
ఆచార్య ఆరెస్ట్
కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతి అరెస్ట్ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? అనే కథతో ‘ఆచార్య అరెస్ట్’ సినిమా రూపొందించనున్నట్లు ‘దండుపాళ్యం’ దర్శకుడు శ్రీనివాసరాజు ప్రకటించారు.
‘యాన్ ఇన్సల్ట్ టు ఎవ్రీ హిందు’ అనేది ఉపశీర్షిక. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రామ్ తుళ్ళూరి నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘2004లో కంచి మఠంలో జరిగిన ఓ భక్తుడి హత్య నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. జయేంద్ర సరస్వతిగారిని కలసి ఆయన వెర్షన్ తీసుకోబోతున్నా’’ అన్నారు. ‘దండుపాళ్యం’కి సీక్వెల్‌గా శ్రీనివాసరాజు తీసిన ‘దండుపాళ్యం–2’ ఈ నెల 14న విడుదల కానుంది.