వైభవోపేతంగా ధ్వజారోహణం
భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వసంతపక్ష తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో గురువారం ధ్వజారోహణం కన్నుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి విఘ్నాలు కలుగకుండా, ఆలయానికి రక్షణగా గరుత్మంతుని పటాన్ని ధ్వజ స్తంభంపై ఎగురవేశారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక పూజలు, ఆరాధనలు, అగ్ని ప్రతిష్టాపన నిర్వహించారు. -భద్రాచలం