హంస వాహనంపై అహోబిలేశుడు
అహోబిలం (ఆళ్లగడ్డ): బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో శనివారం.. శ్రీ జ్వాలా నరసింహస్వామి హంస వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామ స్మరణతో మాడా వీధుల్లో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాలా నసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతేకంగా అలకంరించిన మండపంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. తిరిగి రాత్రి సూర్యప్రభ వాహనముపై స్వామికి గ్రామోత్సవం నిర్వహిచారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాదు, మఠం ప్రతినిథి సంపత్ పాల్గొన్నారు.