నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
Published Wed, Mar 1 2017 9:26 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
ఆళ్లగడ్డ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు 2వ తేదీన అంకురార్పన జరగనుందని దేవస్థాన పర్యవేక్షణాధికారి మల్లికార్జున ప్రసాద్ బుధవారం తెలిపారు. గురువారం నుంచి ఎగువ అహోబిలం, శుక్రవారం నుంచి దిగువ అహోబిల క్షేత్రాల్లో అంకుర్పారణతో 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో కొనసాగే ఉత్సవాలు 13వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
గురువారం నుంచి ప్రతిరోజు ప్రత్యేక పూజలు, వాహన సేవలు
ఎగువ అహోబిలంలో గురువారం, దిగువ అహోబిలంలో శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలకు అంకుర్పాణ చేస్తారు. 4 నుంచి ప్రతి రోజు ప్రత్యేక పూజధికాలను, ఆలయప్రాంగణంలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతిరోజు స్వామి అమ్మవారిని ఓ వాహనంపై కొలువుంచి మాడ వీధుల్లో ఊరేగిస్తారు.
9న ఎగువ, 10న దిగువన తిరుకల్యాణోత్సవం
ఎగువ అహోబిలంలో వెలసిన జ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణం 9తేదీన, దిగువ అహోబిలంలో వెలిసిన జ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణోత్సవం 10న నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటలకు ఎదురుకోలు ఉత్సవం అనంతరం ప్రత్యేక మండపంలో కల్యాణ మహోత్సవం జరుగుతుంది.
ప్రతిరోజూ స్వామి అమ్మవార్ల వాహనసేవలు
బ్రహ్మోత్సవాలను పురష్కరించుకుని ప్రతి రోజు ఉదయం, రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు వివిధ వాహనసేవలతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా
ఎగువ అహోబిలంలో:
3న సింహ వానసేవ, 4న ఉదయం హంస వాహనసేవ, రాత్రి సూర్యప్రభ వాహనసేవ, 5న హనుమంత వాహనసేవ, 6న ఉదయం శేష వాహనసేవ, రాత్రి చంద్రప్రభ వాహనసేవ, 7న శరభ వాహనసేవ, 8న పొన్నచెట్టు వాహనసేవ, 9న గజ వాహనసేవ, 10 అçశ్వ వాహనసేవ, 11న ఉదయం రథోత్సవము , 12న గరుడోత్సవం
దిగువ అహోబిలంలో:
4న సింహ వాహనసేవ, 5న ఉదయం హంస వాహనసేవ, రాత్రి సూర్యప్రభ వాహనసేవ, 6న శ్రీయోగానృసింహ గారుడ విమానసేవ, రాత్రి హనుమంత వాహనసేవ, 7న ఉదయం శేష వాహనసేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ, 8న చంద్రప్రభ వాహనము, 9న పొన్నచెట్టు వాహనసేవ, 10న గజ వాహ వాహనసేవ, 11న అశ్వ వాహనసేవ, 12న రథోత్సవం, 13న గరుడ వాహనసేవలు జరుగుతాయి.
Advertisement
Advertisement