బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
రేపు ధ్వజారోహణం
తిరుమల: తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శ్రీవారి తరఫున సర్వసేనాధిపతి విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్ప ణ. దీనికి సోముడు(చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దిన దినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రతలుతీసుకుంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ధ్వజారోహ ణం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.36 గంట ల నుంచి 6 గంటల్లోపు మీన లగ్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభించనున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు శుక్రవారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 27వ తేది నుంచి రూ. 50 టికెట్లు తీసుకునే సుదర్శనం భక్తులకు సంప్రదాయ దుస్తులు ధరించాలన్న నిబంధన అమలుచేయాలని టీటీడీ నిర్ణయిచింది.
శుక్రవారం నుంచి అక్టోబర్ 4వ తేది వరకు తిరుమలలోని రూ. 300 కరెంట్ బుకింగ్ టికెట్లను టీటీడీ రద్దు చేసింది. ఇదివరకే టికెట్లు పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుతించనున్నారు. కాగా తి రుమలలో బుధవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. నాలుగు గంటల్లోనే సర్వదర్శనం లభిస్తోంది. సాయంత్రం 6 గంటల సమయానికి సర్వదర్శనం కోసం 5 కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు వేచిఉన్నారు. ఇక కాలిబాటల్లో నడిచివచ్చిన భక్తులు రెండు గంట లు, రూ.300 టికెట్ల భక్తులకు గంటలోపే దర్శనం లభిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో టీటీడీ, ప్రభుత్వ, ప్రైవే ట్‌సంస్థలకు గదులు కేటాయింపు ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభిస్తారు.