
సాక్షి, విజయవాడ: ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు నాయుడు ఈవీఎంలు పని చేయడం లేదని నాటకాలు ఆడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి వి. శ్రీనివాసరాజు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఈవీఎంలు గురించి మాట్లాడని చంద్రబాబు పోలింగ్ తర్వాతే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఒకవైపు 130 సీట్లు వస్తాయంటూనే, మరోవైపు ఈవీఎంలు పని చేయలేదని చెబుతున్న చంద్రబాబు.. ఇందులో ఏది నిజమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
2014 ఎన్నికలు, నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచినపుడు ఈవీఎంలపై ఎందుకు చంద్రబాబు ఆరోపణలు చేయలేదని నిలదీశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ అని, దాన్ని ఎవరు ప్రభావితం చేయలేరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని శ్రీనివాసరాజు కోరారు. (చదవండి: దురుద్దేశంతోనే ప్రభుత్వ పెద్దల దుష్ప్రచారం)
Comments
Please login to add a commentAdd a comment