
పాతగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం
యాద గిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని పాతగుట్ట బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లకు విశ్వక్సేన ఆరాధన చేసి, స్వస్తివాచనంతో ఆలయ పరిసరాలు శుద్ధిచేసి ఉత్సవాలను ఆరంభించారు. బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా వచ్చిన 10 మంది రుత్విక్కులకు దీక్షావస్త్రాలను సమర్పించారు. స్వామి, అమ్మవార్లకు, దేవస్థానం చైర్మన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి కంకణ ధారణ చేశారు. అనంతరం అంకురార్పణ చేసి రుత్విగ్వరణం నిర్వహించారు.