యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలోని పాతగుట్ట బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి వచ్చేనెల 4 వరకు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు స్వస్తి వాచనం, రాత్రి 8 గంటలకు అం కురార్పణం, మృత్సంగ్రహణం, 30న ఉదయం 10గంటలకు ధ్వజారోహణం, రాత్రి 8 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, 31న ఉదయం 8 గంటలకు హవనం, అలంకారం సేవ, సింహవాహన సేవ, 9 గంటలకు ఎదుర్కోలు మహోత్సవం, ఫిబ్రవరి 4న ఉదయం10 గంటలకు శ్రీవారి శతఘటాభిషేకం నిర్వహిస్తారు.
నేటి నుంచి పాత‘గుట్ట’ బ్రహ్మోత్సవాలు
Published Thu, Jan 29 2015 7:09 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM
Advertisement
Advertisement