తిరుమలలో శ్రీవారి వాహన సేవలో అపసృతి దొర్లింది. శ్రీవారి ఏనుగు తొండంతో మావటిని కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
తిరుమలలో శ్రీవారి వాహన సేవలో అపసృతి దొర్లింది. శ్రీవారి ఏనుగు తొండంతో మావటిని కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. 12.40 గంటలకు గరుడ వాహన సేవ ముగిసిన వెంటనే.. భక్తుల రద్దీతో అసహనానికి గురైన ఓ ఏనుగు ఆగ్రహానికి గురైంది. ఊరేగింపు మాడ వీధిలో తిరిగి వెళుతున్న సమయంలో తన ముందున్న మావటి సుబ్రహ్మణ్యరెడ్డిని తొండంతో కొట్టింది. దాంతో అతడు గాయపడ్డాడు. మావటిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.