శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా 7లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని ఆయన వివరించారు. మంగళవారం ఆయన బ్రహ్మోత్సవాల వివరాలు మీడియాతో పంచుకున్నారు. ఉత్సవాల సందర్భంగా 30లక్షల లడ్డూలను భక్తులకు అందించామని చెప్పారు. 35లక్షల మందికి అన్న ప్రసాద వితరణ చేశాం. 3.50 లక్షల మంది తలనీలాలు సమర్పించారన్నారు. రానున్న బ్రహ్మోత్సవాలను మరింత పటిష్టంగా చేస్తామని హామీ ఇచ్చారు.