సకల దేవతలకు ఆహ్వానం
- అహోబిలంలో ధ్వజపటావిష్కరణ, ధ్వజారోహణం
– గరుత్మంతునికి విశేష పూజలు
అహోబిలం(ఆళ్లగడ్డ): బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో శుక్రవారం..శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రపటావిష్కరణ చేశారు. అంతకు ముందు గరుత్మంతున్ని..పల్లకిలో కొలువుంచి ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. మొదటి జియర్ ఆదివన్ షఠకోపన్ ఉత్సవ విగ్రహం ఎదురుగా ఉంచి శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు తరలిరావాలని ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశౠరు. శ్రీ జ్వాలా నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలు వస్తారని నమ్మకం. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిని, అమ్మవార్లను ఆశీర్వదించేందుకు వచ్చే ముక్కోటి దేవతలు, దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా గరుత్మంతుడు కాపాలా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.