తిరుమలలో గదుల అడ్వాన్స్ కోటా పెంచారు..
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం గదుల అడ్వాన్స్ బుకింగ్ కోటాను టీటీడీ పెంచింది. ఈవో సాంబశివరావు ఆదేశాల మేరకు మొత్తం 1,500 గదులను మంగళవారం రాత్రి నుంచి అందుబాటులో ఉంచారు. పెంచిన కోటాలో రూ.50 అద్దె గదులు 450, రూ.100 అద్దె గదులు 600, రూ.150 అద్దె గదులు 40, రూ.500 అద్దె గదులు 250, రూ.600 అద్దె గదులు 75 ఉన్నాయి. రూ.750 అద్దె గదులు 10, రూ.1000 అద్దె గదులు రూ.40, రూ.1500 అద్దె గదులు 20, రూ.2000 అద్దె గదులు 15 అందుబాటులో ఉన్నాయి.
రెండు గంటల్లో శ్రీవారి దర్శనం
భారీ వర్షాల కారణంగా తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 37,546 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానికి కేవలం రెండు గంటలు మాత్రమే పడుతోంది. హుండీ కానుకలు రూ.2 కోట్లు వచ్చాయి.