భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మడకశిర రూరల్ : మండల పరిధిలోని భక్తరపల్లి లక్ష్మినరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమద్‌వత్రం, హోమం, ధ్వజారోహణ, అంకురార్పణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పురోహితుల వేదమంత్రోచ్ఛారణలతో ధ్వజారోహణ నిర్వహించారు. అదేవిధంగా భక్తరపల్లి లక్ష్మినరసింహస్వామిని ఎంతో ఆకర్షణీయంగా అలంకరించారు.