువ అహోబిలంలో వెలిసిన జ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణోత్సవం 10న నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటలకు ఎదురుకోలు ఉత్సవం అనంతరం ప్రత్యేక మండపంలో కల్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రతిరోజూ స్వామి అమ్మవార్ల వాహనసేవలు బ్రహ్మోత్సవాలను పురష్కరించుకుని ప్రతి రోజు ఉదయం, రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు వివిధ వాహనసేవలతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలో: 3న సింహ వానసేవ, 4న ఉదయం హంస వాహనసేవ, రాత్రి సూర్యప్రభ వాహనసేవ, 5న హనుమంత వాహనసేవ, 6న ఉదయం శేష వాహనసేవ, రాత్రి చంద్రప్రభ వాహనసేవ, 7న శరభ వాహనసేవ, 8న పొన్నచెట్టు వాహనసేవ, 9న గజ వాహనసేవ, 10 అçశ్వ వాహనసేవ, 11న ఉదయం రథోత్సవము , 12న గరుడోత్సవం దిగువ అహోబిలంలో: 4న సింహ వాహనసేవ, 5న ఉదయం హంస వాహనసేవ, రాత్రి సూర్యప్రభ వాహనసేవ, 6న శ్రీయోగానృసింహ గారుడ విమానసేవ, రాత్రి హనుమంత వాహనసేవ, 7న ఉదయం శేష వాహనసేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ, 8న చంద్రప్రభ వాహనము, 9న పొన్నచెట్టు వాహనసేవ, 10న గజ వాహ వాహనసేవ, 11న అశ్వ వాహనసేవ, 12న రథోత్సవం, 13న గరుడ వాహనసేవలు జరుగుతాయి. -
బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి
- శ్రీశైలంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు - వైభవంగా ధ్వజావరోహణ శ్రీశైలం : శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామి సన్నిధిలో ఈ నెల 17న ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం పూర్ణాహుతితో ముగిశాయి. ఇందులో భాగంగా 9రోజులపాటు స్వామిఅమ్మవార్లకు నిత్యహోమబలిహరణలు, జపానుష్టానములు, స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు నిర్వహించారు. ప్రతి రోజూ శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగి, హంస, మయూర, రావణ, పుష్పపల్లకీ, గజ, నంది వాహనాలపై ఆవహింపజేసి గ్రామోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 4లక్షల మందికిపైగా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ఉంటారని అంచన. ఉత్సవాల ముగింపులో భాగంగా ఆదివారం జరిగిన యాగపూర్ణాహుతి సందర్భంగా అష్ట దిక్కుల్లో బలిహరణలను సమర్పించారు. ఈఓ నారాయణభరత్‌గుప్త దంపతులు, అర్చకులు, వేదపండితులు సుగంధద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు తదితర పూర్ణాహుతి ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించారు. అనంతరం వసంతోత్సవంలో భాగంగా అర్చకులు వసంతాన్ని (పసుపు, సున్నంతో కలిసిన మంత్రపూరితజలం) పూర్ణాహుతిలో పాల్గొన్న వారందరిపై చల్లారు. ఆ తరువాత చండీశ్వరుడిని ఆలయప్రదక్షణ చేయించి మల్లికాగుండం వద్దకు తీసుకువచ్చి త్రిశూల స్నానం చేయించారు. ఉత్సవాల ముగింపు సూచనగా ధ్వజావరోహణ.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17న ప్రారంభంగా కాగా ఉత్సవాల ఆరంభ సూచనగా అదేరోజు రాత్రి 8.30 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ చేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమ పూజలను నిర్వహించి ధ్వజపటాన్ని ధ్వజస్తంభం నుంచి శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛరణల మధ్య కిందకు దింపారు. కార్యక్రమంలో ఈఓ నారాయణ భరత్‌గుప్త, ఏఈఓ కృష్ణారెడ్డి, శ్రీశైలప్రభ సహాయ సంపాదకులు వెంకటబ్రహ్మాచార్య, ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌కుమార్, అర్చకులు, వేదపండితులు, వివిధ విభాగాల సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
నేడు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శుక్రవారం నుంచి ఈ నెల 27 వరకు 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వ హించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ ఉత్సవా లను పురస్కరించుకుని స్వామికి జరిగే ప్రత్యేక అభిషే కాలతో పాటు సామూహిక ఆర్జితసేవలు, హోమాలు, శాశ్వత టికెట్ కల్యాణోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్త గురువారం ప్రకటించారు. ఈ నెల 24 మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం, 25న రథోత్సవం ఉంటాయన్నా రు. 18న తిరుమల తిరుపతి దేవస్థానం తరపున, 21న రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను çసమర్పిస్తారన్నారు. -
బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
- ఫిబ్రవరి 27వరకు శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు -ఉదయం 8.30గంటలకు యాగశాల ప్రవేశం - సాయంత్రం 7గంటలకు ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ - ఆర్జిత అభిషేకాది అర్చనలు, హోమాలు రద్దు శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో స్వయంభూవుగా వెలిసిన భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవాలకు శుక్రవారం యాగశాల ప్రవేశంతో అంకురార్పణ జరగనుంది. ఉదయం 8.30 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనము, శివసంకల్పం, చండీశ్వర పూజ, ఋత్విగ్వరణము కార్యక్రమాలుంటాయి. ఆ తరువాత అఖండస్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, పంచావరణార్చన, మండపారాధన, రుద్ర కలశ స్థాపన పూజలను నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, రాత్రి 7 గంటలకు త్రిశూల పూజ, భేరీపూజ, సకల దేవతాహ్వాన పూర్వక ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ, బలిహరణలు జరుగుతాయి. 18 నుంచి 26 వరకు రోజూ ఉదయం 7.30గంటల నుంచి చండీశ్వరపూజ, పంచావరణార్చనలు, జపానుష్ఠానములు, స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు చేస్తారు. ఉత్సవాలు ముగిసే వరకు రోజూ ఉదయం 9గంటలకు రుద్రహోమం, చండీహోమాలను నిర్వహిస్తారు. 10.30గంటలకు నిత్యబలిహరణలు, సాయంత్రం 6గంటల నుంచి నిత్యపూజలు, అనుష్ఠానములు, నిత్యహవనములు, బలిహరణలుంటాయి. 18న టీటీడీ, 21న రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంప్రదాయానుసారం ఈ నెల 18న తిరుమల తిరుపతి దేవస్థానం, 21న రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను స్వామి అమ్మవార్లకు సమర్పిస్తారు. దీనికి ముందుగా ప్రధానాలయ రాజగోపురం వద్ద స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలను చేసి, వివిధ రకాలైన ఫలపుష్పాదులను సమర్పించి ఆలయప్రదక్షిణ చేసిన తరువాత పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. 24న మహాశివరాత్రి– బ్రహ్మోత్సవ కల్యాణం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 24న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లకు సాయంత్రం 7గంటల నుంచి నందివాహనసేవ, ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. రాత్రి 10.30గంటల నుంచి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, 10.30గంటల నుంచి పాగాలంకరణ, రాత్రి 12 గంటల తరువాత శాస్త్రోక్తంగా భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణాన్ని నిర్వహించడానికి ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక వేదికను తయారు చేస్తునట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. 25న రథోత్సవం మహాశివరాత్రి పర్వదినాన వధూవరులైన భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను 25న అంగరంగ వైభవంగా రథంపై ఆవహింపజేసి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. అంతకుముందు రోజు చండీశ్వరుడి ప్రభోత్సవం ఉంటుంది. 25న సాయంత్రం 3.30గంటలకు రథాంగపూజ, రథాంగహోమం నిర్వహించాక, రథశాల నుంచి అంకాలమ్మగుడి, నందిమండపం వరకు రథోత్సవం జరుగుతుంది. సాయంత్రం 7గంటల నుంచి సదస్యం, నాగవల్లి కార్యక్రమాలుంటాయి. 26న ఉదయం 9.15 గంటలకు రుద్ర, చండీహోమాలకు పూర్ణాహుతి నిర్వహించి వసంతోత్సవం, కలశోద్వాసన, త్రిశూల స్నానం తదితర కార్యక్రమాలుంటాయి. అదేరోజు సాయంత్రం ఉత్సవాల ఆరంభసూచనగా ధ్వజారోహణ చేసిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణ చేస్తారు. 27న భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లకు పుష్పోత్సవ, శయనోత్సవ, ఏకాంత సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ చేసి ఉత్సవాలకు సకల దేవత ఆహ్వాన పూర్వక ధ్వజపటావిష్కరణ జరుగుతుంది. 18న భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లు çభృంగివాహనంపై దర్శనమిస్తారు. 19న హంసç, 20న మయూర, 21న రావణవాహనం, 22న పుష్పపల్లకీ మహోత్సవం, 23న గజవాహనం, 24న ప్రభోత్సవం, నంది వాహనసేవ, 25న రథోత్సవం, 26న పూర్ణాహుతి, ధ్వజావరోహణ, 27న అశ్వవాహన సేవలుంటాయి. -
బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు
- శ్రీశైలంలో శివరాత్రికి భత్రతా చర్యలపై ఎస్పీ సమీక్ష - గుర్తింపు కార్డు ఉంటేనే సత్రాలు, లాడ్జీలు, హోటళ్లలోకి ప్రవేశం - అధిక సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు - ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు - కంట్రోల్‌రూంలు, పార్కింగ్ స్థలాలు, బారికేడ్ల ఏర్పాటు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పకడ్బందీ బందోబస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ పోలీసులకు సూచించారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలంలో తీసుకోవాల్సిన భద్రతపరమైన చర్యలపై ఆయన పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా భద్రత చట్టం ప్రకారం భక్త సందోహం అధికంగా గుమిగూడే ప్రదేశాల్లో ఆలయ ఆధికారుల సమన్వయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు నిత్యం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు సమాచారం తెలిపేందుకు వీలైనంత ఎక్కువ సంఖ్యలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి అన్నింటిని ఒక్కదానితో అనుసంధానం చేసి అవసరమైన సమాచారాన్ని తెలపాలన్నారు. తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యత కంట్రోల్ రూమ్లపై ఉంటుందన్నారు. యాత్రికుల పార్కింగ్, క్యూలైన్లు, బారికేడ్ల ప్రవేశ, నిష్క్రమణ ప్రదేశాల్లో ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గుర్తింపు కార్డులు ఉంటేనే లాడ్జీలు, సత్రాల్లోకి భక్తులను అనుమతించాలని, నిత్యం కార్డెన్ సర్చ్, తనిఖీలు చేపట్టాలన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకొని పోలీసు శాఖకు మంచి పేరును తీసుకురావాలని పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రక్షణ పరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ ప్రజలను కోరారు. కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీలు శివరామ్‌ప్రసాద్, ఐ.వెంకటేష్, ఓఎస్డీ రవిప్రకాష్, కమాండెంట్ చంద్రమౌళి, డీఎస్పీలు జే.బాబు ప్రసాదు, ఏజీ కృష్ణమూర్తి, వినోద్‌కుమార్,రామచంద్ర, ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు పార్థసారథి, కృష్ణయ్య, ఆర్ఐలు రంగముని, జార్జ్ పాల్గొన్నారు. -
కనులపండువగా ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం
మడకశిర రూరల్: మండల పరిధిలోని భక్తరపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడగుంట శ్రీఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లేడుగుంటలో ఆంజినేయస్వామి బ్రహ్మరథోత్సవాన్ని వేలాది మంది భక్తుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను భక్తులు గోవింద నామస్మరణతో ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో ఉంచి హోమం, విశేష పూజలు జరిపారు. మధ్యాహ్నం వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని లాగారు. భక్తులు బొరుగులు, అరటిపండ్లు రథంపై విసిరి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈఓ శ్రీనివాసులు, సర్పంచుల ఆధ్వర్యంలో రథోత్సవాన్ని నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించడానికి ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ దేవానంద్, ఎస్ఐ మక్భూల్‌బాషా సిబ్బందితో గట్టిపోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఈఓ శ్రీనివాసులు, సర్పంచులు మహేశ్వర్‌రెడ్డి, భీమప్ప, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కాగా బ్రహ్మరథోత్సవంలో ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని రథాన్ని లాగారు. -
భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మడకశిర రూరల్ : మండల పరిధిలోని భక్తరపల్లి లక్ష్మినరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమద్వత్రం, హోమం, ధ్వజారోహణ, అంకురార్పణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పురోహితుల వేదమంత్రోచ్ఛారణలతో ధ్వజారోహణ నిర్వహించారు. అదేవిధంగా భక్తరపల్లి లక్ష్మినరసింహస్వామిని ఎంతో ఆకర్షణీయంగా అలంకరించారు. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
-
ముగిసిన బ్రహ్మోత్సవాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా 7లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని ఆయన వివరించారు. మంగళవారం ఆయన బ్రహ్మోత్సవాల వివరాలు మీడియాతో పంచుకున్నారు. ఉత్సవాల సందర్భంగా 30లక్షల లడ్డూలను భక్తులకు అందించామని చెప్పారు. 35లక్షల మందికి అన్న ప్రసాద వితరణ చేశాం. 3.50 లక్షల మంది తలనీలాలు సమర్పించారన్నారు. రానున్న బ్రహ్మోత్సవాలను మరింత పటిష్టంగా చేస్తామని హామీ ఇచ్చారు. -
శ్రీవారి సన్నిధిలో తగ్గని రద్దీ
తిరుమల శ్రీవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు, సెలవు దినాల కారణంగా రద్దీ తగ్గలేదు. సోమవారం ఉదయం అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల కూడా క్యూలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. -
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
-
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
- శాస్త్రోక్తంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు శ్రీకారం - ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించిన సేనాపతి విష్వక్సేనుడు - పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరస్వామి తరఫున ఆయన సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంసంధ్యా సమయంలో విష్వక్సేనుడు.. ఛత్ర, చామర, మేళతాళాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగింపుగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించి తిరిగి ఆలయంలోనికి చేరుకున్నారు. వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల్లోపు ధ్వజారోహణంతో ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. తర్వాత రాత్రి 9 గంటలకు శేష వాహనంపై స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 11 వరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఐదో రోజు రాత్రి 7.30 గంటలకే గరుడ వాహనంపై స్వామి దర్శనమివ్వనున్నారు. ఎనిమిదో రోజు రథోత్సవం, చివరి రోజు చక్రస్నానంలో స్వామి సేద తీరుతారు. నేడు శ్రీవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పణ తిరుమలేశునికి సోమవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 8 గంటల తర్వాత సీఎం ఇక్కడి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి సమర్పిస్తారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని, వెలుపల పెద్ద శేషవాహనసేవలో పాల్గొని ఉత్సవమూర్తిని దర్శించుకోనున్నారు. బ్రహ్మోత్సవాల కోసం బందోబస్తు సిబ్బంది తిరుమలకు చేరుకోవడంతో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. కన్నుల వైకుంఠం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల ఆలయం ప్రత్యక్ష వైకుంఠాన్ని తలపిస్తోంది. శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహాద్వారం నుంచి గర్భాలయం వరకు సువాసనలు వెదజల్లే పుష్పాలతో పాటు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. -
బ్రహ్మోత్సవాలకు నగరం నుంచి పూలరథం
త్వరలో జరగనున్న తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు వెంగళరావునగర్ డివిజన్ నుంచి పూలరథాన్ని తీసుకెళ్ళనున్నట్టు స్థానిక కార్పొరేటర్ కిలారి మనోహర్ చెప్పారు. స్థానిక వెస్ట్ శ్రీనివాస్‌నగర్‌కాలనీ కమ్యూనిటీహాల్లో శుక్రవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ కిలారి మాట్లాడుతూ ప్రముఖ వాగ్గేయకారిణి కొండవీటి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఈ పూలరథాన్ని తిరుమలకు తీసుకెళ్ళనున్నామని అన్నారు. రథాన్ని ప్రత్యేకంగా తయారు చేయడానికి మోతీనగర్, కళ్యాణ్‌నగర్ వెంచర్-1, వెంచర్-3, సిద్ధార్థనగర్కాలనీ, వెంగళరావునగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా మహిళలు పూలను తీసుకురానున్నారని తెలిపారు. అక్టోబరు 2వ తేదీన మధురానగర్‌కాలనీలోని శ్రీఅభయాంజనేయస్వామి దేవస్థానం నుంచి రథాన్ని తరలించనున్నట్టు చెప్పారు. భజనలు, కోలాటాలు, మేళతాళాలతో అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ రథం బయలు దేరుతుందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీల ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. -
ఏడుకొండల వాడికి గద్వాల పంచెలు కానుక
బ్రహోత్సవాల సందర్భంగా శ్రీవారికి ధరింపజేసే ఎరవాడ జోడు పంచెల నేత పూర్తయింది. గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల తిరుపతి శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలకు నియమ నిష్టలతో నేత కార్మికులు గద్వాల ఎరవాడ జోడు పంచెలను అందజేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. నాటి నుంచి వస్తున్న ఆచారం మేరకు మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో చేపట్టిన శ్రీవారి ఎరవాడ జోడు పంచెల నేత గురువారం పూర్తయింది. అక్టోబర్ 3 నుంచి 11వరకు జరిగే దసరా బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీవారి అలంకరణకు గద్వాల ఎరవాడ జోడు పంచెలను ధరింపజేస్తారు. గద్వాల సంస్థానాదీశురాలు శ్రీలతాభూపాల్ లేఖను తీసుకొని శుక్రవారం తిరుపతికి వెళ్లి శ్రీవారి పంచెలను అక్కడి పేష్కార్కు అప్పగించనున్నట్లు పంచెల తయారీ నిర్వాహకుడు మహంకాళి కర్ణాకర్ తెలిపారు. 41 రోజులుగా నిష్టతో శ్రీవారి ఎరవాడ జోడు పంచెలను ఐదుగురు చేనేత కార్మికులు పనిచేసి సిద్ధం చేశారు. గద్వాల రాజుల వారసత్వంగా పంచెల సమర్పణ... శతాబ్దాలుగా గద్వాల సంస్థానాదీశులు తమ వంశ పెద్దల సంప్రదాయ ఆచారంగా శ్రీ తిరుమలేశుడికి ప్రతిఏటా బ్రహ్మోత్సవాలకు గద్వాల ఎరవాడ జోడు పంచెలను అందజేస్తారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీనివాసునికి ఉత్సవాల మొదటి శుక్రవారం రోజున, విజయ దశమి రోజున ఈ ఎరవాడ పంచెలను మూలవిరాట్‌కు ధరింప చేస్తారు. గద్వాల సంస్థానాదీశులలో ఒకరైన రాజు సీతారాంభూపాల్ తన వంశస్థుల ఇష్టదైవమైన వెంకటేశ్వరుడికి పంచెలను సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచెల విశిష్టత.. ఎరవాడ పంచె 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు, 15 అంగుళాల వెడల్పుతో అంచుఉంటుంది. శ్రీనివాసుడికి సమర్పించే ఈ పంచెలపై ఎనిమిది కోటకొమ్ములు ఉంటాయి. ఒక్కొక్క పంచె తయారు కావడానికి దాదాపు 20 రోజుల సమయం పడుతుంది. జోడు పంచెలను లింగంబాగ్ కాలనీలోని మహంకాళి కర్ణాకర్ ఇంటిపై ప్రత్యేకంగా నిర్మించిన మగ్గంపై ఐదుగురు నేత కార్మికులు ప్రత్యేక నిష్ట, భక్తి శ్రద్ధలను పాటిస్తూ ఈ పంచెలను సిద్ధం చేశారు. ఎరవాడ పంచెల తయారిలో కార్మికులు గద్దె మురళి, సాక సత్యన్న, దామర్ల శణ్ముఖరావు, కరుణాకర్, మేడం రమేష్‌లు పాల్గొన్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం - మహంకాళి కర్ణాకర్ సంస్థానాదీశుల కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాన్ని వారి వంశస్తులు కొనసాగింప చేస్తున్నారని, మైసూరు, గద్వాల సంస్థాన దీశులు తిరుమలేషుని సేవకు ప్రత్యేకత ఇచ్చారని మహంకాళి కర్ణాకర్ తెలిపారు. ఐదేళ్లుగా తన నివాసంలో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. ఈ సేవలో గద్వాల నేత కార్మికులు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని వివరించారు. గద్వాల జిల్లా ఆకాంక్ష నెరవేరాలని ఆ వెంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నామని చెప్పారు. -
ప్రమాణాల దేవుడు
కాణిపాక వినాయకుడు ⇒కోరిన వరాలు ఇచ్చే కామితార్థ ప్రదాయకుడు ⇒వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం ⇒సెప్టెంబర్ 5 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు విఘ్నేశ్వరుని ఆలయాలలో దేశంలోనే ప్రసిద్ధమైనది కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం. చిత్తూరు జిల్లాలో బాహుదా నది ఒడ్డున కాణిపాకంలో వెలసి విరాజిల్లుతున్న స్వయంభువు కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయానికి వెయ్యేళ్ళ చరిత్ర వుంది. సెప్టెంబర్ 25 వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పవిత్ర క్షేత్ర చరిత్రను మననం చేసుకొందాం... కాణిపాకంను పూర్వం విహారపురి అని పిలిచేవారు. ఈ ఆలయం గురించి ఇక్కడ ఓ కథ ప్రచారంలో ఉంది. ఈ గ్రామంలో ధర్మపరాయుణులైన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వారు గుడ్డి, మూగ, చెవిటి. అప్పట్లో ఓ ఏడాది గ్రామం కరువు కాటకాలతో అల్లాడిపోయింది. కనీసం తాగడానికి కూడా నీరు దొరకని స్థితి. కరువును జయించడానికి ఆ ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతంబావిని లోతు చేయడానికి పూనుకొన్నారు. ఈ క్రమంలో బావి తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని పలుగు, పారల సాయంతో తొలగిస్తుండగా చేతిలోని పార రాయికి తగిలి రక్తం చిమ్మి ఆ ముగ్గురు అన్నదమ్ములను తడిపింది. అంతే! వారి అంగవైకల్యం మటుమాయమైంది. వెంటనే వారు గ్రామాధికారికి, గ్రామస్తులకు జరిగింది వివరించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న గ్రామస్తులు బావిని పూర్తిగా తవ్వగా గణనాథుని శిరస్సు రూపం దర్శనమిచ్చింది. వెంటనే భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి కొబ్బరికాయలను కొట్టారు. అలా స్వామివారి విగ్రహం వద్ద కొట్టిన కొబ్బరికాయల నుంచి వచ్చిన తీర్థం కాణి భూమి (కాణి అంటే ఎకరం పొలం అని అర్థం)లోకి పారింది. అప్పటి నుంచి విహారపురి గ్రామం కాస్తా కాణిపారకమ్గా కాలక్రమేణా కాణిపాకంగా మారింది. ఇలా స్వామి వారు స్వయంభువు వరసిద్ధి వినాయకుడుగా కోరిన వరాలను అందిస్తూ భక్తుల ఇష్టదైవంగా మారాడు. సత్యప్రమాణాల దేవుడిగా... వరసిద్ధ్ది వినాయకుడు వరాలకే కాదు సత్యప్రమాణాల కు కూడా ప్రసిద్ధం. ఇక్కడ అబద్ధం చెప్పడానికి ఎంత పెద్దవారైనా వెనుకాడతారు. స్వామివారి ఎదుట తప్పుడు ప్రమాణం చేస్తే శిక్ష పడుతుందని భక్తుల ప్రగాఢవిశ్వాసం. అందువల్ల వ్యసనాలకు బానిసలైనవారికి ఇక్కడకు తీసుకొచ్చి ఇకమీదట ఫలానా వ్యసనం జోలికి పోనని ప్రమాణం చేయిస్తుంటారు. స్వామికి భయపడి ఆ వ్యసనాల నుంచి దూరమైనవారు ఎందరో ఉన్నారు. ఇక్కడ అప్పుడప్పుడు రాజకీయ ప్రమాణాలు కూడా జరగుతుంటాయి. అసెంబ్లీలో నాయకులు కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధ్దమా అంటూ సవాల్ విసరడం చూస్తుంటాం. గతంలో ఇక్కడ ప్రమాణం చేస్తే కోర్టులలో నాయ్యమూర్తులు కూడా అంగీకరించే వారట. దీన్నిబట్టి అర్థమవుతుంది స్వామివారు ఎంత సత్యప్రమాణుడో. బాహువులు ఇచ్చిన నది.... కాణిపాక ఆలయం వద్ద ప్రవహించే బహుదా నదికీ ఓ కథ ఉంది. స్వామివారిని దర్శించుకొనేందుకు శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు తమ గ్రామం నుంచి బయలుదేరారు. దారి మధ్యలో తెచ్చిన భోజన పదార్థాలు అయిపోయాయి. అప్పటికి వారు కాణిపాకం చేరుకోలేదు. చిన్నవాడైన లిఖితుడు ఆకలికి తట్టుకోలేక పక్కనే ఉన్న మామిడి తోటలో ఓ మామిడి పండు కోసుకొంటానని అన్న శంఖుడిని కోరాడు. అందుకు అన్న శంఖుడు దొంగతనం చేయడం నేరమని వారించాడు. అయినా లిఖితుడు అన్న మాటలు పెడచెవిన పెట్టి తోటలో మామిడి పండు కోసుకొని తిన్నాడు. తమ్ముడు చేసిన దొంగతనాన్ని అన్న రాజుకు తెలియజేస్తాడు. రాజు దొంగతనం చేసిన వ్యక్తికి రెండు చేతులు నరికి వేయించమని శిక్ష వేస్తారు. వెంటనే లిఖితుని రెండు చేతులను ఖండించి వేస్తారు. ఇలా తమ్ముడి చేతులు పోవడంతో అన్న శంఖుడు చాలా బాధపడతాడు. తర్వాత వారిరువురూ కాణిపాకం వరసిద్ధి వినాయకుని దర్శించుకొని పక్కనే ప్రవహిస్తున్న బహుదా నదిలో మునగగా లిఖితునికి పోయిన చేతులు తిరిగి వస్తాయి. ఇలా పోయిన చేతులు తిరిగి వచ్చాయి కనుక అప్పటి నుంచి ఆ నదికి బాహుదా (బాహువులు ఇచ్చినది కాబట్టి) నది అని పేరు వచ్చింది. నిత్యం పెరుగుతున్న స్వామి...... కాణిపాక క్షేత్రం శాతవాహనుల కాలం నుంచే ఉందని అంటారు. ఈ ప్రధాన ఆలయానికి అనుబంధంగా వాయువ్యదిశలో ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని 11వ శతాబ్దపు చోళులు నిర్మించారు కనుక కాణిపాక ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉందనడంలో సందేహం లేదు. మరో విశేషం ఏమిటంటే స్వామివారి మూలవిరాట్టు తన పరిమాణాన్ని పెంచుకుంటూ పోవడం. దీనికి తార్కాణంగా యాభై ఏళ్ల క్రితం నాటి వెండి కవచం కాని, దశాబ్ద కాలం క్రితపు మరో వెండి కవచం కాని స్వామికి పట్టకపోవడమే. ఎన్నో సేవలు మరెన్నో ఫలితాలు... స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి కోరిన వరాలు పొందడానికి ఆలయంలో ఎన్నో సేవలు అందుబాటులో ఉన్నాయి. పంచామృతాభిషేకం, గణపతిహోమం, గణపతి మోదకపూజ, మూల మంత్రార్చన, సంకటహర గణపతి వ్రతం... తదితర పూజల ద్వారా భక్తులు తమ కష్టనష్టాలను తొలగించుకుని స్వామి కృపకు పాత్రులు కావచ్చును. - పాతుకూరి నరేశ్, సాక్షి, ఐరాల, చిత్తూరు జిల్లా ఆలయానికి చేరుకునే మార్గం ఈ ఆలయం చిత్తూరుకు 12 కి.మీ, తిరుపతి నుంచి 70 కి.మీ దూరంలో ఉంది. తిరుపతి నుంచి ప్రతి 30 నిమిషాలకు, చిత్తూరు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సును ఆర్టీసి వారు నడుపుతున్నారు. తెలంగాణ నుంచి వచ్చే వారికి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సౌకర్యం. విమాన ప్రయాణం అయితే తిరుపతి (రేణిగుంట) విమానశ్రయంకు చేరుకొని అక్కడి నుంచి వాహనాల ద్వారా కాణిపాకం చేరుకోవచ్చును. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే వారు చిత్తూరు మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు. ఏ రోజు... ఏ ఉత్సవం ఈ నెల 5 న ఆరంభమైన కాణిపాక వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి. ఈఓ పూర్ణచంద్రారావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 7న నెమలి వాహనం, 8న మూషిక వాహనం, 9న శేష వాహనం, 10న వృషభ వాహనం, 11న గజవాహనం, 12న రథోత్సవం, 13న అశ్వవాహనం, 14న ధ్వజ అవరోహణం, 15న అధికార నంది వాహనం, 16న రావణబ్రహ్మ వాహనం, 17న యాళి వాహనం, 18న సూర్య ప్రభ వాహనం, 19న చంద్రప్రభ వాహనం, 20న కామధేను వాహనం, 21న పూలంగి సేవ, 22న కల్పవృక్ష వాహనం, 23న విమానోత్సవం, 24న పుష్పపల్లకి సేవ, 25న తెప్పోత్సవాలతో ముగింపు. -
అక్టోబర్ ౩ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబరు 3వ తేదీ నుంచి 11వరకు నిర్వహించాలని టీడీడీ నిర్ణయించింది. బుధవారం అన్నమయ్య భవన్లో జేఈవో శ్రీనివాసరాజు అధ్యక్షతన సమావేశమైన అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. -
రిషికేష్‌లో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి: తితిదేకి అనుబంధంగా ఉన్న రిషికేష్ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా మే 17వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. మే 18వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు, రాత్రి 7.00 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు. -
రేపటి నుంచి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏటా శ్రీరామనవమి తరువాత దశమి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం సాయంత్రం సెల్వర్ కూత్తుతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఆర్టీసీ అదనపు బస్సులు నడపనుంది. బ్రహ్మోత్సవాలపై కరువు ఎఫెక్ట్ కరువు ప్రభావం చిలుకూరు బాలాజీపై పడింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రతీర్థం రోజు 23న స్వామివారి అభిషేకం చేసేందుకు నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. బాలాజీ ఆలయం ముందు ఉన్న కోనేరులో బ్రహ్మోత్సవాల ముగింపు రోజు చక్రతీర్థం కార్యక్రమం చేపడతారు. ఆరోజు స్వామివారికి కోనేరులో అభిషేకం చేస్తారు. అందుకోసం కోనేరులో నీళ్లులేకపోతే బోరుబావుల నుంచి, ట్యాంకర్ల ద్వారా తెచ్చి కోనేరును నింపేవారు. అయితే ఈ సారి పరిస్థితి మారింది. ప్రస్తుతం కరువు పరిస్థితులతో నీళ్లు దొరకడంలేదు. ఆలయ సమీపంలో ఉన్న గండిపేట జలాశయం పూర్తిగా ఎండిపోయింది. గ్రామాల్లో ప్రజలు తాగేందుకే నీళ్లు దొరకని ఈ పరిస్థితుల్లో స్వామివారి అభిషేకం కోసం సుమారు 150 ట్యాంకర్ల నీటితో కోనేటిని నింపి ఆ తరువాత ఆ నీటిని వృధా చేయడం సరికాదని ఆలయ అర్చకులు భావిస్తున్నారు. కోనేటికి బదులు ప్రత్యేకంగా ఓ తొట్టిని ఏర్పాటు చేసి అందులో స్వామివారి అభిషేకం చేస్తామని ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్, తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు, ఆలయ అర్చకుడు రంగరాజన్ తెలిపారు. -
వెన్నెట్లో కళ్యాణం...
రాముడు పాదం మెట్టిన తావు ఒంటిమిట్ట. సీతమ్మకు దప్పిక తీర్చిన తీర్థం ఒంటిమిట్ట. వైఎస్ఆర్ కడపజిల్లాలో ఉన్న ఈ ఆలయం అందుకే తెలుగువారి అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటిగా పేరు పొందింది. రాష్ట్ర విభజన తర్వాత శ్రీరామ నవమికి ప్రభుత్వ లాంఛనాల హోదా లభించింది. శ్రీ సీతారామ కళ్యాణాన్ని శ్రీరామ నవమి నాడు పగలు దేశమంతటా రామభక్తులు నిర్వహిస్తారు. కానీ కేవలం ఒంటిమిట్ట క్షేత్రంలో మాత్రమే రాత్రి పూట నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈనెల శ్రీరామనవమి నుంచి ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు. 24వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో కళ్యాణోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. రామ‘చంద్రుడు’ ఈ క్షేత్రపురాణం ఇలా ఉంది. శ్రీరాముని జన్మఘట్టాన్ని చూసే భాగ్యానికి నోచుకోలేకపోయానని, కనీసం మంగళకరమైన కళ్యాణమైనా చూసే అదృష్టం కల్పించమని చంద్రుడు బ్రహ్మదేవుడిని కోరాడట. ఆయన సమ్మతించి చంద్రుని కోసమే స్వామి కళ్యాణాన్ని ఏదో ఒకచోట రాత్రిపూట జరిగేలా చూస్తానని మాట ఇచ్చాడట. ఆ చోటు ఒంటిమిట్ట అయ్యిందని ఒక కథనం. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీ సీతారామ కళ్యాణం ఉత్తర ఫల్గుణినక్షత్రంలో జరిగింది. విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకుల్లో ఒకరైన బుక్కరాయలు ఒంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించదలచి నప్పుడు ఈ నక్షత్రానికే సీతారామ కళ్యాణాన్ని నిర్వహించాలని తలపెట్టగా నాడు ఆ లగ్నం రాత్రి పూట రావడంతో ఆనాటి నుంచి ఒంటిమిట్టలో స్వామి కళ్యాణాన్ని రాత్రిపూటే నిర్వహించడం సంప్రదాయంగా మారింది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. బుక్కరాయలు చంద్రవంశీయులు. తన వంశ మూల పురుషుడైన చంద్రునికి ప్రీతి కలిగించినట్లు కూడా ఉంటుందని రాత్రి లగ్నంలోనే స్వామి కళ్యాణం జరిపించేవాడు. అప్పటి నుంచి ఒంటిమిట్ట క్షేత్రంలో మాత్రం స్వామి కళ్యాణాన్ని రాత్రి పూటే నిర్వహిస్తున్నారు. ఒంటడు, మిట్టడు కడపజిల్లా గెజిటీర్, కైఫీయత్తుల ప్రకారం క్రీ.శ. 1336 ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యంలో ఉదయగిరి ఓ చిన్న రాష్ట్రంగా ఉండేది. దాని పాలకుడు కంపరాయులు ఓమారు ఒంటిమిట్ట ప్రాంతాన్ని పరిశీలించగా ఒంటడు, మిట్టడు అనే బోయ వీరులు ఆ ప్రాంత రక్షకులుగా ఉండటం చూశాడు. రాజు, ఆయన పరివారానికి దాహం వేయడంతో ఒంటడు అక్కడి ఓ నీటి బుగ్గను చూపి వారి దాహార్తిని తీర్చాడు. శ్రీ సీతారాములు ఈ ప్రాంతంలో పర్యటించినపుడు సీతమ్మకు దాహం వేయగా రాముడు బాణాన్ని భూమిలోకి సంధించాడని, ఆ ప్రాంతంలో నీటి ఊట ఏర్పడి చిన్న కొలనుగా మారిందని తెలిపాడు (ప్రస్తుతం రామతీర్థంగా ఆ కొలను వాడుకలో ఉంది). దగ్గరలోని గుట్టపైని శిథిలావస్థలో ఉన్న గుడిని దర్శించిన కంపరాయలు కొత్త విగ్రహాలను ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మిస్తానని మాట ఇచ్చాడు. ఆ బాధ్యతను బోయ పాలకులైన ఒంటడు, మిట్టడుకే అప్పగించి అవసరమైన వనరులు ఏర్పాటు చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1355-56 ప్రాంతంలో విజయనగర పాలకుడైన బుక్కరాయలు కాశీ యాత్ర చేసి తిరుగు ప్రయాణంలో గోదావరి నది ఒడ్డున ఇసుకపల్లె ప్రాంతం నుంచి ప్రత్యేకంగా తెచ్చిన ఏకశిలపై రూపొందించిన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడి విగ్రహాలను ఒంటిమిట్టలో ప్రతిష్ఠించాడు. ఆ స్వామికి రఘునాయకులని పేరు పెట్టుకుని ఆరాధించారు. కాగా కోదండ రామాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు ఏకశిలపై ఉండడంతో ఒంటిమిట్టకు ఏకశిలా నగరం అని పేరు వచ్చింది. పోతన భాగవతం భక్తపోతన పెద్దలు తెలంగాణ ప్రాంతం నుంచి ఆయన బాల్యంలో ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారని ఒక పరిశీలన. ఆయన మహా భాగవతం రాసింది ఒంటిమిట్ట శ్రీరాముని సన్నిధిలోనే అని తెలుస్తోంది. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా భాగవత కావ్యాన్ని ఆయన రాజులకుగాక శ్రీరామచంద్రునికే అంకితమిచ్చాడు. ఈ ఆలయం అపురూప శిల్పకళా సంపదకు నిలయంగా ఉంది. రంగ మండపంలో 32 స్తంభాలు, 16 యాళి స్తంభాలు అద్భుతంగా ఉండి కనువిందు చేస్తున్నాయి. ఆంజనేయుడు లేని రామాలయంగా కూడా ఈ క్షేత్రానికి విశిష్టత ఉంది. ఈ ఆలయం నిర్మించిన నాటికి శ్రీరామునికి హనుమంతుడు పరిచయం కాలేదని, అందుకే స్వామి సన్నిధిలో ఆయన లేడని చెబుతారు. రాజగోపురం ఎదురుగా సంజీవరాయుడి పేరిట హనుమంతుని ఆలయాన్ని బుక్కరాయుల కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది. వాసుదాసు భక్తి భద్రాచలానికి రామదాసు ఎంతో, ఒంటిమిట్టకు వాసుదాసు అంతటి వాడు. ఆయన అసలు పేరు వావిలికొలను సుబ్బారావు. 1863లో జమ్మలమడుగులో జన్మించిన ఆయన ఎన్నో భక్తికావ్యాలు రచించారు. ఆయనకు స్వప్నంలో ఓ వ్యక్తి కనిపించి ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధ్దికి కృషి చేయాలని కోరినట్లు తోచింది. నాటి నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడే ఆయనకు ఆరాధ్యదైవమయ్యారు. తన ఆస్తిపాస్తులన్నీ ఆ రాముడికే సమర్పించారు. అంతేగాక కౌపీనం (గోచి) పెట్టుకుని టెంకాయ చిప్ప చేతబట్టి ఊరూరా భిక్షమెత్తి ఆ మొత్తాలను సైతం రాముడికే భక్తి పూర్వకంగా సమర్పించాడు. జీవితాంతం ఒంటిమిట్ట రామయ్య సేవలోనే తరించాడు. మత సామరస్యం ఒంటిమిట్ట ఆలయానికి మత సామరస్యం రీత్యా కూడా విశిష్టత ఉంది. 1790లో ఈ ప్రాంతం కర్ణాటక నవాబు టిప్పు సుల్తాన్ అధీనంలోకి రాగా, ఒంటిమిట్ట పాలన స్థానిక ప్రముఖుడు ఇమాంబేగ్ చేతుల్లోకి వచ్చింది. ఓమారు తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు ఇమాం బేగ్ ముందుకొచ్చి రాజగోపురం ఎదురుగా మెట్లకు దక్షిణం వైపున బావి తవ్వించాడు. రామకార్యానికి ఆ జలాన్ని ఉపయోగించడంతోపాటు గ్రామ ప్రజలకు కూడా ఆ బావి ఎంతో ఆదరువుగా ఉండేది. ఇమాంబేగ్ ఔదార్యానికి, మత సామరస్యతకి, మానవత్వానికి సాక్ష్యంగా ఈ బావిని నేటికీ చూడవచ్చు. - మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి ప్రతినిధి, కడప ఇక్కడికి ఇలా సులువు కడప నుంచి ఒంటిమిట్ట 25కిలోమీటర్లు దూరంలో ఉంది. కడప-రాజంపేట మార్గంలో ఉన్న ఈ క్షేత్రానికి విస్తృతంగా బస్సులున్నాయి. విమానాల్లో వచ్చే భక్తులు అటు రేణిగుంట, ఇటు కడప విమానాశ్రయాల ద్వారా చేరుకోవచ్చు. శుక్ర, శని, ఆది, సోమవారాలల్లో హైదరాబాద్ నుంచి కడపకు విమాన సౌకర్యం ఉంది. రేణిగుంట నుంచి వచ్చే భక్తులు ఒంటిమిట్టకు 110 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎటు చూసినా కడప నుంచి ఒంటిమిట్ట చేరుకోవడమే సునాయాసం. -
ఆనందమయమూ..
-
శ్రీవారి ఏనుగుకు కోపం వచ్చింది
తిరుమలలో శ్రీవారి వాహన సేవలో అపసృతి దొర్లింది. శ్రీవారి ఏనుగు తొండంతో మావటిని కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. 12.40 గంటలకు గరుడ వాహన సేవ ముగిసిన వెంటనే.. భక్తుల రద్దీతో అసహనానికి గురైన ఓ ఏనుగు ఆగ్రహానికి గురైంది. ఊరేగింపు మాడ వీధిలో తిరిగి వెళుతున్న సమయంలో తన ముందున్న మావటి సుబ్రహ్మణ్యరెడ్డిని తొండంతో కొట్టింది. దాంతో అతడు గాయపడ్డాడు. మావటిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. -
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవ రాముడు
ఒంటిమిట్ట: వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామునికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీరామనవమి, పోతన జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. మూలవిరాట్‌కు అభిషేకం, ప్రత్యేక పూజలు జరిపారు. ధ్వజస్తంభ ప్రాంగణంలో సీతా రామలక్ష్మణ ఉత్సవ విగ్రహాలను ఆశీనులను చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యుల ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దంపతులు స్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. కేఈ ఉదయం కడపలో మాట్లాడుతూ ఒంటిమిట్ట అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేస్తుందన్నారు. అమరావతి కేంద్రంగా రాజధాని ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాలని కోరుతున్నానన్నారు. -
వైభవోపేతంగా ధ్వజారోహణం
భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వసంతపక్ష తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో గురువారం ధ్వజారోహణం కన్నుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి విఘ్నాలు కలుగకుండా, ఆలయానికి రక్షణగా గరుత్మంతుని పటాన్ని ధ్వజ స్తంభంపై ఎగురవేశారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక పూజలు, ఆరాధనలు, అగ్ని ప్రతిష్టాపన నిర్వహించారు. -భద్రాచలం -
రామయ్య పెళ్లికి భద్రాద్రి ముస్తాబు
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలంలో 28న జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పాడిన తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. సీఎం కే.చంద్రశేఖర్‌రావు, గవర్నర్ నరసింహన్ పర్యటనలు అధికారికంగా ఖరారు కాకున్నా.. ఇటీవల భద్రాచలంపై ఢిల్లీస్థారులో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం తప్పనిసరిగా వస్తారని భావిస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. 21 నుంచి బ్రహ్మోత్సవాలు: స్వామివారి వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు శనివారం(21 నుంచి) నుంచి ప్రారంభం కానున్నాయి. 21న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో వేపపూత ప్రసాదం విని యోగం ఉంటుంది. ఈ సందర్భంగా మూలవరులకు అభిషేకం నిర్వహిస్తారు. 24న ఉత్సవ మూర్తులకు విశేష స్నపనం అదే రోజు సాయంత్రం అంకురారోపణ చేస్తారు. 25న ధ్వజపట భద్రక మండల లేఖనం, సాయంత్రం గరుడాధివాసం, 26న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, దేవతాహ్వానం, 27న స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 28న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంపై స్వామివారి కల్యాణాన్ని నిర్వహిస్తారు. 29న మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలోనే స్వామివారికి పట్టాభిషేకం చేస్తారు. -
దేవతలారా రండి..!
ముక్కోటి దేవతలకు ముక్కంటి ఆహ్వానం కాళహస్తి కైలాసగిరుల్లో కన్నప్ప సందడి కనుల పండువగా కన్నప్ప ధ్వజారోహణం నేడు స్వామివారి ధ్వజారోహణం శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యూయి. మాఘ బహుళ అష్టమి గురువారం సాయంత్రం 4:30 గంటలకు కాళహస్తి కైలాసగిరుల్లో భక్త కన్నప్ప ధ్వజారోహణ కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. కైలాసగిరిపైనున్న భక్త కన్నప్ప ఆలయం నుంచి అర్చకులు ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ పూజలు నిర్వహించారు. బ్రహ్మదేవుడి సారధ్యంలో జరిగే బ్రహ్మోత్సవాలకు దివి నుంచి దేవతలారా దిగిరావాలి.. దీవించాలి అంటూ అర్చకులు సంప్రదాయం ప్రకారం ఆహ్వానించారు. భక్తుడైన కన్నప్పకు ఉత్సవాల్లో ప్రథమపూజను పరమశివుడు వరంగా ఇచ్చారు. ఈ కారణంగా బ్రహ్మోత్సవాల్లో తొలి రోజున భక్త కన్నప్ప కొండపై వేడుకగా ధ్వజారోహణం నిర్వహించారు. దేవుడి ఉత్సవంలోను భక్తునికే తొలి పూజ గౌరవం దక్కింది. సాయంత్రం ముక్కంటీశుని ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తర్వాత శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ, భక్తకన్నప్ప ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. మేళాతాళాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపుగా కైలాసగిరిలోని భక్తకన్నప్ప ఆలయానికి తీసుకెళ్లారు. భక్తకన్నప్ప ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా దర్బతో తయారుచేసిన పవిత్రదారాన్ని,వస్త్రాన్ని ధ్వజానికి అలంకరించారు. తర్వాత సంప్రదాయబద్ధంగా నైవేద్యం సమర్పించారు. దీపారాధన చేయడంతో ధ్వజారోహణం పూర్తయింది. దీంతో శ్రీకాళహస్తీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. అనంతరం విద్యుద్దీపాల వెలుగులు,బాణసంచా పేలుళ్ల మధ్య ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఉరేగించారు. భక్తులు కర్పూరహారతులతో స్వాగతం పలికారు. ఆలయ ఈవో బి.రామిరెడ్డి,ఏఈవో శ్రీనివాసులురెడ్డి,ఈఈ రామిరెడ్డి,పీఆర్వో హరిబాబుయాదవ్, శాప్ చైర్మన్ పీఆర్ మోహన్,మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి,వైస్ చైర్మన్ ముత్యాల పార్థసారధి, ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్లు శాంతారామ్ జే పవార్, బీజేపీ నాయకులు కండ్రిగ ఉమ,కోలా ఆనంద్,టీడీపీ నాయకుడు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం,కంఠా ఉదయ్‌కుమార్,వైఎస్సార్సీపీ నాయకుడు తీగల భానుప్రకాష్రాయల్,ఉభయదాతలు, చెన్నైకి చెందిన కామవర్తి సాంబయ్య,సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. నేడు స్వామివారి ధ్వజారోహణం.. దేవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు, మాఘబహుళ నవమినాడు శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామివారి ధ్వజారోహణం నిర్వహిస్తారు.మధ్యాహ్నం 1.30 గంటలకు ఆలయంలోని స్వామి వారి సన్నిధికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ధ్వజారోహణం చేస్తారు. ఉదయం,సాయంత్రం వెండి అంబారీలపై స్వామి, అమ్మవారు ఊరేగుతారు.పాల సముద్రాన్ని చిలికిన సందర్భంగా వచ్చిన హాలాహలాన్ని మింగిన శివుడు మగత నిద్రలోకి జారుకుంటాడు. ఆయనను మేల్కొలపడానికి దేవతలు చేసే ఉత్సవాన్నే ధ్వజారోహణం అంటారు.దీనినే దేవరాత్రి అని కూడా పిలుస్తారు. -
నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు
ఉదయం 8.30గంటలకుయాగశాల ప్రవేశం సాయంత్రం 7 గంటలకు ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ 14న రాష్ట్రప్రభుత్వం,టీటీడీ తరుపున పట్టువస్త్రాల సమర్పణ శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం కలిసివెలసిన శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూజలు ప్రారంభమవుతాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరంభపూజలలో భాగంగా మంగళవారం ఉదయం 8.30 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనము, శివసంకల్పం, చండీశ్వర పూజ, ఋత్విగ్వరణము, 10 గంటలకు అఖండస్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, పంచావరణార్చన, మండపారాధన, రుద్ర కలశ స్థాపన పూజలను నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం 5.30 గంటల నుంచి అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, రాత్రి 7 గంటలకు త్రిశూలపూజ, భేరీపూజ, సకల దేవతాహ్వాన పూర్వక ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ, బలిహరణలు జరుగుతాయి. ఈ నెల 11 నుంచి 19 వరకు ప్రతిరోజూ ఉదయం 7.30 గంటల నుంచి చండీశ్వరపూజ, పంచావరణార్చనలు, జపానుష్ఠానములు, శ్రీస్వామివార్లకు విశేషార్చనలు,అమ్మవారికి నవావరణార్చనలు జరుగుతాయి. అలాగే ప్రతిరోజు ఉత్సవాలు ముగిసే వరకు ఉదయం 9 గంటలకు రుద్రహోమం, చండీహోమాలను నిర్వహిస్తారు. 10 గంటలకు నిత్యబలిహరణలు, సాయంత్రం 5.30 గంటల నుంచి నిత్యపూజలు, అనుష్ఠానములు, నిత్యహవనములు, బలిహరణలుంటాయి. 14న రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ తరుపున పట్టువస్త్రాల సమర్పణ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సాంప్రదాయానుసారం ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున పట్టువస్త్రాలను స్వామిఅమ్మవార్లకు సమర్పిస్తారు. దీనికి ముందుగా ప్రధానాలయరాజగోపురం వద్ద స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలను చేసి పట్టువస్త్రాలు, వివిధ రకాలైన ఫలపుష్పాదులను సమర్పించి ఆలయప్రదక్షిణ చేసిన తరువాత పట్టువస్త్రాలను సమర్పిస్తారు. 17న మహాశివరాత్రి, బ్రహ్మోత్సవ కల్యాణం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 17న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లకు సాయంత్రం 7గంటల నుంచి నందివాహనసేవ, ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. రాత్రి 10.30 గంటల నుంచి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, 10.30 గంటల నుంచి పాగాలంకరణ, రాత్రి 12 గంటల తరువాత శాస్త్రోక్తంగా శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడానికి చంద్రావతి కల్యాణమండపాన్ని సిద్ధం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 10న ధ్వజావరోహణ చేసి ఉత్సవాలకు సకల దేవత ఆహ్వాన పూర్వక ధ్వజపటావిష్కరణ చేస్తారు. మరుసటి రోజు 11న శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లు హంస వాహనంపై దర్శనమిస్తారు. 12న మయూర వాహనం, 13న భృంగి వాహనం, 14న రావణ వాహనం, 15న స్వామిఅమ్మవార్ల పుష్పపల్లకీ మహోత్సవం ఉంటుంది. 16న గజవాహనసేవ, 17న ప్రభోత్సవం, నందివాహనసేవ, 18న రథోత్సవం,19న ధ్వజావరోహణ, 20న అశ్వవాహనసేవ జరగుతుంది. 18న రథోత్సవం మహాశివరాత్రి పర్వదినాన వధూవరులైన శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను 18న అంగరంగ వైభవంగా రథంపై ఆవహింపజేసి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనికి ముందు రోజు 17న చండీశ్వరుడిని ప్రభోత్సవం ఉంటుంది. 18వ తేదీ సాయంత్రం 3.30 గంటలకు రథాంగపూజ, రథాంగహోమం నిర్వహించాక, రథశాల నుంచి అంకాలమ్మగుడి, నందిమండపం వరకు రథోత్సవం ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి సదస్యం, నాగవల్లి కార్యక్రమాలు ఉంటాయి. 19న ఉదయం 10.45 గంటలకు రుద్ర,చండీహోమాలకు పూర్ణాహుతి నిర్వహించి వసంతోత్సవం, కలశోద్వాసన, త్రిశూల స్నానం తదితర విశేష కార్యక్రమాలు ఉంటాయి. అదేరోజు సాయంత్రం ఉత్సవాల ఆరంభసూచనగా ధ్వజారోహణ చేసిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణ చేస్తారు. ఈ నెల 20న శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లకు పుష్పోత్సవ, శయనోత్సవ, ఏకాంత సేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. -
పాతగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం
యాద గిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని పాతగుట్ట బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లకు విశ్వక్సేన ఆరాధన చేసి, స్వస్తివాచనంతో ఆలయ పరిసరాలు శుద్ధిచేసి ఉత్సవాలను ఆరంభించారు. బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా వచ్చిన 10 మంది రుత్విక్కులకు దీక్షావస్త్రాలను సమర్పించారు. స్వామి, అమ్మవార్లకు, దేవస్థానం చైర్మన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి కంకణ ధారణ చేశారు. అనంతరం అంకురార్పణ చేసి రుత్విగ్వరణం నిర్వహించారు. -
నేటి నుంచి పాత‘గుట్ట’ బ్రహ్మోత్సవాలు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలోని పాతగుట్ట బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి వచ్చేనెల 4 వరకు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు స్వస్తి వాచనం, రాత్రి 8 గంటలకు అం కురార్పణం, మృత్సంగ్రహణం, 30న ఉదయం 10గంటలకు ధ్వజారోహణం, రాత్రి 8 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, 31న ఉదయం 8 గంటలకు హవనం, అలంకారం సేవ, సింహవాహన సేవ, 9 గంటలకు ఎదుర్కోలు మహోత్సవం, ఫిబ్రవరి 4న ఉదయం10 గంటలకు శ్రీవారి శతఘటాభిషేకం నిర్వహిస్తారు. -
బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(అగ్రికల్చర్): శ్రీశైలంలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి నిర్వహించే బ్రహ్మోత్సవాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలనికలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా శ్రీశైలంలో చేపట్టే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. దక్షణ భారతదేశంలోనే శ్రీశైలం ప్రసిద్ధిచెందిన శైవక్షేత్రం అయినందున ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దేశం నలుమూలల నుంచి లక్షల మంది శివభక్తులు వస్తున్నందున ఎవ్వరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలన్నారు. బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 2వ తేదీన అంకురార్పణ, ధ్వజారోహణలతో శ్రీకారం చుడతామని, 17వ తేదీన శివరాత్రి రోజు రాత్రి కళ్యాణోత్సవం, 18వ తేదీ రథోత్సవం ఉంటాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 14వ తేదీ రాత్రి 7:30 నుంచి 19వ తేదీ వరకు సర్వదర్శనం నిలుపుదల చేస్తున్నట్లుగా వివరించారు. ఈనెల 21వ తేదీన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శ్రీశైలంలోనే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. అదనపు ఎస్పీ శివకోటి బాబురావు మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు నిమిత్తం 3 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నామని తెలిపారు. -
బ్రహ్మోత్సవాలకు పనులు పూర్తయ్యేనా?
కాంట్రాక్టర్ల సమ్మెతో సందేహం అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఇక 20 రోజులే! తిరుచానూరు : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు పనులు ఇప్పుడిప్పుడే జరుగుతున్నా, బ్రహ్మోత్సవాలలోపు పూర్తవుతాయా అన్నది సందేహమే. సర్వీస్ ట్యాక్సును టీటీడీయే చెల్లించాలని టీటీడీ కాంట్రాక్టర్లు సమ్మె చేపట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 19 నుంచి 27వరకు జరగనున్నాయి. శ్రీవారికి తీసిపోని విధంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. ఆలయం, ఉద్యానవనం, తోళపగార్డెన్, ఆలయ పరిసరాలు, మాడవీధులు, పుష్కరిణితో పాటు తిరుపతి నుంచి తిరుచానూరు ఆలయం వరకు స్వాగత విద్యుత్ దీపాల తోరణాలు, వివిధ దేవతా ప్రతిమల విద్యుత్ కటౌట్లను ఏర్పాటుచేయనున్నారు. అలాగే చలువపందిళ్లు ఏర్పాటుచేయాల్సి ఉంది. చక్రస్నానం(పంచమీ తీర్థం) రోజున పుష్కరిణిలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఇటీవలే రూ.15 లక్షలతో పుష్కరిణి ఆధునీకరణ పనులు చేపట్టారు. ఇక మాడవీధుల్లో వాహన సేవా సమయంలో అమ్మవారికి భక్తులు హారతి ఇవ్వడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ కోసం తోళపగార్డెన్లో చలువ పందిళ్లు, ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటుచేస్తారు.అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఉదయం కొయ్య రథంపై అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీనికోసం కొయ్యరథానికి మరమ్మతులు, పెయింటింగ్ చేయాల్సి ఉంది. ఇవన్నీ టీటీడీ కాంట్రాక్టర్లు నిర్వహిస్తారు. అయితే 3 రోజుల నుంచి కాంట్రాక్టర్లు సమ్మెకు దిగారు. దీంతో అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాటు పనులు ఆగిపోయాయి. తమ న్యాయమైన కోరికను తీర్చకుంటే అమ్మవారి బ్రహ్మోత్సవాలను బహిష్కరిస్తామని టీటీడీ కాంట్రాక్టర్లు బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలలోపు ఏర్పాటు పనులు పూర్తవుతాయా అన్న సందేహం వ్యక్తం అవుతోంది. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు ఏమేరకు స్పందిస్తారో వేచి చూడాలి. -
వస్తున్నమయ్యా.. కురుమూర్తి రాయా!
చిన్నచింతకుంట: పాలమూరు ప్రజలు తమ ఇంటి ఇలవేల్పుగా కొలిచే కురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు జరిగే ఈ జాతరకు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాల కోసం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లుపూర్తిచేశారు. స్వామివారి ప్రధాన ఆలయం, ముఖద్వారానికి రంగులు వేశారు. లక్ష్మీదేవి ఆలయం, దిగుడుమెట్లు, ఉద్దాల మండపం, యాగశాలను ముస్తాబుచేశారు. స్వామివారు ఊరేగే వివిధ వాహన సేవలను శుద్ధిచేశారు. విడిదిసత్రాలు, గోవింద నిలయం, బారి కేడ్లు, కల్యాణ మండపానికి రంగులువేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని వసతులు కల్పించారు. నూతన వాటర్‌ట్యాంకు నిర్మాణం, జాతర ప్రాంతంలో అక్కడడక్కడ కుళాయిలను ఏర్పాటుచేశారు. భక్తులు స్నానాలు చేసేందుకు రామన్‌పాడు నీటితో కోనేరును నింపారు. ప్రతిరోజు కోనేరులో బ్లీచింగ్‌పౌడర్, సున్నం చల్లుతున్నారు. కాగా, ఇప్పుడిప్పుడే వ్యాపారులు జాతరకు చేరుకుంటున్నారు. హోటళ్లు, ఆట వస్తువుల విక్రయశాలలను సిద్ధంచేసుకుంటున్నారు. -
11 ఏళ్ల తర్వాత.. బ్రహ్మోత్సవాలకు బాబు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బ్రహ్మాండనాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించేందు కు 11 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో ఎన్.చంద్రబాబునాయుడు శుక్రవారం తిరుమలకు రానున్నారు. 2003 అక్టోబరు 1న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళుతున్న చంద్రబాబుపై అలిపిరి వద్ద మావోయిస్టులు క్లెమోర్‌మైన్‌తో దాడిచేసిన విషయం విదితమే. ఆ కేసులో ముగ్గురిని దోషులుగా నిర్ధారించి తిరుపతి కోర్టు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ను ఇవ్వడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున శ్రీవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టువస్త్రాలను సమర్పించేవారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టేదాకా ఇదే సంప్రదాయం కొనసాగింది. కానీ.. గరుడసేవ సం దర్భంగా తిరుమలకు లక్షలాది మంది భక్తులు వస్తారని, ఇదే సమయంలో సీఎం వస్తే భక్తులు ఇబ్బంది పడతారని అర్చకులు, వేద పండితులు వైఎస్ దృష్టికి తీసుకెళ్లారు. భక్తులను ఇబ్బందులకు గురిచేయకూడదనే ఉద్దేశంతో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం రోజునే శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించే ఆనవాయితీకి 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తెరతీశారు. ఆ ఆనవాయితీని కొనసాగించాలని చం ద్రబాబు నిర్ణయించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శుక్రవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏడుకొండలస్వామికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు చంద్రబాబు తిరుమలకు వస్తున్నారు. సీఎం హోదాలో చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి సరిగ్గా 11 ఏళ్లు అవుతోంది. అక్టోబరు 1, 2003న అలిపిరి వద్ద చంద్రబాబుపై మావోయిస్టులు క్లెమోర్‌మైన్స్‌తో దాడి చేశారు. ఆ సానుభూతిని ఓట్ల రూపంలో మల్చుకుని.. మరో సారి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనం ముందు సానుభూతిపై చంద్రబాబు పెంచుకున్న ఆశలు నిలబడలేకపోయాయి. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరింది. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోసారి ఏర్పాటైంది. నాలుగు నెలల క్రితం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో చంద్రబాబూ మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటికే అలిపిరి దాడి కేసు విచారణ కూడా తుదిదశకు చేరుకుంది. ఈలోగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సంబరానికి తెరలేచింది. ధ్వ జారోహణం సందర్భంలోనే వేంకటేశ్వరునికి పట్టువస్త్రాలను సమర్పించడానికి శుక్రవారం తిరుమలకు చేరుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు పర్యటనకు సరిగ్గా 24 గంటల ముందు అలిపిరి దాడి కేసుపై తిరుపతి కోర్టు తీర్పు వెలువరించింది. ఆ కేసులో ముగ్గురిని దోషులుగా నిర్ధారించి శిక్షను విధిస్తూ తీర్పును ఇవ్వడం గమనార్హం. ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. చిత్తూరు (సెంట్రల్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు రానున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఒంటి గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 1.50 గంటలకు తిరుమల శ్రీపద్మావతి అతిథి భవనానికి చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7 గంటల నుంచి 8.45 గంటల వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. 9 గంటలకు తిరుమల నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్‌కు వెళ్తారని కలెక్టర్ తెలిపారు. -
బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
రేపు ధ్వజారోహణం తిరుమల: తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శ్రీవారి తరఫున సర్వసేనాధిపతి విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్ప ణ. దీనికి సోముడు(చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దిన దినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రతలుతీసుకుంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ధ్వజారోహ ణం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.36 గంట ల నుంచి 6 గంటల్లోపు మీన లగ్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభించనున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు శుక్రవారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 27వ తేది నుంచి రూ. 50 టికెట్లు తీసుకునే సుదర్శనం భక్తులకు సంప్రదాయ దుస్తులు ధరించాలన్న నిబంధన అమలుచేయాలని టీటీడీ నిర్ణయిచింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 4వ తేది వరకు తిరుమలలోని రూ. 300 కరెంట్ బుకింగ్ టికెట్లను టీటీడీ రద్దు చేసింది. ఇదివరకే టికెట్లు పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుతించనున్నారు. కాగా తి రుమలలో బుధవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. నాలుగు గంటల్లోనే సర్వదర్శనం లభిస్తోంది. సాయంత్రం 6 గంటల సమయానికి సర్వదర్శనం కోసం 5 కంపార్ట్మెంట్లలోనే భక్తులు వేచిఉన్నారు. ఇక కాలిబాటల్లో నడిచివచ్చిన భక్తులు రెండు గంట లు, రూ.300 టికెట్ల భక్తులకు గంటలోపే దర్శనం లభిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో టీటీడీ, ప్రభుత్వ, ప్రైవే ట్సంస్థలకు గదులు కేటాయింపు ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభిస్తారు. -
తెప్పలపై వినాయకుని విహారం
పూతలపట్టు : కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామివారి బ్ర హ్మోత్సవాల్లో చివరిదైన తెప్పోత్సవం గురువారం రా త్రి అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారు కొలువుదీరి విహరిస్తూ భక్తులకు దర్శన మిచ్చారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున వేద పండితులు మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం చందనాలంకరణచేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక అలంకరణచేసి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారిని పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. మంగళవాయిద్యాల మధ్య స్వామివారిని సర్వంగసుందరంగా అలంకరించిన తెప్పపై ఆశీనులను చేశారు. స్వామివారు పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. జై వినాయక జైజై వినాయక నామస్మరణతో కాణిపాక క్షేత్రం మార్మోగింది. తెప్పోత్సవ కార్యక్రమానికి పుండరీక నాయుడు, శేషాద్రి నాయుడు ఆయన సోదరులు, దామోదరనాయుడు, హనుమంత నాయుడు, రామకృష్ణారెడ్డి కుమారులు, కొత్తపల్లె దామోదరనాయుడు, రామచంద్రనాయుడు, లంకిపల్లె మోహన్‌బాబు ఆయన సోదరులు ఉభయదార్లుగా వ్యవహరించారు. ఈ వేడుకలో ఈవో పూర్ణచంద్రరావుతోపాటు ఆలయ సిబ్బంది ఈఈ వెంకట్‌నారాయణ, ఏసీ వెంకటేష్, ఏఈవోలు ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఎస్వీ. కృష్ణారెడ్డి పాల్గొన్నారు. వినాయకుని మహాప్రసాదం వేలం వినాయకుని బ్రహ్మోత్సవాల సందర్భంగా 21 కిలోల లడ్డూ ప్రసాదాన్ని గురువారం రాత్రి బహిరంగ వేలం వేశారు. 21రోజుల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి మూలవిరాట్ వద్ద నైవేద్యంగా ఉంచిన లడ్డూ ప్రసాదానికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలో బహిరంగ వేలం వేశారు. ముగిసిన బ్రహ్మోత్సవాలు వినాయకస్వామివారి ఆలయంలో ఆగస్టు 29న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి తెప్పోత్సవంతో విజయవంతంగా ముగిశాయి. 9 రోజుల పాటు దేవస్థానంవారు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. తరువాత 11 రోజులు ఉభయదార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి. ప్రతిరోజు ఉదయం, రాత్రి స్వామివారి వాహనసేవలు నిర్వహించారు. -
బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత
తిరుమల: ఈ నెల 26 నుంచి నిర్వహించనున్న తిరుమల వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు రావచ్చని టీటీడీ అంచనా వేస్తోంది. బస, దర్శనం, ప్రయాణంతోపాటు భద్రతలో భాగంగా భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులు సంకల్పించారు. ఆమేరకు టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు అన్ని విభాగాలను ఆదేశించారు. భద్రతలో భాగంగా ఊరేగింపు సమయంలో, దర్శన క్యూల్లోనూ అగ్ని ప్రమాదాలు... వంటివి విపత్తులు జరిగితే తక్షణమే స్పందించి అన్ని విధాలా ఆదుకునేలా జాతీయ విపత్తు నివారణ సంస్థ అయిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) నుంచి ప్రత్యేక బృందాలను రప్పించనున్నారు. మెరికల్లాంటి యువ కమాం డోలతో కూడిన ఆక్టోపస్ దళాలు నిరంతరం ఆలయ ప్రాంతం, అటవీ ప్రాంతాల్లో మఫ్టీలో తిరిగేలా ఏర్పాట్లు చేశారు. ఆలయానికి ఆర్మ్డ్ రిజర్వు కమాండోల పహారా ఏర్పాటు చేశారు. టీటీడీ సెంట్రల్ కమాండెంట్ సెంటర్ బరహ్మోత్సవాలకు పెరుగుతున్న భక్తుల సంఖ్య అనుగుణంగా టీటీడీ విజిలెన్స్ విభాగం అప్రమత్తమవుతోంది. పోలీసు, విజిలెన్స్, టీటీడీ విభాగాలతో ప్రతిసారీ సెంట్రల్ కమాండెంట్సెంటర్ను ఏర్పాటుచేశారు. ఈసారి ఎన్డీఆర్ఎఫ్ బృందాల తరహాలోనే టీటీడీ విజిలెన్స్ విభాగంగా కూడా సుమారు రూ.కోటి విలువైన భద్రతకు సంబంధించి ఆధునిక పరికరాలను సొంతంగా సమకూర్చుకుంది. ఆ పరికరాలను సెంట్రల్ కమాండెంట్ సెంటర్లో అన్ని వేళలా సిద్ధంగా ఉంచుతారు. 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. నాలుగు వేల మంది పోలీసులను నియమించనున్నారు. అలాగే 150 మందికిపైగా బాంబ్ డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్లు బందోబస్తు నిర్వహిస్తాయి. -
బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు
హైదరాబాద్‌లో శాంతిభద్రతలు భేష్: గవర్నర్ తిరుమల : తిరుమలలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల బందోబస్తుకు ఎటువంటి ఇబ్బందీ లేదని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. సోమవారం ఆయన తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని, తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం లేదన్నారు. వినాయక నిమజ్జనానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకూ ఏమైనా అనుకోని ఘటనలు జరిగాయా..? ఎందుకు భయపడాలి..? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు సంతోషంగా జీవించవచ్చునని ఓ ప్రశ్నకు బదిలిచ్చారు. ఎటువంటి భయాందోళనలు అవసరం లేదని, ఈ విషయంపై తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. శ్రీవారి ఆలయంలో ప్రవేశపెట్టిన మూడు వరసల క్యూ విధానంతో సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం లభిస్తోందంటూ ఆయన ఈ పద్ధతి ప్రవేశపెట్టిన టీటీడీ అధికారులను అభినందించారు. వీఐపీలు వచ్చినప్పటికీ సామాన్యులకు ఎటువంటి ఇబ్బందిలేదని తెలిపారు. అంతకుముందు వార్షిక బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్లను ఆలయం ముందు ఆవిష్కరించారు. -
బ్రహ్మోత్సవాలకు మెరుగ్గా సేవలందించాలి
తిరుమల: తిరుమలలో సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చే భక్తులకు స్థానిక హోటల్ యజమానులు, కూరగాయల దాతలు మరింతగా సేవలు అందించాలని టీటీడీ అన్నదానం డెప్యూటీ ఈవో వేణుగోపాల్ పిలుపునిచ్చారు. స్థానిక అన్నమయ్య భవనంలో శుక్రవారం ఆయన హోటల్ యజమానులు, కూరగాయల దాతలతో వేర్వేరుగా సమీక్షించారు. మొదటగా హోటల్ యజమానుల సమావేశంలో డెప్యూటీ ఈవో వేణుగోపాల్ మాట్లాడుతూ గత ఏడాది బ్రహ్మోత్సవాలకు తిరుమలలోని వివిధ హోటళ్లు టీటీడీ పిలుపు మేరకు ముందుకు వచ్చి భక్తులకు విశేషంగా అల్పాహార వితరణ చేశారని కొనియాడారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఎక్కవ మందికి, మంచి నాణ్యతతో అల్పాహారాన్ని అందించాలని కోరారు. ఈ మేరకు హోటళ్ల యజమానులు కూడా సానుకూలంగా స్పందిస్తూ భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి సేవలు అందిస్తామని తెలిపారు. అనంతరం జరిగిన కూరగాయల దాతల సమావేశం వేణుగోపాల్ మాట్లాడుతూ గత ఏడాది బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు దాతలు దాదాపు 91 టన్నుల కూరగాయలను టీటీడీకి విరాళంగా అందజేశారన్నారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు మరో 10 టన్నుల కూరగాయలను అందించాలని కోరారు. వివిధ రకాల కూరగాయలు విరాళంగా ఇవ్వటం వల్ల భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను అందించగలమన్నారు. కూరగాయల దాతలు కూడా సానుకూలంగా స్పందించారు. అనంతరం టీటీడీ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ శుచి, శుభ్రత, నాణ్యతతో కూడిన ఆహార పదార్ధాలను భక్తులకు అందించాలని హోటళ్ల యజమానులను కోరారు. ఈ కార్యక్రమంలో అన్నదానం క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి, ఏఈవో గీత, ఇతర అధికారులు పాల్గొన్నారు.