
సాక్షి, విజయవాడ : ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజల ఆశలు నెరవేర్చేలా ఉదని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు అన్నారు. 2019-20 బడ్జెట్ 25 లక్షల కోట్లు దాటిందని రానున్న ఐదేళ్లలో అది 50 లక్షల కోట్లకు చేరుతుందని అంచనావేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భారత్ గొప్ప ఆర్ధిక శక్తిగా ఎదగనుంది. తాజా బడ్జెట్‌లో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత ఇచ్చారు. 6 లక్షల గ్రామాలకు జలశక్తి యోజనా పథకం ద్వారా తాగునీరు అందించనున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి ఉపాధి చూపే విధంగా బడ్జెట్ ఉంది. చైనా తరువాత భారతే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ముందుకు సాగుతోంది. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి వివిధ రంగాల్లో సుమారు రూ.35 వేల కోట్లు కేటాయింపులు జరిగాయి. తెలంగాణకు రూ.20 వేల కోట్లు కేటాయింపులు జరిగాయి. 2030 నాటికి విద్యుత్ వాహనాల వినియోగం పెరిగేలా బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించారు’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment