త్వరలో జరగనున్న తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు వెంగళరావునగర్ డివిజన్ నుంచి పూలరథాన్ని తీసుకెళ్ళనున్నట్టు స్థానిక కార్పొరేటర్ కిలారి మనోహర్ చెప్పారు. స్థానిక వెస్ట్ శ్రీనివాస్‌నగర్‌కాలనీ కమ్యూనిటీహాల్‌లో శుక్రవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ కిలారి మాట్లాడుతూ ప్రముఖ వాగ్గేయకారిణి కొండవీటి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఈ పూలరథాన్ని తిరుమలకు తీసుకెళ్ళనున్నామని అన్నారు. రథాన్ని ప్రత్యేకంగా తయారు చేయడానికి మోతీనగర్, కళ్యాణ్‌నగర్ వెంచర్-1, వెంచర్-3, సిద్ధార్థనగర్‌కాలనీ, వెంగళరావునగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా మహిళలు పూలను తీసుకురానున్నారని తెలిపారు. అక్టోబరు 2వ తేదీన మధురానగర్‌కాలనీలోని శ్రీఅభయాంజనేయస్వామి దేవస్థానం నుంచి రథాన్ని తరలించనున్నట్టు చెప్పారు. భజనలు, కోలాటాలు, మేళతాళాలతో అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ రథం బయలు దేరుతుందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీల ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
బ్రహ్మోత్సవాలకు నగరం నుంచి పూలరథం
Published Fri, Sep 16 2016 7:56 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
Advertisement
Advertisement